WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Mana Badi May-2025 Telugu Monthly e-Magazine

Mana Badi May-2025 Telugu Monthly e-Magazine

మన బడి” మే 2025 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi May 2025 Telugu Monthly e-Magazine)

మన బడి” మే 2025లోని అంశాలు:

గురుకులంలో గురువు, పిల్లలూ.. సెలవుల్లో జాగ్రత్త, నేనున్నానని.. నీకేం కాదనీ.., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటు, లీప్ వరం.. తగ్గింది యాప్ ల భారం.., పిల్లల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుంది, ప్రభుత్వ విద్యా విక్ర’మార్కులు’,  ఉత్తరాలు జీవన పాఠాలు: ప్రియమైన నేటి, రేపటి బాలల్లారా, విజ్ఞాన యాత్రలు – భావిశాస్త్రవేత్తలకు పునాదులు, బొమ్మ గీశానోచ్!,  కాలిగ్రఫీ, ఫజిల్స్, రంగులు వేయండి, చుక్కలు కలపండి, కనువిప్పు-కథ, ఏకాగ్రత బాలల కథ, అంతర్రాష్ట్ర వర్డ్ పవర్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ, మాకు మేమే పోటీ.. మాకు మేమే సాటి

సంపాదకుల మాట: సంస్కరణల ఫలాలు.. ఉత్తమ ఫలితాలు

ప్రభుత్వ విద్య వికసించింది. ప్రభుత్వ విద్యార్థులు ప్రకాశించారు. కఠినపరీక్షలు నెగ్గి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచారు. కార్పొరేటు స్కూళ్లకు దీటుగా, ప్రైవేటు కాలేజీలతో పోటీపడుతూ మార్కులతో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మార్క్ చూపించారు.

ఈ ఏడాది పరీక్షల ఫలితాలలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు అసమాన ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించారు. సంస్కరణలు ఫలితాల్లో కనిపించాయి. ప్రభుత్వం కోరుకున్న మార్పు మార్కుల్లో స్పష్టమైంది.

గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో అత్యధికంగా 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో గత పదేళ్ల తో పోలిస్తే రెండో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. పదో తరగతి ఫలితాల్లోనూ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదు అయ్యింది. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, పరిష్కరించిన సమస్యలకు పదేళ్ల రికార్డులను తిరగరాసిన ఫలితాలే నిదర్శనం. మా షైనింగ్ స్టార్స్ మా ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ అద్భుత ఫలితాల్లో భాగమైన అందరికీ అభినందనలు..

బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Mana Badi May 2025 School children Magazine

DOWNLOAD

Read also…

Mana Badi April 2025 School children Magazine

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!