Prasar Bharati “Waves OTT” Android / IOS APP download
ఓటీటీ ‘వేవ్స్’ ను ఆవిష్కరించిన ప్రసార భారతి Prasar Bharati OTT
భారత పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ దిగ్గజ సంస్థ ప్రసార భారతి గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ‘వేవ్స్’ను ఆవిష్కరించింది. వీడియో గేమింగ్, వినోదరంగానికి భారత్ ప్రధాన గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో ప్రసార భారతి (Prasar Bharati OTT) ఓటీటీ ‘వేవ్స్’ను (Waves) అందుబాటులోకి తీసుకొచ్చింది. (Prasar Bharati Waves OTT Android IOS APP download)
ఈ ప్రసార వేదిక ద్వారా యూజర్లకు రామాయణం, మహాభారతాలను ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటు రేడియో ప్రోగ్రామ్స్, భక్తి పాటలు, గేమ్స్, ఈ- బుక్స్ను కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేవ్స్ 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా 12 కంటే ఎక్కువ భాషల్లో.. 10కి పైగా కేటగిరీల్లో విభిన్న కంటెంట్ ను పొందవచ్చు. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఉచిత గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.
Waves ప్రత్యేకతలు:
- ఇతర స్టీమింగ్ సేవలకు భిన్నంగా.. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) భాగస్వామ్యంతో వేవ్స్ ను రూపొందించారు.
- పెద్దల కోసం అలనాటి చిత్రాలు, పాటలతో పాటు చిన్నారుల కోసం వినోద కార్యక్రమాలు ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెనాలిరామ్ వంటి యానిమేషన్ ఫిల్మ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
- వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఉచిత గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.
- ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్లను కూడా చూడవచ్చు.
- కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
WAVES is finally here!
Explore WAVES, the new OTT platform by Prasar Bharati, for FREE. Stream old Doordarshan favourites like Ramayan and Mahabharat and the latest releases like Fauji 2.O. What’s more? You can now listen to radio programs & devotional songs, read books, play games, shop and much more, only on WAVES.
Prasar Bharati “Waves OTT” Android APP
Waves OTT IOS APP
Also download..