MJPAPBCWREIS 5th Class, Inter Admission Entrance Test-2025

MJPAPBCWREIS 5th Class, Inter Admission Entrance Test-2025

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ

2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేదీ నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ననుసరించి ఆయా ఎం జె పి పాఠశాలల్లో లేదా బీసీ హాస్టల్ లో పరీక్ష నిర్వహించబడును. (MJPAPBCWREIS 5th Class, Inter Admission Entrance Test-2025)

పరీక్ష కొరకు అర్హత:

వయస్సు: బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు 01.09.2014 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరముల మించి ఉండరాదు. వీరు 01.09.2013 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.

ఆదాయ పరిమితి:

విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ. 1,00,000 లకు మించరాదు.

  • పాత జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
  • విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా 2023-24, 2024-25 చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగవ తరగతి 2024 25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.

పాఠశాలల్లో ప్రవేశం:

విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది పట్టిక ఒకటిలో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనది.

ప్రవేశ పరీక్ష:

ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో (02) రెండు గంటల వ్యవధిలో 100 మార్కులకు తెలుగు 15 ఇంగ్లీషు 25 లెక్కలు 30 పరిసరాల విజ్ఞానం 30 మార్కులలో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.

  • జవాబులను ఓఎంఆర్ షీట్ లో గుర్తించాలి.
  • పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.

పరీక్షా కేంద్రం:

విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడును పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టిక్కెట్ లో ఇవ్వబడును ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి( అనాధ, మత్స్యకార) మరియు అభ్యర్థి కోరన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.

బీసీ గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి రిజర్వేషన్ల వివరాలు

SchoolOC/

EBC

BCSCSTOrphanFisher menTotal
ABCDE
BC Residential school2%20%28%3%19%4%15%6%3%0%100%
Fishermen school1%7%10%1%7%4%15%6%3%46%100%
  • ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్ధులు లేనియెడల అట్టి ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బిసి కేటగిరి అభ్యర్ధులకు కేటాయిస్తారు.
  • ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే లెక్కలలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు అప్పుడు కూడా సమానమైన ర్యాంకు పొందితే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
  • 4% శాతం రిజర్వేషన్ వికలాంగులకు కేటగిరి తో నిమిత్తం లేకుండా కేటాయించబడుతుంది.
  • జిల్లాల వారీగా పాఠశాల వివరాలు ఆ పాఠశాలలో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక 01 లో ఇవ్వబడినవి.
  • ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
  • ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు కాల్ లెటర్స్ పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.
  • మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా మొదటి లిస్టు రెండవ లిస్టు మూడవ లిస్టు ఖాళీలను బట్టి ఇవ్వబడుతుంది.

దరఖాస్తు చేయు విధానం

అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకుని సంతృప్తి చెందిన తరువాత ఏదేని పేమెంట్ ఏపీ ఆన్లైన్ కి ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు పుట్టిన తేదీ తండ్రి సంరక్షకుని మొబైల్ నెంబరు వెళ్లి రు.100 చెల్లించిన తరువాత ఒక జర్నల్ నంబరు ఇవ్వబడుతుంది జర్నల్ నంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబర్ మాత్రమే.

ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్సైట్ https://mjpapbcwreis.apcfss.in/paymentPage ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఈ ‘జనరల్ నెంబర్ను పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం కాలంలో నమోదు చేయవలెను.

గడువు

  • ఆన్లైన్ దరఖాస్తును తేదీ 15.02.2025 నుండి 15.03.2025 తేదీ వరకు చేసుకోవచ్చును
  • ఆన్లైన్ దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును నింపిన దరఖాస్తు నమోనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
  • దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధ్రువీకరణ సమీకృత కుల, జనన, ఆదాయం ధ్రువపత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు దృవపత్రాలు (ఒరిజినల్) పొంది ఉండాలి. ఒరిజినల్ దృవపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేనియెడల విద్యార్థి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.
  • ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు గాని గురుకుల పాఠశాలకు గాని మరియు ఈమెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించరు అట్టి అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు.
  • హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగా తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
  • హాల్ టికెట్లు పోస్టులో గానీ నేరుగా గాని అభ్యర్థులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అర్హత లేని అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించబడవు.

దరఖాస్తు నింపుటకు అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు

  • దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
  • పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
  • పాఠశాల ప్రాధాన్యత క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి,
  • దరఖాస్తును నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
  • సెల్ నంబరు వ్రాయునప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నంబరు లేదా సమీప బంధువుల నెంబరు ఇవ్వవలయును.
  • దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్ధియే పూర్తి బాధ్యత వహిందాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
  • ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావు లేదు కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్నీ వివరాలు సరిచూసుకోవాలి.
  • ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.
  • పట్టిక ఒకటి లో చూపించిన విధంగా ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్ధులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బదిలీ చేయబడురు.

Schedule of MJPAPBCWREIS V Class Admission Entrance Test 2025-26

Apply Online V Class MJPAPBCRJCET 2025-26 Important Dates
ActivityDates
MJPAPBCWREIS Notifications for Common Entrance Test 2025-2610th February 2025
MJPAPBCWREIS V Class Admission Entrance Test online application Starts from15th February 2025
V Class Admission Last Date to Apply15th March 2025
Payment of Application Fees for V Class Admission TestRs.100/-
Date of Entrance Test27th April 2025

MJPAPBCWREIS 5th Class Admission Notification

DOWNLOAD

MJPAPBCWREIS Backlog Classes Admission Notification

DOWNLOAD

MJPAPBCWREIS Intermediate Admission Notification

DOWNLOAD

Official website CLICK HERE

Read also..

AP Model School 6th Class Admission Notification

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!