WhatsApp Channel Join Now
Telegram Group Join Now

DSC 7th Class Science Heat Lesson Practice Bits

DSC 7th Class Science Heat Lesson Practice Bits

7వ తరగతి భౌతిక శాస్త్రంలో “ఉష్ణం” పాఠంలో ఉష్ణం అంటే ఏమిటి, అది వస్తువుల మధ్య ఎలా సంక్రమిస్తుంది, వివిధ ఉష్ణ వాహకాలు, ఉష్ణ విస్తరణ, తాప ఉష్ణోగ్రతల మానాలు వంటి విషయాలను తెలుపుతుంది. ఇందులో ఉష్ణ బదిలీ యొక్క వివిధ పద్ధతులు – వాహనం, సంవహనం మరియు వికిరణం వంటి వాటి గురించి వివరించబడ్డాయి. వివిధ పదార్థాలపై ఉష్ణం యొక్క ప్రభావాలు మరియు వాటి అనువర్తనాలు కూడా చర్చించబడతాయి. ఇది దైనందిన జీవితంలో ఉష్ణం ప్రాముఖ్యతను వివరిస్తుంది. (DSC 7th Class Science Heat Lesson Practice Bits)

01) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానమును ఉష్ణవాహనము అంటారు.

బి) అన్ని సందర్భాలలో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించదు.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

02) క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

  1. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే ధర్మామీటర్ ను క్లినికల్ ధర్మామీటర్ అంటారు.
  2. ధర్మామీటర్ మీద సెల్సియస్ స్కేల్ ఉపయోగించబడుతుంది.
  3. ధర్మామీటర్ లో ఉపయోగించే రసాయనం సల్ఫ్యూరిక్ ఆమ్లం
  4. ధర్మామీటర్ స్కేల్ °c గుర్తు ద్వారా సూచించబడుతుంది.

03) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణవహన విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది.

బి) ఉష్ణమును తేమ గుండా సులభంగా ప్రసరింపచేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

04) క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తున్నపుడు గమనించవలసిన జాగ్రత్తలలో సరికానిది.

  1. థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు మరియు తర్వాత తప్పనిసరిగా క్రిమిసంహారక ద్రవంతో శుభ్రపరచుకోవాలి.
  2. ఉపయోగించక ముందు పాదరస మట్టం స్థాయి 35°c కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి.
  3. దృష్ఠిరేఖ వెంట పాదరసం మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ నమోదు చేయాలి.
  4. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు చేయరాదు.

05) ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న స్కేలు ……? (ఉష్ణోగ్రత పరంగా)

  1. ఫారెన్ హీట్ స్కేలు
  2. సెల్సియస్ స్కేలు
  3. మీటర్ గేజ్
  4. కెల్వన్ స్కేల్

06) మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత విలువ ఎంత?

  1. 420C
  2. 370C
  3. 500C
  4. 270C

07) క్రింది వానిలో ఉష్ణవాహకాలను గుర్తించండి.

a) అలూయమినియం

b) ఇనుము

c) రాగి

  1. a మరియు b
  2. b మరియు c
  3. a మరియు c
  4. a, b మరియు c

08) సూర్యుని నుండి విడుదలై మనకు వేడి అందే ప్రక్రియ ……?

  1. ఉష్ణవహనం
  2. ఉష్ణసంవహనం
  3. ఉష్ణవికిరణం
  4. ఉష్ణోగ్రత

09) అండర్స్ సెల్సియస్ ……?

  1. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త
  2. జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త
  3. స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త
  4. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త

10) ఘన పదార్థాలలో సాధారణంగా ఉష్ణ ప్రసారం జరిగే విధానం?

  1. ఉష్ణవహనం
  2. ఉష్ణసంవహనం
  3. ఉష్ణవికిరణం
  4. ఉష్ణోగ్రత
సమాధానాలు : 01-1; 02-3; 03-3; 04-2; 05-2; 06-2; 07-4; 08-3; 09-3; 10-1

Read also..

DSC 7th Class Science Acids, Bases and Salts Practice Bits

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!