Pumpkin seeds Nutritional value and Health benefits in Telugu

Pumpkin seeds Nutritional value and Health benefits in Telugu

గుమ్మడి గింజల పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి, వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా గుండె, కిడ్నీ, మరియు ఎముకల ఆరోగ్యం కోసం ఇవి చాలా అవసరం. ముఖ్యంగా శాఖాహారులకు ఒక వరమని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ మొదలైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. (Pumpkin seeds Nutritional value and Health benefits in Telugu)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గుమ్మడికాయ గింజలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ఇందులో ఉండే విటమిన్-E రక్తనాళాలను బలపరుస్తుంది. రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా చేస్తే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

గుమ్మడికాయ గింజలు మన జీర్ణవ్యవస్థను సరిచేయడానికి పని చేస్తాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. విటమిన్ A, E గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే జింక్ విటమిన్ కాలేయం నుంచి కంటి రెటీనా వరకు రక్త సరఫరా వేగం చేస్తుంది. ఇది మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కళ్లను రక్షిస్తుంది. కళ్లకు రంగును అందిస్తుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది.

గుమ్మడికాయ గింజల పోషక విలువ (Nutritional value of pumpkin seeds)

యుఎస్‌డిఎ ప్రకారం, గుమ్మడికాయ గింజలు (ప్రతి 100 గ్రాములకు) ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటాయి:

  • నీరు – 4.5 g
  • శక్తి – 446 kcal
  • కార్భోహైడ్రేట్ – 53.7g
  • ప్రోటీన్ -18.5g
  • ఫ్యాట్-19.4 g
  • ఫైబర్ -18.4g
  • కాల్షియం – 55mg
  • ఐరన్ – 3.3mg
  • మెగ్నీషియం -262 mg
  • పొటాషియం -919 mg
  • ఫాస్ఫరస్ – 92 mg
  • విటమిన్ ఏ -369 mcg

గుమ్మడికాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of pumpkin seeds)

గుమ్మడికాయ విత్తనాలు ఆహార పీచుపదార్థాల (ఫైబర్స్) యొక్క గొప్ప వనరుగా ఉండటం వల్ల వీటి సేవనం జీర్ణక్రియ ప్రక్రియ రుగ్మతలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. ఈ విత్తనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు చర్మం మరియు జుట్టుకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

మరి కొన్ని ప్రయోజనాలు క్రింద చూద్దాం..  

  • చర్మం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు  మంచి మూలకాలు. ఇవి చర్మ ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం పొడి బారకుండా చేసి ముడతలను నివారిస్తాయి. అలాగే  అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలను కూడా నివారిస్తాయి.
  • జుట్టుకు: గుమ్మడి గింజల నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్ వివో అధ్యయనాలు అలోపీషియా నిర్వహణలో ఈ నూనె ప్రభావంతంగా ఉన్నట్లు కనుగొన్నాయి.
  • బరువు తగ్గుదలకు: గుమ్మడి గింజల ఫైబర్ కు మంచి వనరులు అంటే అవి వేగంగా కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి, తద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అలాగే ఇవి ఫ్యాట్స్ కు ఆరోగ్యకర వనరులు.
  • ముధుమేహం కోసం: గుమ్మడి గింజలకు ప్రభావవంతమైన హైపోగ్లైసిమిక్ చర్యలు ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి. హైపోగ్లైసిమిక్ చర్యలు అంటే రక్త చక్కర స్థాయిలను తగ్గించే చర్యలు తద్వారా అవి ముధుమేహం నిర్వహణ కు సహాయం చేస్తాయి.
  • గుండె ఆరోగ్యం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్  ఫ్యాటీ ఆసిడ్లకు మంచి వనరులు ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
  • మెదడుకు: యాంటీయాక్సిడెంట్లకు మంచి వనరులుగా గుమ్మడి గింజలు రెయాక్టీవ్ ఆక్సిజన్ జాతుల సంఖ్యను తగ్గిస్తాయి మరియు వాటి వలన మెదడుకి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. తద్వారా అల్జిమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • చర్మ ఆరోగ్యం కోసం (Pumpkin seeds benefits for the skin): గుమ్మడికాయ విత్తనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి స్వేచ్ఛారాశుల (ఫ్రీ రాడికల్స్) వల్ల కలిగే ఆక్సీకరణ నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. గాయం/పుండును నయం చేసే ప్రక్రియలో గుమ్మడికాయ గింజలు సహాయ పడతాయి. చర్మం పొడి బారకుండా ఉండటానికి మరియు ముడతలు కనబడకుండా దాయడంలో ఇవి సహాయపడతాయి.
  • జుట్టుకు గుమ్మడికాయ విత్తనం (Pumpkin seed for the hair): పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో జుట్టు రాలడం గుమ్మడికాయ గింజల నూనె సహాయంతో నివారించవచ్చు. గుమ్మడికాయ గింజల నూనె అలోపేసియా నిర్వహణలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.  “ఆండ్రోజెన్ అలోపేసియా,” అనేది పురుషులలో జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం మరియు వృద్ధులైన పురుషులలో 70% కంటే ఎక్కువ మందిని దెబ్బ తీస్తుందిది.  గుమ్మడికాయ గింజల నుండి పొందిన నూనెను ఉపయోగించడం ద్వారా ఈ జుట్టు సమస్యను నివారించవచ్చు.
  • జీర్ణక్రియ కోసం (Pumpkin seeds for digestion): గుమ్మడికాయ గింజలు పీచు ఆహారపదార్థాల (ఫైబర్) యొక్క గొప్ప వనరు. ఈ విత్తనాలు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ విత్తనాలను వాటిపై ఉండే కవచం (షెల్) తో పాటు సురక్షితంగా తినవచ్చు లేదా మీరు వాటిని పెనంపై/ఓవెన్లో దోరగా (తేలికగా) వేయించుకొని తినవచ్చు. మంచి రుచి కోసం మీరు కొంచెం నూనె మరియు ఉప్పును గుమ్మడికాయ గింజలకు జోడించవచ్చు.
  • బరువు తగ్గడానికి గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds for weight loss): గుమ్మడికాయ గింజలు పీచుపదార్థాలకు (ఫైబర్స్) గొప్ప వనరులు, అంటే అవి మంచి సంతృప్తి సూచికను అందిస్తాయి, అనగా అవి మీకు కడుపు నిండిన అనుభూతిని ముందుగా కలిగిస్తాయి. ఇది అతిగా తినడం మరియు అనారోగ్యకరమైన చిరుతిండిని నివారిస్తుంది.
  • చక్కెరవ్యాధి నియంత్రణకు గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds for diabetic control): గుమ్మడికాయ గింజలు గణనీయమైన హైపోగ్లైసీమిక్ (రక్తములో చక్కెర శాతం ప్రమాద స్థాయికి తగ్గుట) ప్రభావాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు నిరూపించారు. అంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలలో ఉన్న నికోటినిక్ ఆమ్లం, త్రికోణెలైన్ మొదలైన మాక్రోమోలిక్యుల్స్ యొక్క కార్యకలాపాలు గ్లైసెమిక్ నియంత్రణకు కారణమవుతాయి.
  • గుండె ఆరోగ్యానికి గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds for heart): ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజల యొక్క ఈ పని పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది మరియు గుమ్మడికాయ విత్తన నూనె వాడకంతో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌పై దాని నిర్దిష్ట చర్యలే దీనికి కారణం. గుమ్మడికాయ విత్తన నూనెను సేవించే మహిళల్లో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (మంచి కొలెస్ట్రాల్) మరియు గోధుమ బీజ నూనెను సేవించే సమూహంతో పోలిస్తే తక్కువ స్థాయి డయాస్టొలిక్ రక్తపోటు ఉంటుంది. హృదయనాళ చర్యల వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది మరింత సహాయపడుతుంది.
  • మెదడుకు గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds for the brain): మానవ శరీరంలోని రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను తగ్గించడంలో గుమ్మడికాయ విత్తనాలు సహాయపడతాయి, తద్వారా మెదడుకు కలిగే నష్టాన్ని తిప్పికొట్టవచ్చు.
  • మహిళల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు (Pumpkin seeds for women’s health): రుతుక్రమం ఆగిపోయిన మహిళలు గుమ్మడికాయ గింజల్ని తింటే రుతువిరతి తర్వాత సాధారణంగా వచ్చే తలనొప్పి, కీళ్ల నొప్పులు మరియు వేడి ఆవిర్లు (hot flushes) వంటి రుగ్మతల్ని తగ్గించడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ విత్తన మోతాదు (Pumpkin seed dosage)

గుమ్మడికాయ గింజల్ని మౌఖికంగా తిన్నపుడే సురక్షితం. కొన్ని గుమ్మడి గింజల్ని మాత్రం పచ్చిగా లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ప్రత్యామ్నాయంగా, ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల గుమ్మడికాయ గింజల పొడిని తీసుకోవచ్చు. గుమ్మడి గింజల పొడిని ఉదయం మరియు సాయంత్రం తీసుకోవచ్చు. ఆరోగ్యవంతులైన వ్యక్తులకు గుమ్మడివిత్తనాల రోజువారీ మోతాదు 10 మి.గ్రా మించకూడదు.

Read also..

Sun stroke/ Heat stroke Symptoms, Precautionary Measures & Remedies in Telugu

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!