Manabadi Telugu Monthly December 2024 e-Magazine

Manabadi Telugu Monthly December 2024 e-Magazine

“మన బడి” డిసెంబర్ 2024 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి

సంపాదకుల మాట

ఇది మనబడి. ఇక్కడ నేర్చుకుందాం. నేర్పుదాం. తెలుసుకుందాం. తెలియజేద్దాం. విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా వికాసానికి మార్గం చూపుదాం. మాట, ఆట, పాట ఏదైనా విద్యే. నేను ఒక గురువు అనుకోవద్దు. నేనే ఒక నిత్య విద్యార్థి అనుకుందాం. ఒక మంచి పౌరసమాజాన్ని, ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించే భావిభారత పౌరులు మన వద్దే ఉన్నారు. సకల వృత్తులు, ఉపాధులు, కళలు విద్యార్థి నుంచి వికసించేవే. పిల్లల ఆలోచనలు గొప్పవి. విద్యార్థుల ఆవిష్కరణలు అమూల్యమైనవి. రాసే రాతలు, గీసే గీతలు, పాడే పాటలు, ఆడే మాటలన్నీ సరికొత్త పాఠాలే. (Manabadi Telugu Monthly December 2024 e-Magazine) శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ శైశవ గీతిలో చిన్నారుల ఆనంద ప్రపంచాన్ని మన ముందుంచారు.

“పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-

కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ

 ఏమీ ఎరుగని పూవుల్లారా,

అయిదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే,

వాన కురిస్తే,

ఆకసమున హరివిల్లు విరిస్తే

అవి మీకే అని ఆనందించే

కూనల్లారా!”

అంటూ తన గీతం వినమంటూనే చిన్నారి స్వేచ్ఛా లోకంని ఆవిష్కరించిన మహాకవి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాగీతి వినిపిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠశాలల పిల్లల శారీరక, మానసిక, విద్యా వికాసానికి పాటుపడుతోన్న ప్రభుత్వం మనబడి మాసపత్రిక ఆలోచనకు నాందిగా నిలిచింది. బడి అనే స్వేచ్ఛా ప్రపంచంలో పిల్లల సృజనకు ఒక వేదిక మనబడి మాసపత్రిక. ఉపాధ్యాయులు పాఠాలు, జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు, క్రీడలు నేర్పించే తరగతి గది మనబడి. విద్యావేత్తల సూచనలు, సంస్కరణాభిలాషుల అభిప్రాయాల మాలిక మనబడి పత్రిక. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ-సమగ్రశిక్షా ఆధ్వర్యంలో వెలువడుతున్న మనబడి మాసపత్రికని నిండు మనసుతో ఆశీర్వదించండి.. ఆదరించండి…

– గౌ. బి శ్రీనివాసరావు, IAS రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా

రచనలకు ఆహ్వానం

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రచయితలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి…

పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విద్యా విషయక, విజ్ఞాన అంశాలతో -వస్తున్న మాసపత్రిక మన బడి కోసం.. మీ నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. పిల్లలకు -విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రచనలు ఏవైనా.. ఎవరైనా పంపవచ్చు. కథలు, వ్యాసాలు, కవితలు, గేయాలు, జోకులు, బొమ్మలు, కార్టూన్లు, అనువాద రచనలు, సృజనాత్మక బోధనా పద్ధతులు, విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ప్రాజెక్టులు.. ఇలా ఏ అంశాన్నయినా రాసి పంపండి. బాగున్నవాటిని ప్రచురిస్తాం. సొంత రచనలై ఉండాలి. ఎక్కడ ప్రచురితం కాకూడదు. మీ పేరు, ఫోన్ నంబరు, చిరునామా, హామీ పత్రం తప్పనిసరిగా జోడించండి. ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు. ఎంపిక కాని రచనలు తిరిగి పంపబడవు. ప్రచురితమైన వాటిలో ఉత్తమ రచనలకు చక్కని బహుమతి ఇవ్వబడును. ఈ రచనా యజ్ఞంలో పిల్లలు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు రచయితలు భాగస్వాములవ్వాలని కోరుతున్నాం. ఇందులో రచయితల వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా వారి సొంతం రచయితల అభిప్రాయాలతో సంపాదకులు, ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఏకీభవించాల్సిన పనిలేదు.

మీ రచనలు పంపాల్సిన చిరునామా:

స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ & ఎడిటర్, సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్, పటమట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 520010, whatsapp నెంబర్ : 8712652298, ఈ మెయిల్  manabadimagazine@gmail.com

Manabadi Telugu Monthly December 2024 e-Magazine

DOWNLOAD

Sharing is caring!

error: Content is protected !!