Mana Badi December 2025 Monthly e-Magazine
“మన బడి” డిసెంబర్ 2025 మాసపత్రిక
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi December 2025 Telugu Monthly e-Magazine)
సంపాదకుల మాట: విద్యావికాస వసంతం.. మన బడి వార్షికోత్సవం
మన బడి 12 నెలలుగా నిరంతరాయంగా నెల నెలా విద్యా వెలుగుల వెన్నెల తెస్తోంది. ఒక ఎడిటర్ గా ఇది నాకు చాలా సంతోష సందర్భం. ప్రభుత్వం, విద్యా శాఖా మంత్రి, పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, సంపాదక బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తల అందరి సహకారంతో మనబడి విజయవంతంగా తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ తొలి మజిలీ సమష్టి కృషి ఫలితం. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల బహుముఖ ప్రతిభను అందరికీ పరిచయం చేసే వేదికగా మనబడి నిలిచింది. వినూత్న విద్యాబోధనతో సంచలనాలు సృష్టిస్తున్న ఉపాధ్యాయుల స్ఫూర్తిమంతమైన విధానాలు ప్రచార వారధి మనబడి. విద్యాశాఖ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, విద్యాశాఖ మంత్రి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రతిబింబించే దర్పణం మనబడి మాసపత్రిక. ఏడాది కాలంలో అందంగా, ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా మనబడి మాసపత్రికను తీసుకురావడానికి చేసిన కృషిలో భాగమైన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి సహకారం, సూచనలు, సలహాలతో మనబడిని మరింత ప్రయోజనకరంగా తీసుకొస్తాం.
-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Mana Badi December 2025 Magazine
DOWNLOAD
Previous Month Magazine
