Ramadan Eid al-Fitr History Significance in Telugu

Ramadan Eid al-Fitr History Significance in Telugu

రంజాన్ పండుగ ప్రాముఖ్యత, విశిష్ఠత:

ముస్లిములు జరుపుకొనే పండుగల్లో ‘రంజాన్’ ఒకటి. ఈ పండుగను ‘ఈద్’ అని ‘ఈద్-ఉల్-ఫితర్’ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకొన్నప్పటి నుండి ముప్పై రోజులు ఈ పండుగ జరుపుకొంటారు. ముస్లిములందరు ఈ నెల రోజులు మహమ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు. (Ramadan Eid al-Fitr History Significance in Telugu)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రంజాన్ లేదా రమదాన్ పండుగ చరిత్ర (Ramadan History):-

పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే … రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల “రమదాన్”, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే “రమదాన్” మాసం.

జకాత్

జకాత్ రమదాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రమదాన్ నెలలో ‘ జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని’ జకాత్’ అని అంటారు.  దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘ జకాత్’ ఉపయోగపడుతుంది.

ఫిత్రాదానం:

జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ఫిత్రాదానం అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు.

ఉపవాసం:

రంజాన్ మాసంలో ఆరోగ్యంగా ఉన్న ముస్లింలంతా కఠోర ఉపవాసం ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. రంజాన్ మాసంలో తెల్లవారుజామున నాల్గు గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని ‘సహెరి’ అని అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తరవాత ఉపవాసం విడిచి, నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సూర్యుడి గమనాన్ని బట్టి వివిధ దేశాల్లో ఉపవాస సమయాలు మారతాయి. రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఉపవాసం ఒకటిగా భావిస్తారు.

హజ్:

ఇక మక్కా యాత్రను ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావిస్తారు. సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలని ఇస్లాం బోధిస్తుంది. ఈ మాసంలో చాలామంది మక్కాను సందర్శించి ఉమ్రా చేస్తారు. రంజాన్ నెలలో మక్కాయాత్ర చేస్తున్నవారు కూడా నమాజ్, ఖురాన్ పఠనం, అవకాశం ఉన్నంత మేరకు దానధర్మాలు చేస్తారు.

రంజాన్ విశిష్టత (Ramzan Significance):

  • పవిత్రత: ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని నమ్ముతారు, అందుకే ఈ నెల చాలా పవిత్రంగా భావిస్తారు.
  • ఉపవాసం: సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం, పానీయాలు తీసుకోకుండా ఉపవాసం చేస్తారు.
  • ప్రార్థన: రాత్రి సమయంలో అదనపు ప్రార్థనలు (తరావిహ్) చేస్తారు.
  • దాన ధర్మాలు: పేదలకు సహాయం చేస్తారు, దానధర్మాలు చేస్తారు.
  • స్వీయ-అభివృద్ధి: రంజాన్ ఆధ్యాత్మిక ప్రతిబింబం, స్వీయ-అభివృద్ధి మరియు భక్తి మరియు ఆరాధన యొక్క సమయం.
  • జకాత్: రంజాన్ మాసంలో ముస్లింలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తారు, దీనిని జకాత్ అంటారు.
  • ఈద్-ఉల్-ఫితర్: రంజాన్ ముగింపులో ఈద్-ఉల్-ఫితర్ పండుగ జరుపుకుంటారు, ఇది ముస్లింలకు చాలా ముఖ్యమైన పండుగ.
  • క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా భావిస్తారు.

రంజాన్ పండుగ (Ramadan / Eid al-Fitr):

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ‘ పండుగ ‘ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే….. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ‘పండుగ’ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే “రమదాన్” పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. రంజాన్ పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. చాంద్రమాన హిజీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు. మన దేశంలో ఈ సంవత్సరం ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31  సోమవారం జరుపుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫిత్ర (రంజాన్) …ఈ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న రంజాన్ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్ ఫిత్ర. సాధారంగా దీన్ని రంజాన్ పండుగ అని వ్యవహరిస్తుంటారు. ఈద్-ఉల్-ఫితర్ నాడు ప్రత్యేకమైన సలాత్ (ఇస్లామీయ ప్రార్థన) చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ, భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే (జమాత్) చేస్తారు. అందరూ కలిసి అల్లా గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు.

రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు ధరిస్తారు. అత్తరులు పూసుకుంటారు. ‘ఈద్ గాహ్ కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తరువాత ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుతు ఆలింగనం చేసుకుంటారు. ఆ తరవాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాదీ కలిసి ఆరగిస్తారు. మిత్రులను, బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు.

ఈదుల్ ఫిత్ర పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను … సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సూచిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. నెలరోజుల ఉపవాస ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రంజాన్ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లా సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని… పుడమిపై శాంతి వర్ధిల్లాలని…. యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ… అందరికీ రంజాన్ శుభాకాంక్షలు..

Read also..

Ugadi Festival History Significance in Telugu

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!