Swachh Andhra Guidelines Month wise Activities Pledge
Swarna Andhra Swachh Andhra (SASA): 15.03.2025
March 2025 Theme: “Avoid – SUPS” Promote Reusables (Swachh Andhra Guidelines Month wise activities pledge)
THEME | ACTIVITY | OUTCOMES |
Concept communication:
|
|
|
Swachh Andhra Pledge
స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ… ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చెయ్యటం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
March Month Guidelines:
- March – 2025 నెలలో మూడవ శనివారం ది. 15.03.2025 న నిర్వహించవలసిన Theme: “Avoid -SUPs” Promote Reusable” Concept communication: Avoid Single-use and throw Plastics/Products Promote suitable Reusable
- “స్వర్ణ ఆంధ్ర- స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమమును మూడవ శనివారము అన్ని పాఠశాలలో విధిగా అమలు పరచవలెను.
- పాఠశాలలో ప్రార్ధన -“స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” అంశముపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ఫోటో ను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చెయవలెను.
- ప్రధానోపాద్యాయులు అందరు విద్యార్ధుల కు ప్లాస్టిక్ వాడకం వలన కలిగె నష్టాలు గురించి అవగహన కల్పించి ఫోటొల ను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చెయవలెను.
- ప్రధానోపాద్యాయులు మరియు విద్యార్థులు ర్యాలి ద్వార తల్లిదండ్రులకు అవగహన కల్పించి ఫోటోల ను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చెయవలెను.
- “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమములో బాగంగా ప్రతి పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు పెంపకము, నీటి సరఫరా మొదలగు కార్యక్రమములు చేపట్టవలెను.
- పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ వాడకము నిషేధించవలెను. పాఠశాల ఆవరణ లో ప్లాస్టిక్ ను తొలిగించిన ఫోటొలను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చెయవలెను.
- విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ను భర్తీ చేయడానికి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించే విధంగా ప్రొత్సహించవలెను.
- పాఠశాలలో వంట గది మరియు వంట చేసే పరిసరాలలో ప్లాస్టిక్ వాడకము నిషేదించవలెను. ప్లాస్టిక్ ను తొలిగించి వంట గది మరియు వంట చేసే పరిసరాల ఫోటొలను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చేయవలెను.
- ప్లాస్టిక్ వాడకం వలన కలిగి నష్టాలు మరియు పర్యావరణానికి కలిగే అనర్ధాల గురించి వ్యాసరచన, చిత్రలేఖనం, నాటకం మొదలగు అవగాహన పోటీలును నిర్వహించవలెను. ఆ కార్యక్రమల కు సంబందించిన ఫోటొలను కాప్చర్ చేసి SASA App లో సబ్మిట్ చెయవలెను.
- పై తెలిపిన అన్ని అంశాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ యజమాన్య పాఠశాలలు ప్రధానోపాద్యాయులు ది.15-03-2025 SASA (స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర app నందు ప్రశ్నావళి ని ఉదయం గం. 10:00 లోగ సబ్మిట్ చెయవలెను.
స్వచ్ఛ అంధ్రా- ప్రభుత్వ – ప్రైవేట్ – ప్రజల – భాగస్వామ్యం సర్వే ఫారం (With P4 Survey Form)
- రాష్ట్రంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- ప్రశ్నలన్నిటికీ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మాత్రమే ఉంటుంది.
- సర్వే ఫారం లింకు కొరకు CLICK HERE
SWARNA ANDHRA SWACHHA ANDHRA – SASA APP
- Swachha Andhra app username: SE_UDISE CODE
- Password: PWD@1234
SASA LATEST VERSION DOWNLOAD
SASA ర్యాలీ కోసం తెలుగు నినాదాలు:
1. “పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత!”
2. “సుస్థిర జీవనం, మెరుగైన భవిష్యత్తు!”
3. “ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి – భూమిని కాపాడండి!”
4. “ప్రకృతిని ప్రేమిద్దాం – భవిష్యత్తును పరిరక్షిద్దాం!”
5. “నీటిని ఆదా చేద్దాం – జీవాలను రక్షిద్దాం!”
6. “తక్కువ వ్యర్థం – ఎక్కువ సంక్షేమం!”
7. “హరిత ప్రపంచం – ఆరోగ్యమైన భవిష్యత్తు!”
8. “ప్రకృతిని నాశనం చేయొద్దు – మన భవిష్యత్తును కాపాడుదాం!”
9. “పునర్వినియోగమే పరిష్కారం!”
10. “మన భూమి మన బాధ్యత – SASA తో ముందుకు!”
11. “పరిశుభ్రత పాటిద్దాం – ప్రకృతిని కాపాడుదాం!”
12. “ప్లాస్టిక్ వాడకం మానిద్దాం – భూమికి జీవం పోసేద్దాం!”
13. “హరిత విప్లవం – ఆరోగ్య భవిష్యత్తు!”
14. “సుస్థిర అభివృద్ధి మన లక్ష్యం!”
15. “భూమి మన ఇల్లు – దాన్ని రక్షిద్దాం!”
16. “మొక్కలు నాటండి – భవిష్యత్తును కాపాడండి!”
17. “శుభ్రమైన వాతావరణం – ఆరోగ్యమైన జీవనం!”
18. “వృథా కాకుండా నీటిని వినియోగించండి!”
19. “మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది!”
20. “పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దాం!”
Swarna Andhra Swachh Andhra (SASA): 15.02.2025
February 2025 Theme: SOURCE – RESOURCE
THEME | ACTIVITY | OUTCOMES |
Concept communication: Prevention of Mixing and disposal of waste in 3 streams @ Source as a lifestyle |
|
|
OFFICE CLEALINESS:
- అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను. (Swachh Andhra Guidelines Month wise activities pledge)
- Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను.
- Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.
- Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా, అవసరమైతే మరమ్మత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.
- Running water facility ఉండేలా చూసుకొనవలెను.
PLANTATION CAMPAIGN:
- Office లోపల Indoor plants, Office బయట Outdoor plants ఏర్పాటు చేసి, సంరక్షించవలెను.
SPECIAL SANITATION ACTIVITIES:
- శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు Plantation వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
- Green Ambassadors కు అవసరమైన safety kits & tools అందజేయాలి.
- Green Ambassadors కు చెత్తను వేరు చేయడం మరియు సేకరణ పై అవగాహన కల్పించాలి.
- తడి చెత్తకు – Green dustbin, పొడి చెత్తకు – Red dustbin, హానికరమైన చెత్తకు Blue dustbin వినియోగించవలెను.
- ఇల్లు /షాప్స్/సంస్థలు/schools మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలి.
- ఈ విషయాలు అర్థమయ్యేలా demonstration పద్ధతిలో బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలి.
- ర్యాలీలు, మైక్ announcement లు, దండోరాలు, ఆడియో / వీడియో messages ద్వారా అవగాహన కల్పించాలి.
- విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలి.
- అన్ని స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలను motivate చెయ్యాలి.
REPORTING:
- పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA group లో share చెయ్యాలి.
- SASA APP లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా SASA QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా questionnaire Excel format కూడా submit చెయ్యాలి.
- ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు, అధికారులకు, మీడియా కు ముందుగానే సమాచారం అందించి, ఈ పనులన్నీ (source segregation) వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి, విజయవంతం చేయవలెను.
Swachh Andhra Operational Guidelines, Month wise Activities pdf
Read also..