How to update TIS Teacher Information System and login link
ప్రతి టీచర్ CSE సైట్ నందు వారి అటెండెన్స్ యాప్ పర్సనల్ లాగిన్ credentials తో లాగిన్ అయ్యి దానిలో కొత్తగా ఎనేబుల్ చేసిన TIS module నందు గల 5 రకాల sub module లో ఉన్న టీచర్ వివరాలను అప్డేట్ చేసుకోవలెను. ఇంతకు ముందు TIS లో ఉన్న డేటా ఆటో పాపులేటెడ్ గా అక్కడ కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుని డేటా సబ్మిట్ చేయవలెను. ఒక్కక్క module లో వివరాలు అప్డేట్ చేసుకున్న తరువాత సేవ్ చేసి next ఆప్షన్ క్లిక్ చేస్తే next module open అవుతుంది. డేటా ఎంటర్ చేసే ముందు ప్రతి విండో లో కుడివైపు క్రిందన ఉన్న edit option క్లిక్ చేసి డేటా ఎంటర్ చేయవలెను. అలా కాకుండా డైరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తే ఓల్డ్ డేటా రాదు. డేటా సబ్మిట్ అవ్వదు కూడా. (How to update TIS Teacher Information System and login link)
మనం మొబైల్ లో TIS Information ను update చేయడం కోసం క్రింది steps ఫాలో అవ్వండి. లేకపోతే మొబైల్ లో మనకు Services option కనిపించదు. ముందుగా Google Chrome లో Right side నిలువుగా కనిపించే 3 చుక్కలపై click చేసి desktop mode on చెయ్యాలి. అదే విధంగా settings లో Accessibility లో zoom ను 100 percent నుండి 50 percent వరకు తగ్గించాలి. ఇప్పుడు cse.ap.gov.in ను open చేసినచో మనకు services , TIS కనిపిస్తాయి.
How to Update Basic Details, Educational Details, Appointment Details, Transfers Details & Professional details:
- Step 1: Click on https://cse.ap.gov.in/
- Step 2: Click on Login
- Step3: Enter User Id & Password (User Id: Your 7 Digit treasury Code Enter & Password: Your School Attendance App password)
- Step 4: After Login Click on Services
- Step 5: Next Click on S2: TIS Services
After Update following Basic Details, Educational, Appointment, Transfers Details, Professional details and Submit each section
- S2.1 TIS Basic Details
- S2.2 TIS Educational Details
- S2.3 TIS Appointment Details
- S2.4 TIS Transfer Details
- S2.5 TIS Professional Details
Old TIS Report Card డౌన్లోడ్ చేసే విధానం
- Step_1: Student info site
- Step_2: Click on Department login
- Step_3: Enter your Treasury ID & Password
- Step_4: Go to Services
- Step_5: staff
- Step_6: Search employee
- Step_7: Enter Teacher code and Get details.
Frequently Asked Questions (FAQs)
ప్రశ్న : TIS ఏ ఏ ఉపాధ్యాయులు పూర్తి చేయాలి ?
సమాధానం: ప్రైవేటు అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ తప్ప అందరూ.
ప్రశ్న : TIS ఏ పాఠశాల లో చేయాలి?
సమాధానం: జీతం తీసుకునే పాఠశాల.
ప్రశ్న : హెల్త్ కార్డు లో డిపెండెంట్ లు లేకపోతే ఏమి చేయాలి?
సమాధానం: డిపెండెంట్ లు సంఖ్య దగ్గర సున్నా ఎంటర్ చేసి ముందుకు వెళ్ళవచ్చు.
ప్రశ్న : CFMS ID కొందరికి ఉండదు కదా? వారు ఏమి చేయాలి?
సమాధానం: రెగ్యులర్ ఉపాధ్యాయులకి ఇది తప్పనిసరి. కాంట్రాక్టు తదితరులకు ఇది ఐఛ్ఛికము.
ప్రశ్న : హెల్త్ కార్డు లో డిపెండెంట్ లు అదనంగా చేర్చ వలసి వస్తే?
సమాధానం: ఎంతమంది అయితే తదనుగుణంగా సంఖ్య ఎంటర్ చేసి, వారి వివరాలు నమోదు చేయవచ్చు.
ప్రశ్న : భార్యాభర్తలు లో ఒకరికే హెల్త్ కార్డు ఉంటుంది. రెండవ వ్యక్తి ఏమి చేయాలి?
సమాధానం: అటువంటి సందర్భంలో వారి హెల్త్ కార్డు నంబరు రాసి, డిపెండెంట్ ల సంఖ్య సున్నాగ నమోదు చేసి, ముందుకు వెళ్ళవచ్చు.
ప్రశ్న : డిగ్రీ వివరాలలో Add మరియు Remove బటన్ లు ఉపయోగం ఏమిటి?
సమాధానం: Add బటన్ ద్వారా మనకి ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని వరుసలు వచ్చేలా సృష్టించుకొని వివరాలు సమర్పించవచ్చు. Remove బటన్ ఉపయోగించి అనవసరంగా సృష్టించిన వరుసలు రద్దు పరచవచ్చు.
ప్రశ్న : విద్యా వివరాలలో ప్రతిచోటా కొన్ని ఖాళీలు కనబడుతున్నాయి. ఎందుకు?
సమాధానం: అవును. కొత్తగా కొన్ని వివరాలు అడగడం జరిగింది. అవి సమర్పించవలసి ఉంటుంది.
ప్రశ్న : విద్యా వివరాల వద్ద సమర్పించిన వివరాలు ఉన్నప్పటికీ, NO అని సెలక్షన్ చేసుకొంటే ఏమవుతుంది?
సమాధానం: ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఉన్న డేటా తీసివేయబడును అని ఒక పాప్ అప్ లో అడగబడును. మీరు Yes అని ఎంచుకొంటే గతంలో ఆ అర్హత పరంగా ఉన్న వివరాలు తొలగించబడతాయి. అవసరం అనుకొంటే తిరిగి మరల వివరాలు సమర్పించాలి.
ప్రశ్న : కొంతమందికి కొన్ని అర్హతల వద్ద వివరాలు పునరావృతం అయ్యాయి. ఏమి చేయాలి?
సమాధానం: పునరావృతం అయిన వివరాలు Remove బటన్ ద్వారా తొలగించవచ్చు
ప్రశ్న : డిగ్రీ సింగిల్ సబ్జెక్టు వారు ఎక్కడ నమోదు చేయాలి?
సమాధానం: సాధారణ డిగ్రీ నందు మూడు ఐఛ్ఛికాలు నమోదు చేయవలెను. కావున చివరన ఉన్న Other degrees విభాగంలో నమోదు చేయవచ్చు.
ప్రశ్న : డిగ్రీ నందు విద్వాన్ తదితరాలకు ఒకటే ఐఛ్ఛికం ఉంటుంది. వారు ఏమి చేయాలి?
సమాధానం: అటువంటి కోర్సులకు ఒక ఐఛ్ఛికం తప్పనిసరి మరియు మిగిలనవి ఐఛ్ఛికంగా వెనులుబాటు ఇవ్వబడును.
ప్రశ్న : Appointment window నందు present school details ఎడిట్ అవడం లేదు?
సమాధానం: : ఈ విభాగపు వివరాలు Transfers window లో ప్రస్తుత పాఠశాల రికార్డు నుండి ఆటోమేటిక్ గ వచ్చేలా చేయడం జరిగింది. కావున ఎడిట్ ఉండదు.
ప్రశ్న : Transfers వివరాలు నందు ఇంతవరకు బదిలీ కాని ఉపాధ్యాయులు ఏమి చేయాలి?
సమాధానం: ప్రస్తుత పాఠశాల వివరాలు ఈ టేబుల్ నుంచే తీసుకోబడును. కావున 1 “వేసి, GO నొక్కి ప్రస్తుతం నియామకం అయిన పాఠశాల వివరాలు సమర్పించాలి.
ప్రశ్న : Transfers నందు గతంలో చేసిన పాఠశాల close చేయబడి, ఇప్పుడు ఎంచుకొనుటకు రావడం లేదు.
సమాధానం: పాఠశాలల డ్రాప్ డౌన్ నుండి Others అని ఎంచుకొని సంబంధిత పాఠశాల వివరాలు సమర్పించవచ్చు.
ప్రశ్న : ASO/APO తదితర సిబ్బంది తమ TIS వివరాలు ఎలా సమర్పించాలి?
సమాధానం: త్వరలో తగు చర్యలు తీసుకోబడును. వివరాలు తెలుపబడును.
ప్రశ్న : ఎవరైనా నూతనంగా విధులలో చేరినట్లు అయితే వారిTIS వివరాలు ఎలా సమర్పించాలి?
సమాధానం: నూతనంగా చేరిన వారు. ఫేసియల్ రికగ్నిషన్ యాప్ నందు నమోదు కాగానే వారికి TIS లాగిన్ ఎనేబుల్ అవుతుంది.
ప్రశ్న : ఈ వివరాలు సమర్పించిన తదుపరి చర్య ఏమిటి?
సమాధానం: ఉపాధ్యాయుని యొక్క డ్రాయింగ్ ఆఫీసరు లాగిన్ కి ఈ ప్రొఫైల్ చేరవేయబడును. వారు మీ యొక్క సర్వీసు రిజిస్టర్ లోని వివరాలతో మీరు సమర్పించిన వివరాలు సరిపోల్చి, అవసరం అయితే తగు మార్పులు చేసి Confirmation చేస్తారు.
ప్రశ్న : సాంకేతికంగా ఏవైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?
సమాధానం: మండల పరిధిలో అయితే MEO/MIS Cordinator/ డేటా ఎంట్రీ ఆపరేటర్. జిల్లా స్థాయిలో అయితే IT CELL.
ప్రశ్న : సర్వీసు సమస్యలు, వివిధ తేదీల నిర్ధారణ లో సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?
సమాధానం: మీ DDO,తదుపరి AD(services) ఆపై మీ జిల్లా విద్యాశాఖాధికారి.
TIS Useful information
TITLE | LINK |
Teacher Profile Submission status Report | CLICK HERE |
User Manual | DOWNLOAD |
Data sheet | DOWNLOAD |
For TIS Login | CLICK HERE |
Student Info website link | CLICK HERE |
TIS Data ను మొబైల్ లో అప్డేట్ చేయువిధానం Step by step process..
గమనిక: ఉన్నత పాఠశాలల HMs లకు తెలియజేయడం ఏమనగా TIS module ఎనేబల్ అయినది. ఎవరికైనా TIS module నందు designation HM కు బదులు Head teacher గానో లేక ఖాళీ గానో ఉన్న యెడల వారికి TIS tile కనిపించక పోవచ్చు అలాంటి వారి ID నంబరు సదరు HM ద్వారా Dist. IT, Team కు పంపిన యెడల ఎడిట్ చేసి ఇస్తారు.
TIS Login Link, How to Update TIS, How to Edit TIS, How to update Teacher Profile
Read also..