WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Thunderstorm & Lightning: Do’s and Don’ts

Thunderstorm & Lightning: Do’s and Don’ts

పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

పిడుగు ఎలా ఏర్పడుతుంది .. ?

ఆవిరి రూపంలో ఉన్న నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఒకదానితో మరోటి ఢీ కొనడం వల్ల సంభవించేదే పిడుగు. ఇలా రెండు మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్న సమయంలో కలిగే ఒత్తిడితో విద్యుత్ తరంగాలు బయటకు ఉత్పత్తి అవుతాయి. ఈ విద్యుత్ తరంగాల శక్తి లక్షల ఓల్టుల్లో ఉంటుంది. ఆ సమయంలో వచ్చే శబ్దం లక్షల డెసిబుల్స్లో ఉంటుంది. ఒక మిల్లీ సెకన్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 అంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని వెలువరుస్తుంది. అప్పుడు ఏర్పడే క్షేత్ర తీవ్రత మీటరు 2 లక్షల వోల్టులతో సమానం. ఇది ఒక లక్ష కిలో మీటర్ల పొడువుంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలో మీటర్ల దూరం ఉంటాయి. (Thunderstorm & Lightning: Do’s and Don’ts)

మెరుపులు (పిడుగు) భూమి మీదికి పడినప్పుడు వస్తువులను బట్టి తీవ్రత ఉంటుంది. మేఘాలు డీ కొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు భూమిపైకి చేరేందుకు వీలుగా సన్నటి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం గుండా ధ్వని, విద్యుత్ తరంగాలు భూమిని చేరుతాయి. ఈ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలా భూ ఉపరితలం మీద నుంచి అవి భూమిలోకి వెళ్తాయి. ఇలా వెళ్లాలంటే వాటికి మరో సాధనం కావాలి. అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయాల్లోని ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా ఈ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లిపోతాయి. ఒక్కోసారి మైదాన ప్రాంతాల్లో కూడా విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న మనుషులు, జంతువులు వాటికి సాధనంగా మారతారు.

మనకు కనిపించే మేఘంలో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం ఫాజిటివ్ చార్జ్ తో ఉంటే కింద ఉన్న భాగంలో నెగెటివ్ చార్జ్ ఉంటుంది. ఇలా ప్రతి మేఘం పాజిటివ్ నెగటివ్ ఎనర్జీతో నిర్మితమవుతుంది. ఇలా నెగెటివ్ ఎనర్జీ భూమిమీద పాజిటివ్ ఎనర్జీతో భూమి మీద కలిస్తే పిడుగ్గా మారుతుంది. పిడుగులు అత్యధిక వేగంతో భూమిపై పడుతుంటాయి. పిడుగు నేరుగా మనిషిపై కానీ జంతువులపై కానీ పడిందంటే మాడి మసైపోయినట్లే.

పిడుగులు పడతాయని మనం ఎలా గుర్తించవచ్చు

వర్షాలు వచ్చిన ప్రతి సారి పిడుగులు పడతాయన్న గ్యారెంటీ లేదు. భూప్రపంచంలో ప్రతి చోట పిడుగులు పడతాయన్న దాఖలాలు లేవు. వాతావరణ మార్పులు, క్యూములోనింబస్ మేఘాలు ఇతరత్రా పరిస్థితుల వల్లే పిడుగులు పడతాయన్నది వాస్తవం. అప్పుడే మరణాలు సంభవిస్తాయి. మెరుపు కనిపించిన క్షణంలోనే అప్రమత్తమైతే కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నపుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి. పిడుగు పాటుకు గురైన వాళ్లు ప్రాణాపాయం నుండి బయటపడటం అరుదు. ఒక్కోసారి అదష్ట వశాత్తు బయటపడితే వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి.

పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్ ఎర్త్ (రాగి తీగ) ను ఏర్పాటు చేసుకోవాలి. కాపర్ తీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతో పాటు, బోగ్గు కలిపి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్ (రాగి) తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తారు.
  • టాప్ క్లోస్ చేసి ఉన్న వాహనాల మీద పిడుగు పడడం తక్కువ..ఎందుకంటే, కప్పు మూసివేసిన వాహనాల్లో కూర్చుంటే, వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ను అన్నిదిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది.
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
  • సముద్రము, కొలనులు, సరస్సులు మరియు చెరువుల దగ్గర ఉంటే, వెంటనే దూరంగా వెళ్ళాలి.
  • ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశుకాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి.
  • కారు / బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. దీని వలన ఉరుములు, మెరుపులు నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.
  • మెరుపులతో చుట్టుపక్కల విద్యుత్ తీగలు కాలిపోయే ప్రమాదం ఉంది. కావున సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ తీగలను, కేబుల్ తీగలను తొలగించడం మంచిది.
  • ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి.
  • పిడుగు బాధితులను తాకవచ్చు, సత్వరమే వారికి సహాయం అందించండి.
  • పిడుగు బాధితుడిని వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.

ఉరుములు, మెరుపులు & పిడుగుపాటు సమయంలో చేయకూడనివి

  • ఉరుములు, మెరుపులు సంభవించినపుడు చెట్ల క్రింద, చెట్ల సమీపంలో, టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు.
  • ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు చార్జ్ ఫోన్లు / మొబైల్స్ వినియోగించరాదు.
  • పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు.
  • గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార వంటి వస్తువులు ఉంచుకోకూడదు.
  • మెరుపులు కనిపించే సమయంలో వ్యవసాయ పనుల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చోట గుంపుగా ఉండకూడదు. ఒక్కొక్కరుగా ఉండటం శ్రేయస్కరం. కచ్చితంగా మోకాళ్లపైనే తల కిందకు వాల్చి కూర్చోవాలి.
  • రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే చెట్ల కింద ఉండకూడదు.
  • ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదు.
  • ఎడ్లబండి, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ వంటి వాహనాలు నడపకూడదు.
  • టెలిఫోన్లో కూడా మాట్లాడకూదడు.
  • అటవీ ప్రాంతాల్లో ఉండకూడదు.
  • మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్థంబాలకు మరియు ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి.
  • వాహనంలో ఉండి ఉంటే లోహపు భాగాలను తాకరాదు.
  • వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఎర్తింగ్తో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • ఎత్తయిన చెట్ల కింద, శిథిల భవనాల కింద నిల్చోవడం చేయకూడదు.

Read also…

How does the pen work ? What is its history ?

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!