Thalliki Vandanam Qualifications Payment status
‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం తేది:10.07.2025 న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 9552300009కు ‘Hi” అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. (Thalliki Vandanam Qualifications Payment status)
తల్లికి వందనం పథకం అప్డేట్ :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ Raise చేసి Remarks లో Eligible and to be paid అని ఉన్న వారికి అమౌంట్స్ నిన్న క్రెడిట్ అయినవి.
- NPCI Inactive గా ఉండడం వలన Payments fail అయిన వారికి Payments process చేయబడినవి.వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి.
- పై వాటికి సంబంధించిన Payment Status లు NBM పోర్టల్ లో సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి. గమనించగలరు.
డబ్బులు పడక పోవడానికి కారణాలు
- పాఠశాల విద్యాశాఖ డేటాబేస్ లో డేటా అందుబాటులో లేకపోవడం: పాఠశాల విద్యాశాఖ డేటాబేస్ లో బిడ్డ లేదా తల్లి వివరాలు అందుబాటులో లేకపోతే అటువంటి సందర్భాల్లో GSWS తదుపరి చర్యలు తీసుకోదు.
- పాఠశాల విద్యా శాఖలో ఆధార్ వివరాలు అందుబాటులో లేక పోవడం: తల్లి, బిడ్డ ఆధార్ వివరాలు పాఠశాల విద్యాశాఖ డేటా బేస్లు అందుబాటులో లేకుంటే ఫిర్యాదులు లేవనెత్తినప్పటికీ ఆధార్ వివరాలకు మార్పులు అనుమతించబడవు. కొందరి పిల్లల ఆధార్ నెంబర్ ను 9999 9999 9999 గా నమోదు చేసి ఉండటం. ఆధార్ లో ఉన్న పేరు పాఠశాల లో పేరు ఒకేలా ఉండక పోవడం.
- తల్లి eKYC మరియు తల్లి బిడ్డ మరణం: GSWS గృహ డేటా బేస్ లో తల్లి eKYC లేకపోవడం, తల్లి లేదా బిడ్డ మరణం వంటి కొన్ని సందర్భాల్లో చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. అలాగే తల్లి ఆధార్ కు బ్యాంక్ అకౌంటు నెంబర్ సరిగా అనుసంధానం కాకపోవడం.
- పథక అర్హతకు సంబంధించిన ఫిర్యాదులు (ఉదాహరణకు భూమి, ఆస్తి మొదలైనవి): భూమి యాజమాన్యం, ఆస్తి, స్థితి మొదలైన అర్హత పరిస్థితులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్న సందర్భాల్లో అసలు మూల డేటాబేస్ లలో సంబంధిత నవీకరణలు చేయబడితే అటువంటి ఫిర్యాదులు పరిష్కరించబడినట్లు పరిగణించబడతాయి మరియు వ్యక్తి పథకానికి అర్హులుగా పరిగణించబడతారు
- అనర్హత పరామితి మరియు ఫిర్యాదుల మధ్య అసమతుల్యత: కొన్ని సందర్భాల్లో అనర్హత పరామితి వర్తించే వ్యక్తి కాకుండా వేరే కుటుంబ సభ్యుడి పేరుతో ఫిర్యాదులు లేవనెత్తినట్లు గమనించబడింది అందువల్ల సరైన ధ్రువీకరణ మరియు ప్రాసెసింగ్ ను నిర్ధారించడానికి అనర్హత పరిస్థితి ఉన్న వ్యక్తి పేరుతో మాత్రమే ఫిర్యాదులను లేవనెత్తాలని సూచించబడింది.
Check “Thalliki Vandanam” Payment status
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకునే విధానం…
- క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకోవాలి
- సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha పూరించాలి.
- తర్వాత Get OTP మీద క్లిక్ చేస్తే లింక్ చేసిన మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Thalliki Vandanam Payment status Link
కొత్తగా అప్లికేషన్ & పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో చెక్ చేసుకునేవారు. సొంతంగా స్టేటస్ చెక్ చేయనుకునే వెబ్ సైట్ [ OTP అవసరం ]
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న DA / WEA / WWDS / WDPS అధికారుల లాకింగ్ లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. [ OTP అవసరం లేదు ] వెబ్ సైట్
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
Talliki Vandanam Scheme Status 2025 Check in Whatsapp
తల్లికి వందనం స్టేటస్ వాట్సాప్ ద్వారా పొందే విధానం:
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
అక్కడ ఇచ్చిన ఆప్షన్ లను ఎంచుకుంటూ తల్లికి వందనం స్టేటస్ ను సులభంగా తెలుసుకోవచ్చు.
తల్లికి వందనం:
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, అన్ని విద్యాసంస్థల్లో చదివే అర్హతగల విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేలు నిన్న (గురువారం), ఈ రోజు (శుక్రవారం) అర్హులందరికి చెల్లించినది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో ఏడాది వరకు ఎంతమంది ఉంటే అంతమందికి నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి (2025-26) సంబంధించి ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యారులకు జులై 5న తల్లికి వందనం నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు, డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన 1,12,711మంది లబ్దిదారులకు తప్పులను సరి చేసి నిధుల జమ చేస్తారు. (Thalliki Vandanam Qualifications Payment status)
అర్హతలు ఏమిటి ..?
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి.
- కుటుంబానికి మాగాణి 3 ఎకరాలలోపు, మెట్ట 10 ఎకరాలలోపు లేదా రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉండాలి.
- కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే అర్హత లేదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది.
- విద్యుత్తు వినియోగం 12 నెలల సగటు నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి.
- పురపాలికల పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉండకూడదు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కాదు.
- పారి శుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది.
- కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే అర్హులు కాదు.
- లబ్దిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్ధి ఉండి, తల్లి డేటాబేస్లో లేకపోతే క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, మ్యాపింగ్ చేస్తారు.
- విద్యార్థులు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతూ ఉండాలి.
- ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు..
- విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
- ఒకటి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేసిన తర్వాతే ఆర్ధిక సహాయం చెల్లిస్తారు. (Talliki Vandanam Scheme Status 2025)
ముఖ్య తేదీలు:
- సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శన: జూన్ 12
- ఫిర్యాదుల స్వీకరణ: జూన్ 12 నుంచి 20
- గ్రీవెన్స్ పరిశీలన, అదనపు జాబితా సిద్ధం: జూన్ 21-28
- ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అర్హులైన విద్యార్థుల జాబితా ప్రదర్శన: జూన్ 30 లబ్ధిదారులకు నిధుల విడుదల: జులై 5
CSE వెబ్ సైట్లో స్కూల్ లాగిన్ లో చెక్ చేయు విధానం
తల్లికి వందనం పథకానికి సంబంధించి Eligibility స్టేటస్ ను CSE సైట్లో స్కూల్ లాగిన్ లో చెక్ చేసు కోవచ్చు. ఎలిజిబిలిటీ కాకపోతే ఎందుకు Not Eligible అయ్యారో కారణాలు కూడా తెలుసుకోవచ్చును.
Step-by-Step Guide:
- Login to CSE School Login
- Use your school login details to enter the CSE website
- Go to the “Services” Section
- After logging in, look at the menu and click on “Services”
- Click on “Student Search”
- Under services, you will find an option called “Student Search”. Click on it.
- Enter Child ID/ Aadhaar Number
- You can search for the student using: Child Aadhaar Number, or Child ID, PEN NO (as given in UDISE records)
- View Student Details
- Once the student data is shown, you can check the Talliki Vandanam status directly in the record.
CSE Website Link https://cse.ap.gov.in/
ముఖ్య విషయాలు
- 10 వ తరగతి పాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్ నందు చేరి కాలేజీ లో వారి పేరు ఆన్లైన్ నమోదు అయిన పిమ్మట వారికి తల్లికి వందనము రిలీజ్ చేస్తారు.
- ఇంటర్మీడియట్ 2 వ సంవత్సరము పాస్ అయిన పిల్లలకు, వారు తదుపరి చదువులకు సంబంధించి కాలేజీ (డిగ్రీ / పాలిటెక్నిక్ / బి. టక్) లో చేరిన పిదప ఫీజు రీ-ఎంటర్స్మంట్ పధకము ద్వారా లబ్ది పొందుతారు.
పిల్లలు అర్హుల జాబితాలో వుండి, ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా వుంటే మరియు ఆ పాప / బాబు 10 వ తరగతి / ఇంటర్ 2 వ సంవత్సరము పాస్ అయినవారు కాకుంటే మాత్రమే
వీరికి సచివాలయము నందు సోమవారము తే. 16/06/2025 ది నుండి గ్రీవెన్స్ పెట్టబడును. ఇందుకు గానూ ఏ పాప / బాబు పేరు మీకు అర్హుల జాబితా లో రాలేదో,
- ఆ బిడ్డ స్టూడెంట్ id నెంబరు (ఇది వారు చదువుతున్న స్కూల్ నందు రాసి ఇస్తారు)
- ఆ బిడ్డ ఆధార్ ఏరాక్స్,
- తల్లి ఆధార్ జెరాక్స్,
- రైస్ కార్డు జెరాక్స్
- పని చేస్తున్న ఫోన్ నెంబరు తో
సచివాలయము నందు సంప్రదించవలెను.
తల్లికి వందనము పధకమునకు అర్హులు అయి వుండి, పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితా లేదా అనర్హుల జాబితా రెండింటిలోనూ పేరు లేకుంటే
వీరికి సచివాలయము నందు సోమవారము తే.16/06/2025 ది నుండి గ్రీవెన్స్ పెట్టబడును యి ఇందుకు గానూ ఏ పాప / బాబు పేరు మీకు అర్హుల జాబితా లో రాలేదో,
- పిల్లల స్టూడెంట్ id సెంటర్లు [ ఇది వారు చదువుతున్న స్కూల్ (10 అంకెలు) / కాలేజీ (12 అంకెలు) నందు రాసి ఇస్తారు ]
- ఆ బిడ్డ ఆధారి జీరాక్స్,
- తల్లి ఆధార్ టెరాక్స్,
- రైస్ కార్డు జెరాక్స్
- పని చేస్తున్న ఫోన్ నెంబరు తో
సచివాలయము నందు సంప్రదించవలెను.
