Finger millets (Ragi) Advantages and Side Effects
రాగులు (ఫింగర్ మిల్లెట్)
రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని శాస్త్రీయ నామం ఎలుసిన్ కొరాకానా. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే రాగులు (ఫింగర్ మిల్లెట్) మనకు తెలియని ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇతర గింజల్లో వేటిల్లోనూ లేనంత క్యాల్షియం నిల్వలు వీటిలో ఉంటాయి. రాగులు అధిక పీచు (fiber), కాల్షియం, ఐరన్, మినిరల్స్ , అయోడిన్ మరియు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో రాగులు తినడం మంచిది. (Finger millets (Ragi) Advantages and Side Effects)
దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రించబడుతుంది, రక్తహీనత నివారించబడుతుంది మరియు మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచిది. బరువు తగ్గడానికి రాగులు చాలా బాగా ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.
ఎముకల పుష్టి కోసం తీసుకునే క్యాల్షియం మాత్రలకు బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మంచిది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతిరోజూ రాగి జావ ఇస్తుండాలి. దీంతో పాటు వీటిల్లో అత్యధిక స్థాయిలో ఉండే పాలిఫెనాల్, ఫైబర్, బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో ఉంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ కు ఇంది మంచి మందు. కావల్సినంత సహజసిద్ధమైన ఇనుము ఇందులో ఉంటుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రాగుల్లో ఏమున్నాయ్.. ఏం చేస్తాయ్..?
- కాల్షియంతో ఎముకలు, దంతాలు గట్టిపడతాయి.
- గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి మధుమేహాన్ని పెంచవు.
- చర్మం ముడతలు నుంచి మిథియోనైన్, లైసిన్ కాపాడును.
- విటమిన్ D లోపాన్ని అధిగమించొచ్చు.
- ఐరన్ తో రక్తహీనత తగ్గుతుంది.
- ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తాయి.
- ఫైబర్ కడుపులో ఎక్కువసేపు వుండి ఆకలిని తగ్గిస్తాయి.
- బీపీ, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
- ఇందులోని అయోడిన్ థైరాయిడ్ ని తగ్గిస్తాయి.
రాగిజావతో ప్రయోజనాలు:
కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగిపిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగి జావ నిజంగానే ఆరోగ్య ప్రదాయిని. వేసవి కాలంలో దీన్ని రోజుకోక సారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి.
- రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
- ఎదిగే పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది.
- శరీర వేడిని తగ్గిస్తుంది.
- శారీరక దృఢత్వం వస్తుంది.
- బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.
- రక్తస్రావం తగ్గుతుంది, వీర్యకణాల వృద్ధి జరుగుతుంది.
- కాలంతో సంబంధం లేకుండా దీన్ని తాగవచ్చు.
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు క్లుప్తంగా:
- రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి..
- రాగిపిండిలో విటమిన్ సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
- రాగుల్లో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో రాగుల్ని చేర్చుకుంటే మంచిది.
- రాగుల్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
- రాగిపిండిలో పలురకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడి, ఆందోళనలు తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికి, రక్తం తయారవడానికి, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
- రాగుల్లో మాంసకృత్తులు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.
- రాగిపిండి రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చూడవచ్చు.
- బరువు తగ్గాలనుకునే వారు రాగులను భోజనంలో చేర్చుకోవాలి. జావ రూపంలో సంగటి రూపంలో కూడా రాగి పిండిని తీసుకోవచ్చు.
- ఎనీమియాతో బాధపడేవారు రాగి జావలో బెల్లం వేసుకొని తాగడం వలన ఆ సమస్య నుండి బయటపడొచ్చు.
రాగులను ఎలా ఉపయోగించవచ్చు?
- రాగుల పిండితో చపాతీలు, దోసలు, ఇడ్లీలు, అంబలి, జావ వంటి వంటకాలు తయారు చేసుకోవచ్చు.
- రాగులను మొలకలుగా చేసి తినవచ్చు.
- రాగుల జావ ఉదయం పూట తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పరిమితులు:
- మీరు కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు లేదా మరే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, రాగులను తినే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
- మీరు అధికంగా రాగులు తింటే, జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు, కాబట్టి మోతాదును సరిగా చూసుకోవాలి.
- ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ద్రవ యాసిడ్‌ను పెంచుతుంది.
Read also..