Mega DSC-2025 Call Letters
డీఎస్సీ అభ్యర్థులకు కాల్ లెటర్లు: డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది. సర్టిఫికెట్ల పరిశీలనపై ఎస్ ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. సరైన పత్రాలు సమర్పించని, వారి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. (Mega DSC-2025 Call Letters)
మేగా డి.యస్.సి-2025 సర్టిఫికెట్ల పరిశీలన అన్నీ ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ది.28-08-2025న గురువారం జరుగానున్నది. కాబట్టి వివిధ కేటగిరీ పోస్టులకుగాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత మెగా డి.యస్.సి. లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడు చేసుకొని అందులో పేర్కొన్న సూచనలు అనుసరించాలి. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు, సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో వ్యక్తిగత మెగా డి.యస్.సి -2025 లాగెన్ నందు అప్లోడ్ చేసుకొని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. , సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చునప్పుడు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారి వారిచే Attest చేసిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఇటీవల జారీచేసిన కులధృవీకరణ పత్రం (వర్తిస్తే), అంగవైకల్యం ధృవీకరణ పత్రం (వర్తిస్తే), కాల్ లెటర్ తో సూచించిన ఇతర సర్టిఫికెట్లుతో హాజరు కావాలి. అభ్యర్థితో పాటు ఒక్కరిని మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతించడం జరుగును.
DSC 2025 Call Letters (Candidate login)
Read also..
