WhatsApp Channel Join Now
Telegram Group Join Now

DSC 7th Class Science Motion and Time Lesson Practice Bits

DSC 7th Class Science Motion and Time Lesson Practice Bits

7వ తరగతి భౌతికశాస్త్రంలోని “చలనం మరియు సమయం” పాఠ్యాంశం వస్తువుల కదలిక, రకాలు (సరళ, వక్ర), వేగం, సమయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. విద్యార్థులు దూర-కాల గ్రాఫ్‌లు, సగటు వేగం వంటి అంశాలను గురించి నేర్చుకుంటారు. నిత్య జీవితంలో చలనం, సమయం యొక్క అనువర్తనాలను అర్థం చేసుకుంటారు. (DSC 7th Class Science Motion and Time Lesson Practice Bits)

01) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడి అంటారు.

బి) ప్రయాణించిన మొత్తం దూరాన్ని, ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే దూరం వస్తుంది.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

02) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకను. దాని సంకేతం S.

బి) కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు (ని) మరియు గంటలు (గం)

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

03) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు.

బి) ప్రారంభ స్థానభ్రంశంలో స్వల్ప మార్పు లోలకపు డోలావర్తన కాలాన్ని ప్రభావితం చేస్తుంది.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

04) ఈక్రింది వాక్యాలను పరిశీలించండి.

ఎ)ఒక వస్తువు సమానకాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనం

బి)ఎగురుతున్న గాలిపటం క్రమచలనానికి ఉదాహరణ

      1.ఎ-సరైనది, బి-సరైనది

      2.ఎ-సరైనది, బి-సరికానిది

      3.ఎ-సరికానిది, బి-సరికానిది

      4.ఎ-సరికానిది, బి-సరైనది

05) వాహనం ప్రయాణించిన దూరాన్ని తెలిపే మీటరును ఏ పేరుతో పిలుస్తారు?

       1. ఓడో మీటరు

       2. మానోమీటర్

       3. అల్టీమీటర్

       4. స్పీడోమీటరు

06) ఈక్రింది వాటిలో సరళరేఖీయ చలనానికి ఉదాహరణ కాని వాటిని గుర్తించండి.

ఎ) కేరమ్ బోర్డులో బిళ్ళల చలనం

బి) చెట్టుమీద నుండి పడే కాయ చలనం

సి) టేపు రికార్డరులో టేపు చలనం

డి) మలుపుల్లో కారు ప్రయాణం

  1. ఎ మాత్రమే
  2. డి మాత్రమే
  3. ఎ, బి
  4. సి, డి

07) ప్రియ, కార్తీక్, శ్వేత, వరుణ్ లు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. వాళ్ళు వరుసగా 20సె।।, 22సె।।, 25సె।।, 28సె।। లలో గమ్యస్థానానికి చేరారు. ఎవరు అతి నెమ్మదిగా పరిగెత్తారు.

     1.శ్వేత

      2.కార్తీక్

       3.ప్రియ

       4.వరుణ్

08) స్టాప్ వాచ్ ను దీనికోసం ఉపయోగిస్తారు

        1.ఒకరోజు కంటె తక్కువ కాలాన్ని లెక్కించడానికి

        2.ఒకరోజు కంటె ఎక్కువ కాలాన్ని లెక్కించడానికి

         3.వేగాన్ని లెక్కించడానికి

         4.రెండు సందర్భాల మధ్య కాలాన్ని లెక్కించడానికి

09) డోలనచలనం అనేది దీని ఆధారంగా నిర్థిష్ట మార్గంలో పైకి క్రిందకు చలిస్తుంది.

        1.కాలం

         2.వేగం

         3.స్థిర బిందువు

         4.కాల నిష్పత్తి

10) ఈక్రిందివాటిలో చలనంతోను మరియు కాలముతోను, రెంటితోను సంబందంలేని పదార్ధం ఏది?

         1.అమీబా

         2.పావురం

         3.గులాబీమొక్క

         4.రాయి

సమాధానాలు : 1-1; 2-3; 3-1; 4-2; 5-1; 6-4; 7-4; 8-4; 9-3; 10-4

Thank you for reading... Share this...
error: Content is protected !!