Manabadi February 2025 Telugu Monthly e-Magazine

Manabadi February 2025 Telugu Monthly e-Magazine

“మన బడి” ఫిబ్రవరి 2025 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి

సంపాదకుల మాట: శిక్షణతో నాయకత్వ లక్షణాలు

“I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times.” – Bruce Lee (Manabadi February 2025 Telugu Monthly e-Magazine)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

విద్యకైనా, ఆత్మరక్షణ విద్యకైనా శిక్షణ, కఠోర సాధన ఎంత అత్యవసరమో బ్రూస్లీ కొటేషన్ వివరిస్తుంది. శిక్షణ ద్వారా ప్రధానోపాధ్యాయుడి నుంచి ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి సమకాలీన విద్య, విజ్ఞానం బదిలీ అవుతాయి. మన పాఠశాల నాయకులకు నాయకత్వ లక్షణాలు, జీవననైపుణ్యాలు తప్పనిసరి.

“Leadership and learning are indispensable to each other.” – John F. Kennedy

నాయకత్వం మరియు అభ్యసనం పరస్పరం అనివార్యమైనవి అంటారు జాన్ ఎఫ్ కెన్నెడీ

గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు అభ్యసనం తోడైతే విద్యార్థులను జ్ఞానసంపదగా తీర్చిదిద్దే శక్తిగా తయారవుతారనే లక్ష్యంతో నాయకత్వ లక్షణాల శిక్షణను ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నాం. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో, సీమ్యాట్ పర్యవేక్షణలో ‘లీడర్షిప్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్’ లో భాగంగా ప్రధానోపాధ్యాయులకు 12 సామర్థ్యాలపై శిక్షణ ఇవ్వడం పూర్తయింది. రెండు దశల్లో 26000 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ విద్యాలయాలకు సమర్థ నాయకత్వాన్ని అందించామనే సంతృప్తి ఉంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రచనలకు ఆహ్వానం

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రచయితలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి…

పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విద్యా విషయక, విజ్ఞాన అంశాలతో -వస్తున్న మాసపత్రిక మన బడి కోసం.. మీ నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. పిల్లలకు -విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రచనలు ఏవైనా.. ఎవరైనా పంపవచ్చు. కథలు, వ్యాసాలు, కవితలు, గేయాలు, జోకులు, బొమ్మలు, కార్టూన్లు, అనువాద రచనలు, సృజనాత్మక బోధనా పద్ధతులు, విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ప్రాజెక్టులు.. ఇలా ఏ అంశాన్నయినా రాసి పంపండి.

మీ రచనలు పంపాల్సిన చిరునామా:

స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ & ఎడిటర్, సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్, పటమట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 520010, whatsapp నెంబర్ : 8712652298, ఈ మెయిల్  manabadimagazine@gmail.com

Manabadi February 2025 e-Magazine

DOWNLOAD

Read also…

Manabadi January 2025 e-Magazine

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!