WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Telugu New year Ugadi Festival History Speciality Importance

Telugu New year Ugadi Festival History Speciality Importance

ఉగాది (Telugu New year Ugadi Festival):-

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వ దినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని గంటల్లో ‘క్రోధి’ నామ సంవత్సరానికి ముగింపు పలికి ‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, ప్రాముఖ్యత,చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (Telugu New year Ugadi Festival History Speciality Importance)

ఉగాది చరిత్ర (History of Ugadi):

చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర! గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం: లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

ఉగాది విశిష్టతలు (Ugadi Speciality):

ఈ ఉగాది పండుగను, తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. “యుగ” అనగా కాలమని “ఆది” అంటే ఆరంభం అని అర్థం.  నక్షత్ర “గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది.  చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాము. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈరోజు నుండే ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు.

యుగం అనగా ‘ద్వయం లేదా ‘జంట’ అని అర్ధం. ఉగాది పండుగ వసంత రుతువులో వచ్చే పండుగ. ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు.”వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం ఇలా ఆరు రుచులు తెలిసేలా షడ్రుచుల సంగమంగా పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది  వేడుకను జరుపుకుంటారు.

తెలుగువారి లోగిళ్ళలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. పంచాంగ శ్రవణం అంటే అయిదు అంగాలు అని అర్థం చెబుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలు ఉంటాయి. ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశీ ఫలాల ఫలాల సమాచారాన్ని, తెలుసుకొని ముందుకు సాగుతారు.

వివిధ రాష్ట్రాల్లో ఉగాది?

ముఖ్యంగా ఈ పండుగను ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఉగాదిని ‘పుదు వరుష పిరప్పు’ అని పిలుస్తారు. ఈరోజు తమిళులు మన ఉగాది పచ్చడిలానే ‘వెప్పం పూ రసం’తయారు చేసుకుని తాగుతారు. కర్ణాటకలో ఈ పర్వదినాన్ని యుగాదిగా వ్యవహరిస్తారు. గసగసె పాయసం, ఒబ్బట్టు, హోళిగె రసం లాంటి ప్రత్యేకమైన వంటకాలు వండుతారు. మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.

ఉగాది ప్రాముఖ్యత (Importance of Ugadi):

ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.

  • బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
  • ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
  • వేప పువ్వు చేదు- బాధ కలిగించే అనుభవాలు
  • చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
  • పచ్చి మామిడి ముక్కలు- వగరు కొత్త సవాళ్లు
  • కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.

ఇది షడ్రుచుల సమ్మేళనం. చాలా ప్రత్యేకమైనది ఈ ఉగాది పచ్చడి.

ఉగాది ప్రసాద శ్లోకం:

“శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం.”  ఉగాది రోజున ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

ఉగాది రోజు చేయవలసిన పనులు:

  • ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి.
  • కొత్త వస్త్రాలు ధరించాలి.
  • గణపతి పూజ ఇష్టదేవత ఆరాధన తరువాత కాలపురుషున్ని పూజించాలి.
  • పురుష సూక్తం లేద విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
  • ఉగాది పచ్చడిని పురాణాలలో చెప్పిన శ్లోకం చదివిన తరువాత తీసుకుంటే.. విశేష ఫలితం లభిస్తుందని అంటారు పెద్దలు.
  • పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వినాలి.
  • ఈ రోజున మిత్ర దర్శనం, ఆర్వ పూజనం. గోపూజ, ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు.
  • ఆ నూతన సంవత్సరంలోనీ శుభాలను, అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలుపెడతారు.

అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంత జీవితం అందించాలని ఆశిస్తూ… అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు పంచాంగం 2026-27 

శంకరమంచి రామకృష్ణ శాస్త్రి సిద్దాంతి వారి సూర్యసిద్దాంత పంచాంగమ్ CLICK HERE
శ్రీ సోమేశ్వర పంచాంగం CLICK HERE
శ్రీ ఉత్తరాది మఠం పంచాంగం CLICK HERE
ములుగు క్యాలండర్ CLICK HERE
ఉగాది గ్రీటింగ్స్ యాప్ CLICK HERE
ఉగాది పంచాంగం యాప్ CLICK HERE

Read also..

Ramadan Eid al-Fitr History Significance in Telugu

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!