WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Mana Badi September 2025 Monthly e-Magazine

Mana Badi September 2025 Monthly e-Magazine

 

“మన బడి” సెప్టెంబర్ 2025 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi September 2025 Telugu Monthly e-Magazine)

సంపాదకుల మాట: ప్రభుత్వ బడికి ఉపాధ్యాయుల భరోసా

ఎవరో ఒకరు… ఎపుడో అపుడు.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. అ… అ… అ… అ… అ…. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది… ‘అంకురం’ చిత్రంలో సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పలుకులకు అక్షర సత్యాలు ఇవీ..

కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు చూసే ధోరణిని తిప్పికొట్టే ఒక గొప్ప మార్పు మొదలైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి స‌రికొత్త‌చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గ‌ల కార‌ణాల్లో ఒక‌టి. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చదివించడమే. “పాఠాలు చెప్పే గురువుకే తన బడిపై నమ్మకం లేదా?” అనే ప్రశ్న సామాన్య తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, కొందరు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం ద్వారా ఆ ప్రశ్నకు తమ ఆచరణతో సమాధానం చెబుతున్నారు.

ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చడం వల్ల సామాన్య ప్ర‌జ‌లు సైతం త‌మ పిల్లల్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలతో ప్రైవేటుకు దీటుగా ప్ర‌భుత్వ విద్య అందుబాటులో ఉంది. అందరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందించే ప్ర‌భుత్వ లక్ష్యానికి ఈ మార్పు ఎంతో దోహ‌ద‌ప‌డుతోంది.

వ్యక్తిగతప్రయోజనాలకంటే సామాజికశ్రేయస్సును,వృత్తి ధర్మాన్ని గౌరవించినఈఆదర్శ ఉపాధ్యాయులకు హృదయపూర్వకఅభినందనలు. ఈ స్ఫూర్తిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనం కేవలం ప్రభుత్వ పథకాలతోనే కాదు, ఉపాధ్యాయుల ఆచరణాత్మకమైన నిబద్ధతతోనే సాధ్యమవుతుంది.

-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Mana Badi September 2025 Magazine

DOWNLOAD

 

Mana Badi June 2025 Magazine

DOWNLOAD

Thank you for reading... Share this...
error: Content is protected !!