WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Mana Badi January 2026 Monthly e-Magazine

Mana Badi January 2026 Monthly e-Magazine

“మన బడి” జనవరి 2026 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi January 2026 Telugu Monthly e-Magazine)

సంపాదకుల మాట: ముస్తాబు.. పిల్లలకు కొత్త సొబగు

మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభా పాటవాలు దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయి. విద్య, విజ్ఞానం, ఆటపాటల్లో పిల్లలు రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషనన్ను ఒక యజ్ఞంలా చేపట్టింది. విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తోంది. సమాజ భాగస్వామ్యంతో బడులను బలోపేతం చేస్తోంది.

వెళ్లేందుకు బడి ఉంది. చదువు చెప్పేందుకు టీచర్లు ఉన్నారు. పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూ, డిక్షనరీలు ఇచ్చింది ప్రభుత్వం. ఆడేందుకు స్థలం, క్రీడా సామాగ్రి అందింది. రుచికరమైన, బలవర్థకమైన మధ్యాహ్న భోజనం ఆకలి తీర్చి, ఆరోగ్యం అందిస్తోంది. నలతగా ఉండే వైద్యం, కలత చెందితే కౌన్సిలర్లు పిల్లలకు సాంత్వన చేకూరుస్తున్నారు.

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో కొత్తగా ప్రారంభం అయింది. “శుభ్రతే ఆరోగ్యం ఆరోగ్యమే ఆయుష్షు” అనే నినాదంతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచన ఈ కార్యక్రమానికి నాంది పలికింది.

పిల్లలకు నిత్యం వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం, పిల్లలు రోజూ పాఠశాలకు వచ్చేలా చూడడం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపు పాఠశాలలు, వసతిగృహాల్లో పిల్లలకు సురక్షితమైన పరిశుభ్ర వాతావరణం కల్పించడం ముస్తాబు లక్ష్యాలు. ముస్తాబుతో పిల్లలు అందంగా, ఆనందంగా, ఆత్మ విశ్వాసంతో భావితరం నాయకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Mana Badi January 2026 Magazine

DOWNLOAD

Previous Month Magazine

Mana Badi December 2025 Magazine

DOWNLOAD

Thank you for reading... Share this...
error: Content is protected !!