WhatsApp Channel Join Now
Telegram Group Join Now

DSC 7th Class Science Acids, Bases and Salts Practice Bits

DSC 7th Class Science Acids, Bases and Salts Practice Bits

7వ తరగతి భౌతికశాస్త్రంలోని “ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు” పాఠం ఈ రసాయన సమ్మేళనాల ప్రాథమిక లక్షణాలను వివరిస్తుంది. వాటి రుచి, స్పర్శ మరియు లిట్మస్ కాగితంతో చర్య వంటి లక్షణాలను పరిచయం చేస్తుంది. తటస్థీకరణ చర్య మరియు రోజువారీ జీవితంలో వాటి ఉపయోగాలు కూడా చర్చించబడతాయి. ఇది రసాయనాల ప్రాధమిక అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. (DSC 7th Class Science Acids, Bases and Salts Practice Bits)

01) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను ఆమ్లాలు అంటారు.

బి) ఒక పదార్థం ఆమ్లము లేదా క్షారము అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలను సూచికలు అంటారు.

సి) ఆమ్ల లేదా క్షార స్వభావము కలిగిన పదార్థ ద్రావణానికి కలిపినపుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి.

సరైన సమాధానాన్ని గుర్తించండి

  1. ఎ మరియు బి సరియైనవి
  2. బి మరియు సి సరియైనవి
  3. ఎ మరియు సి సరియైనవి
  4. ఎ, బి మరియు సి సరియైనవి

02) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు, రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరించవు.

బి) తటస్థీకరణ ప్రతిచర్యలో, వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

03) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు.

బి) తటస్థ ద్రావణాలు ఆమ్లాలు కావు, క్షారాలు.

సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది
  2. బి మాత్రమే సరియైనది
  3. ఎ మరియు బి సరియైనవి
  4. ఎ మరియు బి సరియైనవి కావు

04) వెనిగర్ నందలి ఆమ్లము ……?

  1. ఎసిటిక్ ఆమ్లము
  2. ఫార్మిక్ ఆమ్లం
  3. సిట్రిక్ ఆమ్లం
  4. లాక్టిక్ ఆమ్లం

05) క్రింది వాటిని పరిశీలించండి.

ఎ) ఆమ్లము మరియు క్షారం ల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు.

బి) తటస్థీకరణ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం విడుదల అవుతుంది.

సి) ఆమ్లము + క్షారం → లవణం + నీరు (ఉష్ణం విడుదలవుతుంది)

సరైన సమాధానాన్ని గుర్తించండి

  1. ఎ మరియు బి సరియైనవి
  2. బి మరియు సి సరియైనవి
  3. ఎ మరియు సి సరియైనవి
  4. ఎ, బి మరియు సి సరియైనవి

06) చీమలు కుట్టడం ద్వారా విడుదలయ్యే ఆమ్లము?

  1. ఎసిటిక్ ఆమ్లము
  2. ఫార్మిక్ ఆమ్లం
  3. సిట్రిక్ ఆమ్లం
  4. లాక్టిక్ ఆమ్లం

07) నిమ్మరసం నందలి ఆమ్లము?

  1. ఎసిటిక్ ఆమ్లము
  2. ఫార్మిక్ ఆమ్లం
  3. సిట్రిక్ ఆమ్లం
  4. లాక్టిక్ ఆమ్లం

08) ‘‘ఎసిరే’’ అనునది ……?

  1. లాటిన్ భాషా పదం
  2. అమెరికన్ భాషా పదం
  3. గ్రీకు భాషా పదం
  4. జపాన్ భాషా పదం

09) ఆమ్లము + క్షారం = _____ + నీరు

  1. ఆమ్లం
  2. క్షారం
  3. లవణం
  4. పైవన్నీ

10) లిట్మస్ను ఆమ్ల ద్రావణానికి కల్పినపుడు వచ్చే రంగు?

  1. లేత ఊదా రంగు
  2. నీలం రంగు
  3. ఎరుపు రంగు
  4. ఆకుపచ్చ రంగు

సమాధానాలు : 1-2; 2-2; 3-1; 4-1; 5-4; 6-2; 7-3; 8-1; 9-3; 10-3

DSC 7th Class Science Motion and Time Lesson Practice Bits

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!