Mana Badi April-2025 Telugu Monthly e-Magazine

Mana Badi April-2025 Telugu Monthly e-Magazine

“మన బడి” ఏప్రిల్ 2025 మాసపత్రిక

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి (Mana Badi April 2025 Telugu Monthly e-Magazine)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

“మన బడి” ఏప్రిల్ 2025లోని అంశాలు:

బాలికలకు సు’రక్ష’, విద్యార్థుల భవిష్యత్తుకు ‘పొగ’ పెట్టొద్దు, సాంఘిక భావోద్వేగ అభ్యాసం -విభిన్న నైపుణ్యాలు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ప్రామాణిక ప్రశ్నల పత్రాల రూపకల్పన పై ఫరక్ వర్క్ షాప్ విజయవంతం, ఇన్ హౌస్: నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి, సమగ్ర విద్య కు పాతికేళ్లు, యాత్రానుభూతి: కల నిజమైన వేల.. విశాఖ అందాలు చూసాం ఇలా.. కిటికీ: బొమ్మ గీశానోచ్,  అబ్బబ్బో  సిత్రాలు, బిడ్డ ‘సెల్’ లో ఉన్నాడు, పిల్లలతో కథలు రాయించటం ఎలా..?, ఉపాధ్యాయులకు అబ్రహం లింకన్ రాసిన అద్భుత లేఖ, ప్రభుత్వ పాఠశాలలో భాష ఉత్సవాలు

సంపాదకుల మాట: సమగ్ర శిక్షా ప్రస్థానం.. సమగ్ర విద్యతోనే ప్రయాణం

చదువులమ్మ చెట్టు నీడ నాకు తోడూనీడగా నిలిచింది. అక్షరాన్ని అందరికీ పంచే బాధ్యులలో ఒకడిని చేసింది. విద్యా వికాసానికి కృషిచేసే బృహత్తర ఉన్నతోదోగ్యం నాకు దక్కిన వరంగానే భావిస్తాను. సమగ్ర శిక్షాకు పాతికేళ్లు పూర్తయిన శుభవేళ సమగ్ర విద్యా ప్రయాణంలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.

“Education is not just about going to school and getting a degree.

It’s about widening your knowledge and absorbing the truth about life.” – Shakuntala Devi

హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా పేరుగాంచిన శకుంతలా దేవి గారు చెప్పినట్టు “విద్య అంటే కేవలం పాఠశాలకు వెళ్లి, పరీక్షలు పాసై, డిగ్రీ పొందడం మాత్రమే కాదు. జ్ఞానం సముపార్జించడం, జీవితం గురించిన వాస్తవాలు తెలుసుకోవడం కూడా”. ఇటువంటి సమున్నత లక్ష్యంతో ‘సర్వశిక్షా అభియాన్’ను 2001 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రారంభించారు. పేరు మారి ‘సమగ్ర శిక్షా’ అయినా.. 6-14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది ఈ పథకం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రీ-స్కూల్ విద్య, వృత్తి విద్య, డిజిటల్ విద్య, క్రీడలు, శారీరక విద్యలను రాష్ట్రప్రభుత్వం అందిస్తోంది. టీచర్ &టెక్నాలజీ శిక్షణపై దృష్టి సారించింది. తద్వారా అన్ని స్థాయిలలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం ఒక ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ ఫలితాలు సాధిస్తోంది. సమగ్రశిక్షా 25 ఏళ్ల సమగ్ర విద్యావికాస ప్రయాణంలో భాగమైన ప్రభుత్వం, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు..

-బి శ్రీనివాసరావు, IAS; ఎడిటర్ & రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Mana Badi April 2025 School children Magazine

DOWNLOAD

Read also…

Balala Nestham April 2025 e-Magazine

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!