WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Palaka Telugu Padamalika e-book

Palaka Telugu Padamalika e-book

“పలక” తెలుగు పదమాలిక

పుస్తకంలోని ముఖ్య విషయాలు: సరళ పదాలు, గుణింతాక్షరపదాలు, ద్విత్వాక్షరపదాలు, సంయుక్తాక్షరపదాలు, ప్రాసపదాలు, భాషాంశాలు మరెన్నో.. ఉంటాయి.
తెలుగు భాషను సులభంగా నేర్పుటకు & అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకు చక్కగా ఉపయోగపడేపుస్తకం

“పలక” తెలుగు పదమాలిక పుస్తకమును ఉపయోగించుటలో సూచనలు

ముఖ్యంగా ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల కొరకు అంశాలు ఉన్నవి. ఒక అభ్యాసమును ఒక పేజీకి పరిమితం చేశాను. పట్టికలో అమరికను బట్టి పదాలను అందించడం జరిగినది. అసంపూరక పదాలు, చంచల పదాలు, కొన్ని నామవాచకములు కూడా ఉన్నవి. వీటిని విద్యార్థులచే చదివించడానికి, చూచిరాత, ఉక్తలేఖనం కొరకు ఉ పాధ్యాయులు వినియోగించవచ్చు. (Palaka Telugu Padamalika e-book)

పదాలు అసంపూర్తిగా ఉండవచ్చు కానీ, పూర్తి వాక్యంలో ఇమిడిపోతాయి. కొన్నిపదాలకు ‘ O’ చేర్చడం వలన అవి సంపూరకాలగును. గళ్ళ అమరికల రీత్యాము అక్షరం బదులు ఉంచబడినది. గమనించగలరు. వ్యాకరణాంశాలు తెలుపుట ఈ పుస్తకం యొక్క ఉద్దేశం కాదు. పదజాలాన్ని వివిధ రూపాల్లో అందించాలన్నదే మా లక్ష్యం.

గుణింతాక్షర, ఇతర పదాలలో మొదటి అక్షరమును పరిచయ అక్షరంగా ఉంచాము. కుదరని పక్షంలో రెండవ, చివరి అక్షరంతో పదాలను అందించడం జరిగింది. సమీప సారూప్య పదాలను పట్టికలలో పొందుపరచలేదు. ఎందుకంటే అలాంటి పదాలను చూడగానే మిగతా పదాలు మనసులో మెదులుతాయి. ఉదా:- లేదు చూడగానే లేడు, లేరు, లేను, లేవు…ఇలా ఉపాధ్యాయులు పొడిగించగలరు. వీలైనంతవరకు రెండు లేదా మూడు అక్షరముల పదాలు మాత్రమే అందించడం జరిగినది.

వాక్యాలు అన్నీ ఖచ్చితమైన నియమావళిననుసరించినవి కాకపోవచ్చుకానీ పెద్దలు అర్థం చేసుకొని వివరించగలుగుతారు. విద్యార్థుల స్థాయిని మించిన వదాలను వినహాయించి, లేదా వివరించి పరిచయం చేయగలరని ఉపాధ్యాయులకు మనవి.

రచయిత

బొల్లినేని సోమసుందరరావు

“పలక” తెలుగు పదమాలిక పుస్తకము (ప్రధమ భాగం)

DOWNLOAD

“పలక” తెలుగు పదమాలిక పుస్తకము (ద్వితీయ భాగం)

DOWNLOAD

Thank you for reading... Share this...
error: Content is protected !!