WhatsApp Channel Join Now
Telegram Group Join Now

India’s New Digital Address System – DIGIPIN

India’s New Digital Address System DIGIPIN – Website & APP

పిన్ కోడ్ ల స్థానంలో ఇక డిజిపిన్ లు: భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భారత పోస్టల్‌ శాఖ ఓ వినూత్న ఆవిష్కరణను తీసుకువచ్చింది. ప్రతి ఇంటి స్థలాన్ని/ కార్యాలయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డిజిపిన్ (DIGIPIN) అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది. సాధారణంగా ఎవరి ఇంటి/ ఆఫీసు చిరునామాకైనా పిన్‌కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఈ పిన్‌కోడ్‌లు పెద్దపెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి. ఉదాహరణకు, ఒకే పిన్ కోడ్‌క లో పలు వీధులు, వేలాది ఇల్లు, వ్యాపార సంస్థలు కూడా ఉండవచ్చు. అంటే, ఒక ఇంటి/ కార్యాలయం ఖచ్చితమైన అడ్రసు ను పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం. ఈ డిజిపిన్ సంప్రదాయ పిన్ కోడ్‌కు బదులుగా, ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన 10 అక్షరాల డిజిటల్ అడ్రస్‌ను అందిస్తుంది. ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు. (India’s New digital address system DIGIPIN)

అసలు డిజిపిన్ అంటే ఏమిటి?

మనం ఉంటున్న ఇంటి/ ప్రదేశాన్ని కచ్చితత్వంతో గుర్తించేందుకు సాయపడే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్ ఈ డిజిపిన్‌. దేశం మొత్తంను సుమారు 4 మీటర్ల × 4 మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్‌లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ GPS అక్షాంశ- రేఖాంశాల ఆధారంగా రూపొందించబడుతుంది. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీ ఖచ్చితమైన స్థలాన్ని డిజిపిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఈ డిజిపిన్ ను ఇండియన్ పోస్టు ఆఫీసు, ఐఐటీ హైదరాబాద్, ISROలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ.

డిజిపిన్ వలన ప్రయోజనాలు ఏంటి?

గ్రామీణ ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రదేశాలు.. ఇలా స్పష్టమైన చిరునామాలు లేని మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌, అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్ల వంటి అత్యవసర సేవల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో డిజిపిన్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆన్‌లైన్ డోర్‌ డెలివరీ సేవలు మరింత సజావుగా, సమర్థవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది చిరునామాను మార్చదు. అదనపు డిజిటల్‌ చిరునామాగా పనిచేస్తూ కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. భవిష్యత్తులో జీఐఎస్‌ వ్యవస్థలతో డిజిపిన్‌ ఏకీకరణ జరిగితే సంప్రదాయ చిరునామాల అవసరం తగ్గే అవకాశం ఉంది.

డిజిపిన్ ను ఎలా పొందాలి?

మన ఇంటి/ స్థలం/ కార్యాలయం డిజిపిన్ ను తెలుసుకొనుటకు https://dac.indiapost.gov.in/mydigipin/home వెబ్సైట్ ను ఓపెన్ చేసి అక్కడ కనిపించే మ్యాప్‌లో మీ ఇంటి స్థలాన్ని గుర్తించి, మీ డిజిపిన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఉచితంగా అందుబాటులో ఉంది. డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్‌ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా డిజిపిన్‌ను జనరేట్ చేయడం సాధ్యమవుతుంది.

WEBSITE

ANDROID APP

iOS APP

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!