WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Good Friday History and Significance in Telugu

Good Friday History and Significance in Telugu

గుడ్ ఫ్రైడే చరిత్ర, ప్రాముఖ్యత, గుడ్ ఫ్రైడే పండగని ఎందుకు జరుపుకుంటారు..?, ఆ రోజున ఏమి చేస్తారు..?

గుడ్ ఫ్రైడే (Good Friday) అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది యేసుక్రీస్తు త్యాగం మరియు ప్రేమను గుర్తుచేస్తుంది. ఇది ఏసుక్రీస్తు సిలువపై మరణించిన రోజును గుర్తుచేసుకునేందుకు జరుపుకునే పండుగ. ఈ రోజున, క్రైస్తవులు ఏసుక్రీస్తు పాపాల కోసం తన ప్రాణాలు త్యాగం చేసినందుకు కృతజ్ఞతతో ప్రార్థనలు చేస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత యేసు పునరుత్థానం ఈస్టర్‌గా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో, గుడ్ ఫ్రైడేను ఏప్రిల్ 18 న జరుపుకొనున్నారు. (Good Friday History and Significance in Telugu)

గుడ్ ఫ్రైడే చరిత్ర (Good Friday History):

చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. యేసుక్రీస్తును సిలువ వేసిన శుక్రవారాన్ని గుర్తుచేసుకుంటూ గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ప్రభువును శిలువ వేయడాన్ని గురించి ప్రస్తావించింది. యూదా ఇస్కరియోత్ అనే యేసు ప్రభువు శిష్యుడు కేవలం 33 వెండి నాణేల కోసం యేసు ప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు. ఆ తర్వాత క్రీస్తును తీసుకురావడం ఆయన్ను సిలువ వేయడం, సిలువపై వ్రేలాడి ఉండగా ప్రభువు చివరిగా మాట్లాడే ఏడు మాటలను క్రైస్తవులు ఈ రోజు గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.

యేసు తాను భూమిపై బతికున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది తమ పొరుగు వారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్తారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. ఈ రోజున, క్రైస్తవులు దుఃఖం, తపస్సు మరియు ఉపవాసంతో గడుపుతారు.

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత (Good Friday Significance):

క్రైస్తవ మతంలో యేసు మరణించిన రోజు ఆయన ప్రపంచంలోని పాపాలను తనతో పాటు మోసుకున్నాడని మరియు ఆయన త్యాగం కారణంగా ప్రజలు విముక్తి పొందారని మరియు మరణానంతరం స్వర్గానికి చేరుకోగలరని నమ్ముతారు. యేసు శిలువ వేయడం మరియు మరణం ఆయన త్యాగం మరియు మానవులు చేసిన అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తుంది. ఈ రోజున, క్రైస్తవులు ఏసుక్రీస్తు పునరుత్థానం ద్వారా పాపం మరియు మరణంపై విజయం సాధించారని నమ్ముతారు. గుడ్ ఫ్రైడే, క్రైస్తవులకు ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనానికి ఒక అవకాశం.

గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముందు శుక్రవారం

గుడ్ ఫ్రైడే అనేది ఈస్టర్ ముందు వచ్చే శుక్రవారం, ఇది తూర్పు క్రైస్తవమతం, పశ్చిమ క్రైస్తవమతాలలో వేర్వేరుగా గణించబడుతుంది. పాస్కల్ పౌర్ణమి తరువాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్ వస్తుంది,  పౌర్ణమిని వసంతకాలంలో సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే తేదీగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ప్రధానంగా జరుపుకునే ఈ రోజును యేసు సిలువ వేయబడిన రోజును గుర్తుచేసుకునే సంతాప దినంగా భావిస్తారు.

గుడ్ ఫ్రైడేతో సంబంధిత పండుగలు

ఈస్టర్ కు ముందు వారంలో పవిత్ర వారం జరుపుకుంటారు మరియు వారంలోని ప్రతి రోజును ‘పవిత్ర దినం’ గా పాటిస్తారు . ఈ వారం రోజులను ఇలా పిలుస్తారు:

  • తాటి ఆదివారం
  • పవిత్ర సోమవారం
  • పవిత్ర మంగళవారం
  • స్పై వెడ్నెస్‌డే
  • మాండీ గురువారం
  • గుడ్ ఫ్రైడే
  • పవిత్ర శనివారం
  • ఈస్టర్ ఆదివారం
Thank you for reading... Share this...
error: Content is protected !!