Mana Badi November 2025 Monthly e-Magazine
“మన బడి” నవంబర్ 2025 మాసపత్రిక
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi November 2025 Telugu Monthly e-Magazine)
సంపాదకుల మాట: ఎడ్యుటైన్ మెంట్ ట్రెండ్ సెట్టర్స్
తరగతి గది నుంచి, ఆటస్థలం వరకూ.. బ్లాక్ బోర్డ్ నుంచి బడి తోటలో మొలిచిన మొక్కల వరకు ప్రతి వేదిక బోధనకు ఉపయోగించుకుంటున్న నవతరం ఉపాధ్యాయుల విజయ గాథలు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి.
21వ శతాబ్దపు నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఉపాధ్యాయుల సృజనాత్మక విద్యా బోధన చోదక శక్తిగా మారుతోంది.
“It is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge.” – Albert Einstein
చెప్పినట్టు సరదా, సందడి వాతావరణం సృష్టించి..పిల్లల్లో సృజనాత్మక వ్యక్తీకరణలను, జ్ఞానాన్ని పెంపొందించే అత్యున్నత కళను ఆచరిస్తున్న ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు.
సుశిక్షితులైన, ప్రతిభావంతులైన లక్షలాదిమంది ఉపాధ్యాయులు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. వీరికి ఆటపాటలలో మమేకం చేస్తూ విద్యార్థులను చదువుల బాట పట్టించే సరికొత్త బోధనా పద్ధతులు అవలంబిస్తున్న ఉపాధ్యాయులు దిక్సూచిగా నిలుస్తున్నారు.
-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Mana Badi November 2025 Magazine
DOWNLOAD
Previous Month Magazine
