How to stop cyber crime Telugu cyber crime awareness

How to stop cyber crime Telugu / Cyber crime awareness

సైబర్ క్రైమ్ పై అవగాహణ

డిజిటల్ మోసాల ప్రభావం.. డిజిటల్ ఇండియాగా దూసుకుపోతున్న భారత్ లో ఆన్లైన్ మోసాలు, ఇతర మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలను మోసం చేసేందుకు ఉచ్చు బిగిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని నిమిషాల్లోనే అవిరైపోతుంది. సైబర్ మోసం సామాన్యులకే కాదు ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇక్కడ వివిధ రకాల సైబర్ మోసాలు వాటి నుండి మనం ఎలా బయట పడాలో తెలుసుకుందాం.. (How to stop cyber crime Telugu cyber crime awareness) 

వివిధ రకాల మోసాలు చేయవలసినవిచేయకూడనివి
ఫిషింగ్ (Phishing) కాల్ ద్వారా జరిగే మోసాలు:

పిషింగ్ కాల్స్ అంటే ఇ-మెయిల్ ద్వారానో, మెసేజ్ ద్వారానో, మోసపూరితంగా ఒక లింక్ పంపి, అది క్లిక్ చేయగానే వైరస్ ద్వారా మన సమాచారాన్ని దొంగిలించడం.

మనకి తెలియని వాళ్ళనుంచి ఇలాంటి మెసేజులు / కాల్స్ వచ్చినప్పుడు, కె.వై.సి. అప్డేషన్ వివరాల గురించి మీ బ్యాంక్ కి ఫోన్ చేసి తెలుసుకోండి.మనకి తెలియని వారి నుంచి మేసేజీల ద్వారా కాని ఫోన్లద్వారా వచ్చిన ‘లింకు’ లను యెక్కడ నుంచి వచ్చాయో తెలుసుకోకుండా ‘క్లిక్’ చేయకూడదు. గోప్యంగా వుంచుకోవలసిన మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవ్వరికీ తెలియజేయకూడదు.

విషింగ్ కాల్స్ ద్వారా జరిగే మోసాలు:

“విషింగ్ కాల్స్” అంటే తాము ప్రముఖ సంస్థ నుంచో ఏదో బ్యాంక్ నుంచో మాట్లాడుతున్నాం అంటూ యెవరికి తెలియకూడని మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగిలించటానికి మోసపూరితంగా చేసే ఫోన్ కాల్స్.

ఎవరిని అయినా నమ్మే ముందు మీ బ్యాంక్ బంచ్ కి ఫోన్ చేసి అసలు విషయమేమిటో తెలుసుకోండి“ఫలాన బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం” అంటూ ఫోన్లు చేసి మన బ్యాంక్ అకౌంట్ గురించిన రహస్య సమాచారాన్ని అడిగే వాళ్ళను నమ్మకూడదు. ఏ బ్యాంకూ ఫోన్లో అడగదు గుర్తుంచుకోండి. ఈ డిజిటల్ యుగంలో బ్యాంక్ వివరాలను అడుగుతూ.. అపరిచితుల నుండి వచ్చిన యేఫోన్ కాల్స్ కి స్పందించ కూడదు.
అన్లైన్ మార్కెటింగ్ జరిగే మోసాలుమీ UPI PIN అవసరం డబ్బులు పంపేటప్పుడే గాని డబ్బులు మన అకౌంట్ లోకి వచ్చేటప్పుడు కాదు. డబ్బులు చెల్లించేటప్పుడు మొబైల్ నంబర్ సరి అయిందో కాదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.కొత్తవాళ్ళకు మన PIN నంబర్ ని యెట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. డబ్బులు మనకి రావలసినప్పుడు PIN నంబర్ వాడవలసిన అవసరం లేదు.
క్రెడిట్ కార్డులపై వార్షిక ఫీజు రాయితీ అంటూ మోసపూరిత ఆఫర్ “మీ బ్యాంకునుంచి ఫోన్ చేస్తున్నాం” అని తెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వుండండి. మీరు మోసపోయారని తెలియగానే మీ బ్యాంకు కి ఫిర్యాదు చేయండి. ఇంకా నష్టపోకుండా మీ కార్డ్ ని వెంటనే బ్లాక్ చేయించుకోండి.ఎవ్వరికీ ఎట్టి పరిస్థితిలోనూ OTP చెప్పకూడదు. మోసగాళ్ళు మన అకౌంట్ వివరాలు తెలుసుకోగలరు. కానీ OTP మనం చెపితే తప్ప మన డబ్బులు విత్ డ్రా చేయలేరు గుర్తుంచుకోండి.
ఎ.టి.ఎమ్ (ATM) కార్డు ల స్కిమ్మింగ్ లలో జరిగే మోసాలుATM లో డబ్బులు విత్ డ్రా చేసుకొనేటప్పుడు కార్డ్ పెట్టే స్లాట్ లో ఏవైనా కొత్త పరికరాలు అమర్చబడ్డాయేమో గమనించండి.అపరిచితులకు డబ్బులు విత్ డ్రా చేసి పెట్టమని మీ కార్డు ని పొరపాటున కూడా యివ్వకండి. ముఖ్యంగా వయసులో పెద్దవారు, అంతగా చదువు కోనివారు మోసపోయే ప్రమాదం వుంది.
స్క్రీన్ షేరింగ్ యాప్ ల ద్వారా జరిగే మోసాలుఅపరిచితులను నమ్మకండి ముందు వాళ్ళు సరి అయిన వాళ్ళో కాదో నిర్ధారించుకోండి. మీ మోబైల్ ఫోన్ లో యాంటి వైరస్/స్పామ్ (Spam) ని బ్లాక్ చేసే సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసుకోండి.SMS ల ద్వారా పంపబడ్డ ‘యాప్’ ను యెట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోవద్దు. ముఖ్యంగా స్క్రీన్ షేరింగ్ యాప్స్. ఇవి చాలా ప్రమాదకరం.
సిమ్ కార్డ్ వివరాలు దొంగిలించి మోసాలు చేయడంమనకి తెలియని వాళ్ళని నమ్మే ముందు మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ని అడిగి నిజానిజాలు తెలుసుకోండి.ఎట్టి పరిస్థితిలోనూ మీ ఆధార్ కార్డ్ వివరాలు గానీ, మీ సిమ్ కార్డ్ నెంబర్లు గానీ మనకి పరిచయం లేని వాళ్లకి చెప్పకూడదు.

ఇంటర్నెట్ లో సెర్చ్ యింజన్స్ ద్వారా జరిగే మోసాలు

రీఛార్జ్ చేసుకొనే ముందు మీకు కనెక్షన్ యిచ్చిన సర్విస్ ప్రొవైడర్ ఫోన్ నంబర్, ఆ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ మొదలైనవి తెలుసుకోండి.వెబ్ సెర్చ్ యింజన్లల్లో కనిపించే యే నంబరు కంటే ఆ నంబరుకి ఫోన్ చేయకండి. ముఖ్యంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు.

QR కోడ్ ల ద్వారా జరిగే మోసాలు

Quick Response (QR) కోడ్ ని స్కాన్ చేయటం ద్వారా ఆ కోడ్ కి ముందే జత మాచారాన్ని చదువవచ్చు. ఆ సమాచారం యేదైనా కావచ్చు బ్యాంక్ అకౌంట్ వివరాలు కావచ్చు. ఏదైనా వస్తువు ధర కావచ్చు. పాస్ పోర్ట్ వివరాలు కావచ్చు. అనేక రంగాల్లో యీ కోడ్ విరివిగా ప్రాచుర్యం పొందింది.

QR కోడ్ అంటే ఏమిటో ముందుగా వివరంగా తెలుసుకోండి. ఏదైనా ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదం అనిపిస్తే వెంటనే బ్యాంకుకి తెలియజేయండి.డబ్బులు మనకి రావలసినప్పుడు PIN (నంబర్) వాడవలసిన పనిలేదు. కోడ్ కూడా అంతే. మనం డబ్బులు పంపేటప్పుడే స్కాన్ చేయాలి. మనకు రావలసినప్పుడు కాదు.
సామాజిక మాధ్య మాలలో మనకు తెలిసిన వ్యక్తుల్లా నటిస్తూ చేసే మోసాలు.ఎవైన మెసేజీలు వచ్చినప్పుడు నిజమైన వ్యక్తికి ఫోన్ చేసో అతన్ని కలుసుకొనో అందులోని నిజానిజాలు తెలుసుకోండి.మీ వ్యక్తిగత వివరాలు అంటే మీ మొబైల్ నెంబరు, మీ ఇ-మెయిల్ అడ్రస్ లాంటివి అందరికి చెప్పకండి. “మేము మీ స్నేహితులం” అంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్లను తీసుకోకండి.
వివిధ రకాల మోసాలు చేయవలసినవిచేయకూడనివి
మన మొబైల్ డేటాని చార్జింగ్ కేబుల్ ద్వారా దొంగిలించడంమీ మొబైల్ లో “యాంటి-వైరస్ సాఫ్ట్ వేర్” ని వేసుకోండి. దాని వల్ల ఎవరూ మీ మొబైల్ ని ఆపరేట్ చేయలేరు.ప్రైవేటు వ్యక్తుల ఛార్జింగ్ కేబుల్స్ ని / ఎడాప్టర్స్ ను వాడకండి, మీకు బాగా తెలిస్తే తప్ప
“మీకు లాటరీ వచ్చింది” అంటు చేసే మోసాలుమీరు కొనని లాటరీకి మీకు డబ్బులు వచ్చాయంటే మీరు ఎలా నమ్ముతారు? అత్యాశ కదూ?డబ్బులు వూరికే యెవ్వరూ పంపరు. ఆ వలలో పడి మోసపోవద్దు. మీ డబ్బులు మీ కష్టార్జితం, గుర్తు పెట్టుకొండి.
ఉద్యోగాలు ఇప్పిసామాంటూ జరిగే మోసాలుడబ్బులు చెల్లించేముందు మీకు ఉద్యోగం ఆఫర్ చేసిన కంపెనీ, రిక్రూట్ మెంట్ ఏజన్సీ వివరాలను సరి చూసుకోండి“ఉద్యోగం యిస్తాం” లేదా “యిప్పిస్తాం” అన్న వాళ్లకి ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. మీ డబ్బులు కష్టార్జితం గుర్తు పెట్టుకోండి. నిజమైన కంపెనీ ఉద్యోగం యిచ్చేటప్పుడు డబ్బులు అడగదు.
దొంగ “అకౌంట్ నంబరు” సృష్టించి చేసే మోసాలురోడ్ల పైన పెట్టిన స్టాల్స్ లో పాలసీలు తీసుకొనే ముందు అవి కంపెనీ వాళ్ళు పెట్టినవే అని నిర్ధారించుకోవాలి. రిజిస్టర్డ్ ఆఫీసుకి వెళ్ళి పాలసీల వివరాలు తెలుసుకోవటం మంచిది. ఆన్ లైన్ లో డబ్బులు కేవలం అకౌంట్ నంబర్ కే పంపగలం. మోసగాళ్ళు కంపెనీ పేరు కరెక్ట్ గానే చెపుతారు. కాని డబ్బులు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళేట్లు చూసుకొంటారు. మనం జాగ్రత్తగా వుండాలి.అసలు తెలియని వాళ్ళకి డబ్బులు చెల్లించవద్దు. మోసపోయే అవకాశాలు ఎక్కువ
“ఇ-మెయిల్స్” ద్వారా జరిగే మోసాలుఎవరికైనా ఇ-మెయిల్ ఆధారంగా డబ్బులు పంపేటప్పుడు ఎవరికి పంపుతున్నారో ఆ వ్యక్తిని సంప్రదించండి. తరువాతే డబ్బులు పంపండి.ఏదో గుడ్డిగా నమ్మి డబ్బులు పంపకండి. ఒకటికి రెండు సార్లు ఇ-మెయిల్ అడ్రస్ సరిచూసుకోండి. ఇ-మెయిల్స్ ఒకటి రెండు సార్లు పరీక్షించుకోండి.
“మెసేజ్ యాప్స్” ద్వారా జరిగే మోసాలుమనకి తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వుండాలి. ఎవరిని అయినా నమ్మే ముందు మీ బ్యాంక్ బ్రాంచ్ కి ఫోన్ చేసి అసలు విషయమేమిటో తెలుసుకోండి. మీ OTP ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకండి.మనకి తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన యే మెసేజిలను నమ్మకండి. ముఖ్యంగా బ్యాంక్ కి సంబంధించినవి. కార్డ్ డీటెయిల్స్ ఎవ్వరికీ చెప్పకండి. చిన్నచిన్న బహుమతులకు (Gifts) ప్రలోభ పడకండి.
మన ఆస్తి పత్రాలు తీసుకొని మన పేరున బ్యాంక్ లోను తీసుకోవటంఅపరిచితులను నమ్మి వారి చేతికి మీ ఆస్తి పత్రాలను (Documents) ఇవ్వకండి. మోసపోగలరు.ఏ విచారణ జరపకుండా మన ఆస్తి పత్రాలను అపరిచితులకు యివ్వకూడదు. అప్పు కోసం రిజిస్టర్డ్ ఆఫీసులకే వెళ్లండి. ఆన్లైన్ లో కాదు.
ఆన్లైన్ బెట్టింగ్ లో జరిగే మోసాలుఎప్పుడైతే నకిలీ వెబ్ సైట్లలోనో యాప్ల లోనో మోసపోయామని గ్రహించగానే మీ డెబిట్ కార్డ్ / మీ బ్యాంక్ అకౌంట్ /మీ UPI సర్వీస్ లను ఇంకా నష్ట పోకుండా ఆపించుకోండి.మనకి తెలియని వెబ్ సైట్లలో డబ్బులు ఎప్పుడూ చెల్లించకూడదు.
వాక్సినేషన్ ఉచితంగా వేస్తానంటూ చేసే ఆర్థిక నేరాలుOTP ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవాలంటే మీకొచ్చిన SMS పూర్తిగా చదవండి.మీ ఆధార్ నంబరు, మీ PAN నంబర్ మీ కొచ్చిన OTPఎవ్వరికీ చెప్పకండి.
కోవిడ్ పరీక్షల పేరుతో ఆన్ లైన్ మోసాలుకోవిడ్ పరిక్షలు రిజిస్టర్ లేబొరేటరీస్ లోనే చేయించుకొండి.ఆన్లైన్ లో డబ్బులు అడ్వాన్సు పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరంటే వారికి పంపకూడదు.
వివిధ రకాల మోసాలు చేయవలసినవిచేయకూడనివి
“బ్యాంక్ రికవరీ ఏజంట్స్” అంటూ చేసే మోసాలురికవరీ ఏజంట్ల గుర్తింపు కార్డ్ అడగండి. అతని దగ్గర బ్యాంక్ వారి నుంచి వచ్చిన రికవరీ నోటిస్ వుందా లేదా చూడండి. అనుమానం వస్తే బ్యాంక్ బ్రాంచ్ కి ఫోన్ చేసి తెలుసుకోండి.సరైన రసీదు యివ్వక పోయినా / ఆథరైజేషన్ లెటర్ చూపకపోయినా ఏ రివవరీ ఏజంట్ కి డబ్బులు యివ్వకూడదు.
సంక్షేమ పథకాల పేరుతో మోసాలుప్రభుత్వ పథకాల వివరాల కోసం మీ గ్రామ పంచాయతీ లేదా తహసిల్దార్ కార్యాలయాలని సంప్రదించండి. ఫోన్లలో మీ వివరాలను చెప్పకండి.

ఫోన్లలో ఎవరైనా కట్టు కథ వినిపిస్తే నమ్మకండి. మీ వివరాలన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో వున్నాయి. అన్నీ సరి చూసుకొనే మీకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు పంపుతారు. మీ OTP ఎవ్వరికీ పంపకండి

చైన్ మార్కెటింగ్ స్కీముల్లో మోసాలు

ఎలాంటి మోసపూరిత స్కీముల్లో చేరవద్దు. ఇందులో చాలా స్కీములు న్యాయబద్ధమైనవి కావు. ఉదా: పిరమిడ్ స్కీములు, పాంజీ స్కీములు (లేని కంపెనీల పేరుతో యింకోకరి డబ్బులని ఎరగా చూపడం.) మీ స్నేహితుడైనా, మీ బంధువైనా సరే మర్యాదగా ఇలాంటి స్కీముల్పి తిరస్కరించండి.

అలాంటి అర్ధం పర్ధం లేని స్కీములలో చేరకండి. మోసపోతారు తస్మాత్ జాగ్రత!
“ఇంటి నుంచే పని చేయండి” అంటూ చేసే మోసాలు

(Uniform Resource Locators – మన ఇంటి అడ్రస్ లాగా ప్రతి వెబ్ సైట్ కి ఉండే అడ్రెస్) వున్న వెబ్ సైట్ల జోలికి, యింకా అసలు మనకి తెలియని కొత్త వెబ్ సైట్ల జోలికి వెళ్ళకండి. ఒక్కోసారి ఆన్లైన్ వెబ్ సైట్లలో యిచ్చే అప్లికేషన్ ఫామ్స్, పంపే ఇ-మెయిల్స్ లో ఇంగ్లీష్ సరిగా వుండదు. స్పెల్లింగ్ తప్పులు వుంటాయి. గుర్తు పెట్టుకోండి. ఎదుటి వారి నిజాయితినీ తెలుసుకోకుండా. తొందర పడి మన బ్యాంకింగ్ వివరాలను యివ్వకండి.

ఎట్టి పరిస్థితిలోనూ మీ వ్యక్తిగత వివరాలను మీ ఆధార్ కార్డ్ లాంటివి మనకు తెలియని వ్యక్తులకు ఇ-మెయిల్ లో పంపకండి. లాయర్ ని సంప్రదించకుండా ఏ అగ్రిమెంట్ మీదా సంతకం పెట్టకండి. ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులివ్వకండి. మంచి కంపెని యెప్పుడూ డబ్బులు అడగదు.

“అన్ లైన్ షాపింగ్” లలో జరిగే మోసాలుమీరు ఎప్పుడు “ఆన్ లైన్ షాపింగ్” చేసినా సెక్క్యూర్డ్ వెబ్ సైట్ లలో నే చేయండి. వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఓ చిన్న తాళం గుర్తు గాని “https” అనిగాని వుందో లేదో చూసుకోండి.ఎట్టి పరిస్థితిలోనూ మనకి తెలియని వెబ్ సైట్లలో “ఆన్లైన్ షాపింగ్” చేయరాదు. ఆన్ లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు గిఫ్ట్ కార్డులను వాడకండీ. మనీ ట్రేన్స్ఫర్ చేయకండి. ఆ డబ్బులు ఎవరికీ వెళ్ళాయో తెలుసుకోవటం తరువాత కష్టం.
పబ్లిక్ స్థలాల్లో ఉచిత “వై-ఫై” ల ద్వారా జరిగే మోసాలుసురక్షిత్త ప్రదేశాల్లోనే ఉచిత ‘వై-ఫై’ వాడండి. ఎక్కడ బడితే అక్కడ వాడకండి. మోసపోయే ప్రమాదం వుంది.‘ఉచిత వై-ఫై’ వాడేటప్పుడు ఆలోచించండి. పబ్లిక్ ప్రదేశాల్లో “వై-ఫై” ద్వారా మన వివరాలు అంటే బ్యాంకు అకౌంట్లు, యూజర్ ఐ.డి., పాస్ వర్డ్స్ లాంటివి చాలా తేలికగా కాజేయవచ్చు. తరువాత బాధ పడి ప్రయోజనం లేదు.
“ఉచిత అఫర్” లో జరిగే మోసాలుప్రకటనలలో ఒక వేళ అవి పేరున్న కంపెనీలవలయితే వాళ్ళ వెబ్ సైట్ కి వెళ్లి ప్రకటన సరి అయిందో కాదో చూసుకొండి. అప్పటి వరకు వినని కంపెనీ లవయితే వాటి జోలికి పోకండి.“ఉచితం” అనగానే నమ్యేయకండి. మనమెవరో తెలియని వాళ్ళు యేదైనా మనకి ఉచితంగా ఎందుకు యిస్తారు? ఇలా మోసపోయి, మన కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి.
తక్కువ వడ్డీకి అప్పులు యిస్తామంటూ చేసే మోసాలుఅంత తేలిగ్గా అప్పు యిస్తున్నారంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. అలాంటివి నిజమో లేకపోతే మోసపురితమైనవో చూసుకోవాలి.ఎప్పుడూ అలా మనకి తెలియని వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పంపకండి. బ్యాంకులు, యితర రిజిస్టర్డ్ ఆర్థిక సంస్థలు అప్పు మంజూరు చేసేటప్పుడు డబ్బులు అడగవు. గుర్తుంచుకోండి
“క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేయాలి / లిమిట్ పెంచుతాము” అంటూ చేసే మోసాలుఎలాంటి చేదు అనుభవం ఎదురైనా.. యింకా నష్ట పోకుండా వెంటనే కార్డ్ ఆపించండి. అంటే బ్లాక్ చేయించండి. ఇ-మెయిల్ ద్వారానో లెటర్ ద్వారానో లేదా మీ బ్యాంక్ హెూమ్ బ్రాంచ్ కి వెళ్ళి ఒక ఫిర్యాదు యివ్వండి.మీ కార్డ్ వివరాలు, OTP ఎవ్వరికి చెప్పకండి. క్రెడిట్ కార్డ్ అప్ డేషన్ / యాక్టివేషన్ విషయంలో బయటి వాళ్ళని నమ్మకండి. మొబైల్ ఆప్లికేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకోండి. గుర్తుంచుకోండి. ఏ బ్యాంకూ OTP అడగదు.
వివిధ రకాల మోసాలు చేయవలసినవిచేయకూడనివి
” ఆధార్ కార్డ్” తో లింకు అయిన మొబైలు నెంబర్మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన మొబైల్ నెంబరు సరి చూసుకోండి. తరచుగా మీ బ్యాంక్ స్టేట్ మెంట్ గాని పాస్ బుక్ గాని చూసుకోంటూ వుండండి.బ్యాంకింగ్ పరంగా మీ వ్యక్తిగత వివరాలను, అంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, డెబిట్ క్రెడిట్ కార్డ్ నంబర్లు ఎవ్వరికి చెప్పకండి.
“కాష్ బ్యాక్ ఆఫరు” అంటూ జరిగే మోసాలు

ఎలాంటి చేదు అనుభవం ఎరురైనా, యింకా నష్ట పోకుండా వెంటనే కార్డ్ ఆపించండి అంటే బ్లాక్ చేయించండి. ఇ-మెయిల్ ద్వారానో లెటర్ ద్వారానో లేదా మీ బ్యాంక్ హెూమ్ బ్రాంచ్ కి వెళ్ళి ఒక ఫిర్యాదు యివ్వండి.

ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి. అలాంటి ఆఫర్స్ వచ్చాయంటే వాటి నిజాయితీని తెలుసుకోవాలి. UPI PIN అవసరం మనం డబులు చెల్లించేటప్పుడే, మనకు డబులు రావలసినప్పుడు కాదు.

డిస్కౌంట్ల పేరుతో జరిగే మోసాలు

ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. వ్యక్తి వివరాలు తెలుసుకో కుండా ఇవ్వకూడదు. OTP / SMS లో యెంత చెల్లిస్తున్నాం. ఎ అకౌంట్ కి చెల్లిస్తున్నాం, యెవరికి చెల్లిస్తున్నాం మొదలైన అన్ని వివరాలు వుంటాయి చదువుకోండి.

ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి. అలాంటి ఆఫర్స్ యిస్తున్నారని మోసపోకండి. వాటి నిజాయితీని తెలుసుకోవాలి.
“ధార్మిక సంస్థల ” పేరుతో జరిగే మోసాలు

ఎలాంటి ఛారిటీ సంఘం అయినా దాని గురించి సవివరంగా తెలుసుకోండి. “ధార్మిక సంస్థల” ఘరానాగా మోసం చేసే ప్రమాదం లేకపోలేదు. వీటి వెబ్ సైట్ లు అసలైనవిగా కనిపిస్తాయి గాని కాక పోవచ్చు. మన దగ్గర డబ్బు గుంజటానికి చాలా తీయని కబుర్లు చెపుతారు. ధార్మిక సంభాషణలు చేస్తారు. ఏవో మాయ మాటలతో మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి ఎలాగోలాగ డబ్బు ఏదో రూపంలో కాజేస్తారు.

“గూగుల్” లో సెర్చ్ చేసి కనిపించిన నంబర్ కి గుడ్డిగా ఫోన్ చేసి మోస పోకండి. గుర్తుంచుకోండి, మీ కష్టార్జితాన్ని కాజేయటానికి మోసగాళ్ళు యెన్నో వలలు పన్నుతుంటారు
పిక్స్ డిపాజిట్” ల మీద ఒవర్ డ్రాఫ్ట్

మీరు సంతకం పెట్టే ప్రతి డాక్యుమెంట్ చదవండి. అది యేమిటో తెలుసుకోండి. గుడ్డిగా సంతకం పెట్టకండి. వీలైతే బ్యాంక్ ని సందర్శించండి లేదా నమ్మకమైన వ్యక్తి ద్వారా “నెట్ బ్యాంకింగ్” లో బ్యాంక్ లావా దేవీలు జరపండి. అంతే గాని ఫోన్ల మాట్లాడే వ్యక్తుల మాటలు నమ్మకండి, జీవితాన్ని వెచ్చించి కూడబెట్టుకొన్నడబ్బు అది.

ఎట్టి పరిస్థితిలోనూ గుడ్డిగా సంతకాలు పెట్టకండి ముఖ్యమైన డాక్యుమెంట్లను యెవ్వరికీ ఇవ్వకండి. మీ కష్టార్జితాన్ని మోసగాళ్ళ మాటలు నమ్మి పోగొట్టుకోకండి.

మోసపూరిత ‘యాప్స్’ ద్వారా చేసే మోసాలు (స్కిమ్మింగ్)

* “స్కిమ్మింగ్” అంటే కార్డ్ స్వైఫ్ట్ లేదా ఇతర పరికరంతో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను మోసపూరితంగా కాపీ చేసే చర్య.

ఫోన్లలో మాట్లాడే వ్యక్తుల మాటల్ని నమ్మకండి. వాళ్ళ వెబ్ సైట్ పరీక్షించండి.SMSమెసేజిల ద్వారా గాని, ఇ-మెయిల్స్ ద్వారా గానీ పంపబడిన లింకులను ఉపయోగించి, వాటి నిబద్ధతను తెలుసుకోకుండా. యే ‘యాప్ ల’ ను డౌన్ లోడ్ చేసుకోకండి.
అధిక వడ్డీల తో అప్పులు- బెదిరింపులతో వసూళ్ళు

ఇలాంటి యాప్స్ తో జాగ్రత్తగా వుండండి. కంపెనీలు రిజిస్టర్డ్ కాదా అని వరిశీలించుకోండి. ఒక వేళ అది NBFC అయితే https://www.rbi.in/Script/BS_NBFCList.aspx & RBI  అన్ని వివరాలు అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్, అప్పు యిస్తున్నపుడు వాళ్ళు విధించే నియమ, నింబదనలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింప వలసిన సమయం, వాయిదాల వివరాలు.. అన్ని తెలుసుకోండి.

మొబైల్ యాప్ ల లో కనిపించే కంపెనీల గురించి విచారించకుండా, వడ్డీ రేట్లు తెలియకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ వివరాలు విచారించకుండా అప్పు యిస్తున్నారు కదా అని తీసుకోకండి. తరువాత వాళ్ళ చిత్రహింస భరించలేరు.
కార్డ్ క్లోనింగ్ ద్వారా జరిగే మోసాలు

క్లోనింగ్ అంటే మన డెబిట్/ క్రెడిట్ కార్డులలోని వివరాలను ఓ ఎలెక్ట్రానిక్ పరికరం ద్వారా దొంగిలించి యింకో నకిలీ కార్డ్ తయారు చేసి, PIN నంబర్ అడిగి తెలుసుకొని అకౌంట్ల నుంచి డబ్బులు కాజేయటం.

మీ PIN నంబరుని ఎవ్వరికీ కనిపించకుండా “ఎంటర్” చేయండి. తరచుగా PIN మారుస్తూ వుండండి. మీరు బయట బిల్లులు చెల్లించేటప్పుడు మీ సమక్షం లోనే “స్వెప్” చేయమనండి.మీ డెబిట్/క్రెడిట్ కార్డులను ఎవ్వరికీ ఇవ్వకండి. మీ PIN నంబర్ యెవరికి చెప్పకండి. మీ కార్డులను బయటకు తీసుకొని వెళ్ళనీయకండి.
మన డెబిట్/ క్రెడిట్ కార్డుల వివరాలు స్నేహితులకు/ బందువులకు చెప్పటం ద్వారా జరిగే నష్టాలుతరచుగా మీ PIN నెంబర్ ను మారుస్తూ వుండండి.మీ డెబిట్/క్రెడిట్ కార్డులను ఎవ్వరికీ ఇవ్వకండి.  వివరాలను ఫోన్లులో పంపించకండి. మీ PIN నంబర్ యెవరికి చెప్పకండి. తరువాత నష్ట పోయేది మీరే.
పేమెంట్ స్పూఫింగ్ ద్వారా జరిగే మోసాలుఒక వేళ మీరు వ్యాపారస్థులయితే మీ షాపు లో డబ్బులు వచ్చాయా లేదా అని చూసుకోవాలి. UPI ద్వారా పేమెంట్ మీ అకౌంట్లోకి మన అకౌంట్ లో డబ్బు పడనంత వరకు ట్రైన్నాక్షన్ పూర్తి అయినట్లు కాదు గుర్తుంచుకోండి.

1930 హెల్ప్ లైన్ నంబర్ను మీ మొబైల్లో లో సేవ్ చేసుకున్నారా? దీని ఉపయోగం ఏంటి?

సైబర్ నెరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.  సైబర్ నేరాల అడ్డుకట్టకు, సైబర్ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్ ఫ్రీ నంబర్లో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్ ను మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.  ఏదైనా మోసం జరిగినప్పుడు ఈ నంబర్ కు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చు. లేదా www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి.

How to stop cyber crime Telugu cyber crime awareness, How to stop cyber crime Telugu, cyber crime awareness programme, cyber crime Telugu

Sharing is caring!

error: Content is protected !!