What is DLT Registration system Different SMS sender IDs
ఈ మధ్య మొబైల్ ఫోనుకు వస్తున్న SMS ఎప్పుడైనా గమనించారా? మీకు SMS పంపించిన వారి అడ్రస్ చివర S, G, T, P వంటి అక్షరాలను మనం గమనించవచ్చు. చాలా వరకూ సైబర్ మోసాలు SMS ఆధారంగానే జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు సంక్షిప్త సందేశాలు పంపే సంస్థలు భారతదేశంలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) DLT వ్యవస్థలో నమోదు చేసుకోవాలి. DLT రిజిస్ట్రేషన్ అంటే TRAI నిర్దేశించిన డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీలు తమను తాము నమోదు చేసుకోవడం. అప్పుడే అధీకృత SMS పంపించేందుకు వీలవుతుంది. ఈ వ్యవస్థ అవాంఛిత వాణిజ్య కమ్యూనికేషన్‌లను అరికట్టడానికి, స్పామ్ SMS లను నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతి ఆపరేటర్లకు వారి స్వంత DLT పోర్టల్ ఉంటుంది, ఇక్కడ కంపెనీలు తమ వ్యాపార వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. (What is DLT Registration system Different SMS sender ID’s)
- S (Service): For messages related to customer service, like service reminders, account updates, and delivery notifications. సేవలకు సంబంధించిన సందేశం అని అర్థం. బ్యాంక్ అలర్ట్లు, ఓటీపీలు, సమాచారం వంటివి.
- T (Transactional): For one-time passwords (OTPs), bank alerts, and other critical transaction-related codes. ఆర్డర్ కన్ఫర్మేషన్లు. బిల్లుల చెల్లింపు తదితరాలకు.. వీటిలో ఏదో ఒకటి అడ్రస్ చివరలో లేదంటే.. అది కచ్చితంగా మోసపూరిత సమాచారమే.
- G (Government): Reserved for official communications from government departments and public bodies, ensuring these messages are easily distinguishable from other types. ప్రభుత్వానికి సంబంధించిన సందేశాలు. ఆధార్ ఓటీపీలు, ఈపీఎఫ్ఎ, ఇతర ప్రభుత్వ సంస్థలు పంపేవి.
- P (Promotional): Used for marketing and advertising messages, such as product offers, discounts, and sales. ప్రకటనల సమాచారం. మార్కెటింగ్, ఆఫర్ల వంటి సందేశాలు.
