Manabadi January 2025 Telugu Monthly e-Magazine

Manabadi January 2025 Telugu Monthly e-Magazine

మన బడి” జనవరి 2025 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి

సంపాదకుల మాట

పాత సంవత్సరం వెళ్లిపోయింది. వీడ్కోలు చెప్పేసారా? కొత్త సంవత్సరం వచ్చేసింది. స్వాగతం పలికేశారా? ఒక ఏడాది గడిచిపోయిందంటే, ఆది ఒక అనుభవం, గుణపాఠం. ఏం చేయాలి? ఏం చేయకూడదు? పొరపాట్లు ఎలా జరిగాయి? అని సమీక్షించుకునే సందర్భం. ప్రయత్నమే తొలి విజయం అంటారు. అసలు ప్రయత్నమే చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది? గత ఏడాది పరీక్షలలో మార్కులు రాలేదా? కారణాలు ఏంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే. ఈ ఏడాది మార్కులు వస్తాయి. (Manabadi January 2025 Telugu Monthly e-Magazine)

బడిలో మీరు వెనకబడ్డారా? చదువులోనా? ఆటల్లోనా? పాటల్లోనా? మీరు వెనకబడ్డారు అంటేనే, పోటీలో ముందున్నారని అర్థం.. బోలెడు రేటు పెట్టి సీటు కొని కార్పొరేటు స్కూళ్లలో చదివే వారు మీకంటే ఏం ఎక్కువ? మన ప్రభుత్వ యాజమాన్యంలో 45087 స్కూళ్లున్నాయి. లక్షలాది మంది ఉపాధ్యాయులు 35 లక్షలకు పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పదార్థాలను ప్రాంతాలవారీ ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ మార్పులు చేశాం. అన్నపూర్ణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటుచూసినా సస్యశ్యామలమైన పచ్చని పొలాలను తలపించే రంగులను పోలిన ఏకరూప దుస్తులు అందించనున్నాం. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందించాం.

పాడిపంటలు తులతూగే వేళ.. ప్రతీ ఇంటా సంక్రాంతి కాంతులు వెల్లి విరిసే ఆనంద హేలలో కొత్త సంవత్సరం, విద్యా సంక్రాంతికి స్వాగతం పలుకుదాం.. పాఠశాలల్లో విద్యాసేద్యంతో తరగని నిధియైన విద్యా విజ్ఞాన పంటలు పండిద్దాం. భావిభారతాన్ని సుసంపన్నం చేద్దాం…

-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రచనలకు ఆహ్వానం

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రచయితలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి…

పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విద్యా విషయక, విజ్ఞాన అంశాలతో -వస్తున్న మాసపత్రిక మన బడి కోసం.. మీ నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. పిల్లలకు -విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రచనలు ఏవైనా.. ఎవరైనా పంపవచ్చు. కథలు, వ్యాసాలు, కవితలు, గేయాలు, జోకులు, బొమ్మలు, కార్టూన్లు, అనువాద రచనలు, సృజనాత్మక బోధనా పద్ధతులు, విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ప్రాజెక్టులు.. ఇలా ఏ అంశాన్నయినా రాసి పంపండి.

మీ రచనలు పంపాల్సిన చిరునామా:

స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ & ఎడిటర్, సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్, పటమట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 520010, whatsapp నెంబర్ : 8712652298, ఈ మెయిల్  manabadimagazine@gmail.com

Manabadi January 2025 e-Magazine

DOWNLOAD

Read also…

Manabadi December 2024 e-Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!