Ice Apple/ Palmyra Palm: Uses, Benefits, Side Effects
వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు (Palmyra Palm / Ice Apple) ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. శరీరానికి చలువ చేకూర్చే తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఎలాంటి కల్తీలేని పకృతి వర ప్రసాదాయిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే. తాటి ముంజలలో మన శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. (Ice Apple Palmyra Palm: Uses, Benefits, Side Effects)
తాటి ముంజలు ఉపయోగాలు (Ice Apple/ Palmyra Palm Benefits):
- తాటి ముంజలు వేసవిలో శరీరానికి చలువ నివ్వడానికి మరియు పోషకాలు అందించడానికి ఒక మంచి పండు.
- ఈ పండులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ శక్తి, మరియు విటమిన్లు (A, B, C), ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
- ఎండాకాలంలో చాలా వేడి చేసి ఇబ్బంది పడే వారు తాటి ముంజలను తింటే శరీరం చల్లబడుతుంది.
- ఈ ముంజలలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుంది.
- వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. ఎండాకాలంలో చెమటతో త్వరగా డిహైడ్రేషన్ అయ్యేవారికి తాటి ముంజలు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి.
- వేసవిలో వచ్చే తాటి ముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
- తాటి ముంజలు కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
- కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో భరించలేని నొప్పితో బాద పడేవారు క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజులు పాటు లేత ముంజలను తినడం వలన ఉపశమనం కలుగుతుంది.
- వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది.
- వేసవిలో వచ్చే చికెన్ పాక్స్ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి.
- తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.
- రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
- జీవక్రియ,మలబద్దకం సమస్యలు తొలుగుతాయి.
తాటి ముంజలు దుష్ప్రభావాలు (Ice Apple/ Palmyra Palm Side Effects):
ఐస్ యాపిల్ (తాటి ముంజకాయలు) తినడం వల్ల సాధారణంగా దుష్ప్రభావాలు ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు రావచ్చు. బాగా పండిన ఐస్ యాపిల్స్ తినడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా మారవచ్చు, కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
వేసవిలో మాత్రమే దొరికే ఎలాంటి కల్తీ లేకుండా లభించే వీటిని మనం కూడా తప్పకుండా తిని ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలను పొందుదాము.
Read also..