WhatsApp Channel Join Now
Telegram Group Join Now

NMMS One Time Registration (OTR) in National Scholarship portal

NMMS One Time Registration (OTR) in National Scholarship portal

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం 
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ.
పత్రికా ప్రకటనది :18-09-2025

2025 డిసెంబర్ 7 న జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో నమోదు చేసుకొనుటకు, మరియు 2021, 2022, 2023 సంవత్సరాలలో ఎంపిక కాబడి గత సంవత్సరం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో అప్లికేషన్ నమోదు చేసుకున్న విద్యార్ధుల కొరకు మరొక అవకాశంగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ 30-09-2025 వరకు పొడిగించినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేశారు. ఈ సంవత్సరం 10, 11, 12 తరగతులు (ఇంటర్మీడియట్) ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో సాధారణ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ కూడా ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకొనుటకు అర్హులు. కావున ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో సాధారణ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా రెన్యువల్ https://scholarships.gov.in/public/userManual/KYC_REGISTRATION_PROCESS_INSTITUTES_V1.1.pdf ను సంప్రదించవలెను. HOI / INO username password ల కొరకు కళాశాల వారు సంబంధిత జిల్లా NMMS నోడల్ ఆఫీసర్ ను సంప్రదించవలెను. రెన్యువల్ చేసుకొనని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు. రెన్యువల్ చేసుకొన్న ప్రతి విద్యార్థి తన బ్యాంక్ ఖాతా తన ఆధార్ నెంబరుకు సీడ్ చేయించుకొని DBT ద్వారా డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలెను. ఈ పధకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్ధి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాల/కళాశాల వారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు. (NMMS One Time Registration (OTR) in National Scholarship portal)

Press Note on NMMS Scholarship pdf (Date: 21.07.2025)
DOWNLOAD

One Time Registration – National Scholarship Portal APP

DOWNLOAD

National Scholarship Portal Official website

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!