Mana Badi February 2026 Monthly e-Magazine
“మన బడి” ఫిబ్రవరి 2026 మాసపత్రిక
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi February 2026 Telugu Monthly e-Magazine)
సంపాదకుల మాట: ఆకుపచ్చని కల సాకారం
పాఠశాల ఆవరణల్లో పచ్చని తోటలు ..పర్యావరణ పరిరక్షణ కోటలుగా నిలుస్తున్నాయి. పూల మొక్కలు పెంచుతున్న పిల్లలు ఆ తోటల్లో విహరించే అందమైన సీతాకోక చిలుకల్లా కనిపిస్తున్నారు. కిచెన్ గార్డెన్స్ అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సహకరిస్తున్న సిబ్బంది గ్రీన్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యవంతమైన, పోషక విలువలు కలిగిన సేంద్రియ ఆహారం మధ్యాహ్న భోజన పథకం (PM POSHAN) ద్వారా అందించడం, శ్రమదానం విలువ చాటిచెప్పడం, బడితోటనే పుస్తకంగా చేసుకుని పిల్లలకు ప్రకృతి పాఠాలు నేర్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్స్’ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాలకు సగటున _రూ. 5,000 వరకు ‘ప్లెక్సీ ఫండ్’ (Flexi Fund) కింద నిధులు కేటాయిస్తున్నాం. విత్తనాలు, సేంద్రియ ఎరువులు, తోట పనిముట్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించాలి. విద్యార్థులకు కేవలం పాఠాలే కాకుండా, “చేతల ద్వారా నేర్చుకోవడం” (Learning by doing) అనే సూత్రం ప్రకారం వ్యవసాయాన్ని ఒక జీవన నైపుణ్యంగా కిచెన్ గార్డెన్ల ద్వారా నేర్పుతున్నాం.
-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Mana Badi February 2026 Magazine
DOWNLOAD
Previous Month Magazine
