WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Ghee: Amazing Health benefits Myths and Facts

Ghee: Amazing Health benefits, Myths and Facts

నెయ్యితో కొవ్వు పెరిగి పోతుందనీ, ఆది ఆరోగ్యానికి హానికరమనే భావన చాలా మందిలో నాటుకు పోయింది. కానీ మేధో శక్తినీ, జ్ఞాపక శక్తినీ పెంచడంలో, జీర్ణవ్యవస్థను చక్కదిద్దడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ వైరల్ గా పనిచేసే బుటిరిక్ యాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఎక్కువే! వీటితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే… (Ghee: Amazing Health benefits, Myths and facts)

నెయ్యి అరోగ్య ప్రయోజనాలు (Ghee: Health benefits):

  • బీటా కెరోటిన్లకు,  ఎ, డి, కె విటమిన్లకు నెయ్యి ఒక నిధి లాంటిది. మిగతా వంట నూనెల్లో కంటే, నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.
  • నెయ్యిలోని జీవశక్తినీ, వ్యాధి నిరోధకశక్తినీ పెంచే అంశాలు, ఆయుష్షు వృద్ధికి తోడ్పడంతో పాటు, వార్ధక్య లక్షణాలను నియంత్రించి యవ్వనాన్ని నిలబెడతాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపే శక్తి కూడా నెయ్యిలో ఉంది.
  • నెయ్యి పిల్లల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది.
  • నెయ్యిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియలను ఉత్తేజ పరచడంతోపాటు, కొలెస్ట్రల్ను, శరీర బరువునూ తగ్గిస్తాయి.
  • నెయ్యి కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గ్లకోమా సమస్యను తగ్గిస్తుంది. నిత్యం నెయ్యి సేవిస్తే నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది.
  • పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల చిన్న పేగులకు సంగ్రహించే శక్తి పెరుగుతుంది. పేగుల్లోని పీహెచ్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.
  • నెయ్యి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముఖంపై ముడతలు దూరమవుతాయి.
  • ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధం.
  • ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్ యాసిడ్, విటమిన్ ఎ, డి, ఇ, కె…. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కీళ్లలో రాపిడినీ తగ్గిస్తాయి.
  • శరీర కణాలలో ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడం తగ్గుతుంది. రక్తనాళాలు గట్టి పడటాన్ని నిరోధిస్తుంది.
  • చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది, మరియు శక్తి స్థాయిలను పెంచుతుంది.
  • ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం ఆకృతిని, టోన్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది ముఖ ముడతలను కూడా తొలగిస్తుంది.
  • యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎముకలు, కీళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  • కళ్ల చుట్టూ కొద్దిగా నెయ్యి రాసి మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే కళ్ల కింద వాపును తొలగిస్తుంది.
  • నెయ్యిలో లాక్టోస్ ఉండదు, కాబట్టి లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా నెయ్యిని సురక్షితంగా తీసుకోవచ్చు.
  • నెయ్యిలోని ఒమేగా-3 మరియు ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు మెదడుకు సరైన ఆహారాన్ని అందించడం ద్వారా దానిని పోషించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక చురుకుదనం వంటి కార్యకలాపాలకు దోహదం చేస్తుంది.

నెయ్యి అపోహలు, వాస్తవాలు (Ghee: Amazing Health benefits Myths and Facts):

  • అపోహ: నెయ్యి తింటే బరువు పెరుగుతాం.
  • వాస్తవం: నెయ్యిలోని లినోలిక్ యాసిడ్ అధిక బరువును తగ్గి స్తుంది. పేగులను బలపరచ డంతో పాటు, రక్తనాళాల గోడల్లో అడ్డంకులు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. కాబట్టి దృఢంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం పరిమితంగా నెయ్యిని తీసుకోవడం అవసరం.
  • అపోహ: నెయ్యి గుండెకు చేటు చేస్తుంది.
  • వాస్తవం: నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వును కరిగించే ఎ, ఇ, డి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
  • అపోహ: లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు
  • వాస్తవం: పాలు సరిపడని ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్లు కూడా నెయ్యిని నిక్షే పంగా తినవచ్చు.
  • అపోహ: వంటకు నెయ్యి వాడ కూడదు.
  • వాస్తవం: మిగతా నూనెల్లా స్మోకింగ్ పాయింట్కు చేరుకు న్నప్పుడు ఫ్రీ ర్యాడికల్స్ విడి పోయే ప్రమాదం నెయ్యిలో ఉండదు. కాబట్టి వంటలకు నెయ్యిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
  • అపోహ: నెయ్యి తేలికగా అరగదు.
  • వాస్తవం: నెయ్యిలో సహజసిద్ధ బుటైరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. పేగుల కదలికలను పెంచి మల బద్ధకాన్ని నివారిస్తుంది. కాబట్టి నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగై, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.
ముఖ్య గమనిక: నెయ్యిని మితంగా తీసుకోవడం మంచిది.

Read also..

Iron deficiency: Symptoms Causes, Complications, Prevention

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!