How to create APAAR ID in DigiLocker Telugu
ఉపాధ్యాయులకు అపార్ కార్డు
Note: ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే.. ఉపాధ్యాయుల APAAR ID కార్డు గురించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.. (How to create APAAR ID in DigiLocker Telugu)
- ఉపాధ్యాయులు డిజి లాకర్ లో సైన్ అప్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- ఉపాధ్యాయుని పేరు, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సిక్స్ డిజిట్ పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి.
- తర్వాత మీ ఆధార్ కార్డు నమోదు చేయాలి.
- ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత సైన్ ఇన్ లోకి వెళ్లి యూజర్ ఐడి పిన్ నెంబర్ ఎంటర్ చేసి signin చేయాలి.
- మీకు డిజిలాకర్లో మీ యొక్క అపార్ కార్డు కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి.
- అపార్ కార్డు కనిపించకపోతే సెర్చ్ డాక్యుమెంటులోకి వెళ్లాలి. అపార్ అని సెర్చ్ చేసినప్పుడు.. మన పేరుతో పాటు మన ఇంటిలో చదువుకునే పిల్లల పేర్లు కూడా కనిపిస్తాయి.. అందులో మన పేరుని సెలెక్ట్ చేసుకోవాలి.. తరువాత మన Name, Date of birth, Gender కనిపిస్తాయి… తరువాత మిగిలిన సమాచారము లొ కేవలం Identity Type దగ్గర None అని ఇచ్చి get document పై click చేయాలి. అధికారిక ఉత్తర్వులు ఇచ్చే వరకు వేచి ఉండండి..
డిజిలాకర్ అంటే ఏమిటి ?
డిజిలాకర్ అనేది కేంద్ర ప్రభుత్వం దేశ పౌరుల కోసం వారి ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకునేందుకు ప్రవేశపెట్టిన సర్వీస్. ప్రతి సారి, ప్రతి చోటికి డాక్యుమెంట్ హార్డ్ కాపీలను తీసుకుని వెళ్లే వారి ఇబ్బందులను తగ్గించడం కోసం ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. దీంట్లో ఆధార్, పాస్ పోర్టు, పాన్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకునే వీలుంది. ఇక్కడ పౌరులు వారికి చెందిన అన్ని రకాల పత్రాలను దాచుకోవచ్చు. అదేవిధంగా మీకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. మీ డిజిలాకర్ ఖాతాలో ఏదైనా డాక్యుమెంట్ పత్రాన్ని సేవ్ చేసినప్పుడు, దానికి మీరు ఈ – సైన్ ను జోడించవచ్చు.
డిజిలాకర్ ఎలా పనిచేస్తుంది?
డిజిలాకర్ వెబ్‌సైట్, యాప్ రూపంలోనూ డిజిలాకర్ అందుబాటులో ఉంది. డిజి లాకర్‌లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్, యాక్టివిటీస్, షేర్డ్ డాక్యుమెంట్స్, ఇష్యూడ్ డాక్యుమెంట్స్, అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్, ఇష్యూవర్, రిక్వెస్టర్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఒక జీబీ వరకూ స్పేస్‌ను వినియోగించుకోవచ్చు. ఆధార్‌కార్డు ఉన్నవారు, లేనివారు కూడా దీన్ని ప్రారంభించుకోవచ్చు.
డిజిలాకర్ లో ఎలా నమోదు చేసుకోవాలి ?
https://digilocker.gov.in లింక్‌కు వెళ్లి సులభంగా డిజిలాకర్‌ను తెరుచుకోవచ్చు. ముందు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేస్తే తర్వాత పేజీకి వెళతారు. అక్కడ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని సైనప్‌పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్‌కు మీరు వాడుతున్న మొబైల్ నంబరే లింక్ అయి ఉంటే ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు ఆధార్ సెంట్రల్ సర్వస్ నుంచి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ స్టెప్‌ను స్కిప్ చేయవచ్చు. దీంతో మీ డిజిలాకర్ ఖాతా సిద్ధమైనట్లే.
డిజిలాకర్ హెల్ప్ లైన్ :
మీరు డిజిలాకర్ కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, మీ ప్రశ్నను support@digitallocker.gov.in కి ఈ-మెయిల్ చేయవచ్చు.
DigiLocker Android app
Read also..