Emergency Alert on Mobile Phones on May 2 – Don’t Panic – Details Here
మే 2న మొబైల్ ఫోన్లలో అత్యవసర హెచ్చరిక – భయాందోళనలు చెంద వద్దు – వివరాలు ఇవే
మన దేశపు NDMA ఆధ్వర్యంలో శనివారం (మే 2) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పరీక్షను నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు.

పరీక్ష సమయంలో ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్తో ఇది రావచ్చు. అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపించే సందేశం ఇదని.. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
Thank you for reading... Share this...Big step towards a safer India!
Union Home Minister Shri Amit Shah, along with Union Minister Shri Jyotiraditya Scindia, to launch nationwide mobile-based disaster communication system on May 2.
Indigenous Cell Broadcast testing underway for real-time, geo-targeted alerts in… pic.twitter.com/JJXCw6doD8
— DoT India (@DoT_India) April 30, 2026
