DSC 6th Class Science THE LIVING ORGANISMS Practice Bits
6వ తరగతి సామాన్య శాస్త్రం “సజీవులు – లక్షణాలు మరియు ఆవాసాలు” ప్రాక్టీస్ బిట్స్
6వ తరగతి ” సజీవులు – లక్షణాలు మరియు ఆవాసాలు” అనే పాఠం ద్వారా విద్యార్ధులు మన చుట్టూ ఉన్న వివిధ జీవుల గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. జీవుల లక్షణాలు, వాటి ఆవాసాలు, జీవన విధానాల గురించి తెలుసుకుంటారు. మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ, ఆహారపు అలవాట్లు, ప్రత్యుత్పత్తి, వాటి పరిసరాలతో సంబంధం వంటి అంశాలను కూడా అర్థం చేసుకుంటారు. ఈ పాఠం మన చుట్టూ ఉన్న జీవ వైవిధ్యం గురించి విద్యార్ధులకు అవగాహనను పెంచుతుంది. (DSC 6th Class Science THE LIVING ORGANISMS Practice Bits)
01) క్రింది వానిలో పెరుగుదలకు అవసరం అయినది కానిది.
- గాలి
- నీరు
- కాంతి
- ధ్వని
02) ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు నెమ్మదిగా మారుతూ ఉంటాయి.
- అప్పుడు ఆ ప్రాంతం నుంచి సజీవులు వెళ్లిపోతాయి
- అప్పుడు ఆ ప్రాంతానికి సజీవులు వచ్చి చేరతాయి
- అప్పుడు ఆ ప్రాంతానికి అనుకూలంగా సజీవులు అనుకూలనం చెందుతాయి
- అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన సజీవులు, నిర్జీవ అంశాలను మార్చుకుంటాయి.
03) పర్వత ప్రాంతాలలో పెరిగే కొండగొర్రెలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేసుకున్న అనుకూలనము
- పొడవైన కొమ్ములను కలిగి ఉండటం
- దట్టమైన ఉన్నిని కలిగి ఉండటం
- బలమైన తోకను కలిగి ఉండటం
- బలమైన గిట్టలను కలిగి ఉండటం
04) మైదాన ప్రాంతంలో జీవించే మనం ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్లినపుడు
- మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాము
- మనం ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడతాము
- మన గుండె కొట్టుకోవడం సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటాము
- మన శరీరం విసర్జన ప్రక్రియను నిర్వహించడంలో ఇబ్బంది పడుతుంది.
05) సింహము యొక్క గోధుమ రంగు కు కారణం.
- అటవీ ప్రాంతంలోని పచ్చదనానికి అనుకూలనము
- వేగంగా పరుగెత్తే లక్షణానికి నిదర్శనము
- అడవికి రాజు కనుక దర్పం ప్రదర్శనము
- గడ్డిభూములలో నివాసానికి అనుకూలనము
06) క్రింది వానిలో భిన్నమైనది గుర్తించండి.
- పర్వత పాద ప్రాంతం
- సరస్సులు, నదులు
- మహాసముద్రాలు
- చెరువులు, కుంటలు
07) స్వ్విడ్ అనేది ఒక
- ఎడారులలో నివసించే జంతువు
- గడ్డిభూములలో నివసించే జంతువు
- సముద్రాలలో నివసించే జీవి
- గాలిలో ఎగిరే తరహా ఉడుత
08) డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి జీవులు
- మొప్పలలోకి నీటిని తీసుకుని, అందునుండి ఆక్సిజన్ ను స్వీకరిస్తాయి
- తల పైభాగంలో ఉండే నాశికా రంధ్రాల నుండి ఆక్సిజన్ ను స్వీకరిస్తాయి
- షార్క్ పిన్ టైల్ నుండి నాశికా రంధ్రాల ద్వారా ఆక్సిజన్ ను స్వీకరిస్తాయి
- చర్మం ద్వారా విసరణ ప్రక్రియలో ఆక్సిజన్ ను స్వీకరిస్తాయి
09) పర్వత ప్రాంతాలలో నివసించే జంతువులలో కనిపించే అనుకూలనాలు
ఎ) చలి నుంచి తమను తాము కాపాడుకొవడానికి దళసరి చర్మం కలిగి ఉంటాయి.
బి) రాతివాలుపై పరుగెత్తడానికి అనువుగా బలమైన గిట్టలను కలిగి ఉంటాయి.
సి) మాంసాన్ని చీల్చడానికి బలమైన గోళ్లను కలిగి ఉంటాయి.
సరియైన సమాధానం గుర్తించండి
- ఎ, బి మాత్రమే సరియైనవి, సి సరికానిది
- బి, సి మాత్రమే సరియైనవి, ఎ సరికానిది
- ఎ, సి మాత్రమే సరియైనవి, బి సరికానిది
- ఎ, బి మరియు సి మూడూ సరియైనవే
10) క్రింది వానిలో ఏది మొగ్గతో కూడిన భాగం కొత్త మొక్కగా మారుతుంది?
- గులాబి
- బంగాళదుంప
- వేరుశెనగ
- గోరుచిక్కుడు
సమాధానాలు : 1-4: 2-3: 3-4: 4-1: 5-4: 6-1; 7-3: 8-2: 9-1: 10-2
Read also…