Vitamin B-12: Health Benefits, foods, deficiency and supplements
విటమిన్ – బి12 గురించి దాని ప్రాముఖ్యత మరియు లభించే పదార్థాలు
About vitamin B12 and it’s Benefits: చురుగ్గా లేకపోవడం, వ్యాధినిరోధక శక్తి లోపించడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నోటి అల్సర్లు, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి ఇవన్నీ బి12 విటమిన్ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు. మన శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యమైనవి. అందులో బి12 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే దీని ప్రభావం శరీరంలోని దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాల మీద ఉంటుంది. (Vitamin B-12: Health Benefits, foods, deficiency and supplements)
గుండె – విటమిన్ బి12, బి6, ఫోలిక్ ఆసిడ్ మూడు కలిసి హోమోసెస్టిన్ అనే ప్రొటీన్ ను ఏర్పడకుండా నివారించందుకు అవసరమవుతాయి. ఈ ప్రొటీన్ రక్తంలో ఏర్పడి రక్తనాళాలకు నష్టం చేస్తుంది. ఆ విధంగా గుండె ఆరోగ్యానికి ఈ విటమిన్లు దోహదం చేస్తాయి. నాడీ వ్యవస్థ – నాడీ వ్యవస్థ సమర్థ వంతంగా పనిచేయ్యడానికి విటమిన్ బి12 అవసరమవుతుంది. ఆరోగ్యవంతమైన పెద్దవారిలో బి12 విటమిన్ యొక్క సగటు రోజువారీ అవసరం 2.4 మైక్రోగ్రాములు.
B12 లోపిస్తే కలిగే నస్టాలు Vitamin B12 Deficiency
- ఈ విటమిన్ తగ్గితే శరీరంలో అక్కడక్కడ సూదులు గుచ్చుకుంటున్నట్టు నొప్పి వస్తుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ పొరను ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విట మిన్ లోపం ఏర్పడితే నాడీ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. తిమ్మిర్లు రావడం అనేది నాడీ కణాలకు జరిగిన నష్టానికి ప్రతీకగా భావించవచ్చు. దీన్ని ఇలాగ వదిలేస్తే మీ కదలికల తీరులో మార్పు వస్తుంది. నడక మీద అదుపు లేనందువల్ల పడిపోయే ప్రమాదం ఉంటుంది.
- నోటి ఆరోగ్యం – మీ నోటి ఆరోగ్యం మీ పూర్తి ఆరోగ్యం గురించిన చాలా విషయాలు తెలియజేస్తుంది. బి12 కొద్ది మొత్తంలో తగ్గినప్పుడు నాలుక మీద పుండు పడి నొప్పి రావచ్చు. నాలుక ఎర్రగా కంది పోయినట్టుగా మారి కొద్దిగా వాపు కూడా వస్తుంది. ఇది మాట్లాడే తీరు, ఆహారం తీసుకునే తీరు మీద ప్రభావం చూపుతుంది.
- కంటి ఆరోగ్యం – కంటి చూపుకు కూడా బి12 అత్యవసరమైన పోషకం. బి12 లోపం ఏర్పడితే కంటికి సంబంధించిన నాడుల మీద కూడా ప్రభావం పడుతుంది. అందు వల్ల కంటి చూపు కూడా తగ్గిపోవచ్చు.
- జ్ఞాపకశక్తి – బి12 తగ్గినపుడు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సప్లిమెంట్ల వాడకం వల్ల ఈ విషయంలో లాభం ఉంటుందో లేదో ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదు.
- జీర్ణ వ్యవవస్థ – ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థ కోసం తగినన్ని నీళ్లు తాగడం, తగినంత పీచుపదార్థం కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. కానీ బి12 లోపం వల్ల కూడా మలబద్దకం లేదా విరేచనాలు లేదా ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
- చర్మం- బి12 తగ్గడం వల్ల చర్మం కూడా కాస్త పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందు కంటే బి12 తగ్గడం వల్ల ఎర్రరక్త కణాల పరిమాణం తగ్గిపోతుంది. అందువల్ల వాటి శక్తి తగ్గడం వల్ల అన్నీ శరీర భాగాలకు ప్రసరించడానికి సరిపడినంత శక్తి వాటికి ఉండదు. అందువల్ల త్వరగా మరణిస్తాయి. మరణించిన ఎర్రరక్త కణాల నుంచి వెలువడిన బైలురుబిన్ వల్ల చర్మం పచ్చగా లేదా కాస్త ఎరుపు రంగులో కనిపిస్తుంది.
బి12 సమృద్ధిగా లభించే ఆహారం (Vitamin B12 Foods)
- ఆహారం పదార్థాల్లో కేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది.
- మటన్ లేదా చికెన్ తెచ్చినప్పుడు అందులో లివర్ కనిపిస్తే కొంతమందికి నచ్చదు. తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ లివర్.. ముఖ్యంగా మటన్ లోని లివర్ మన రోజువారీ అవసరాలకు సరిపడే బి12ని అందిస్తుంది.
- చిరుధాన్యాలన్నింటినీ కలిపి చేసిన గ్రనోలాబార్లు మనకు తేలిగ్గానే దొరుకుతాయి. వారంలో ఒకటి రెండు సార్లు తిన్నారంటే… శరీరానికి కావల్సిన పీచుతో పాటు బి12 లోపం రాకుండా ఉంటుంది.
- పాలు, పెరుగు, చీజ్ అన్నింటి నుంచీ ఈ కీలకమైన విటమిన్ అందుతుంది. ఒక చీజ్ స్లైస్ నుంచి మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 28 శాతం బి12 అందుతుంది.
- రోజులో రెండు గుడ్లు తింటే ఈ విటమిన్ లోపానికి చెక్ పెట్టొచ్చు. వాస్తవానికి తెల్లసొనలో కన్నా… పచ్చసొనలో ఎక్కువగా బి12 ఉంటుంది.
- గుడ్డుని మొత్తంగా తినడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు చేపల్ని తింటే కావాల్సిన ఒమెగా ఆమ్లాలతోపాటు.. విటమిన్ కూడా అందుతుంది
- మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేలా చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండటం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది.
- ఇక శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవాలి.
Read also..