DSC 6th Class Science SORTING MATERIALS INTO GROUPS Bits
6వ తరగతి సామాన్య శాస్త్రం “పదార్ధాలను సమూహాలుగా వర్గీకరించుట” ప్రాక్టీస్ బిట్స్
మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఒకేలా ఉండవు. వాటిలో కొన్ని గుణాల్లో ఒకేలా ఉంటాయి, మరికొన్ని వేరుగా ఉంటాయి. ఈ పాఠంలో, మనం వస్తువులను వాటి గుణాల ఆధారంగా వర్గీకరించడం నేర్చుకుంటాము. వస్తువులను వర్గీకరించడం వల్ల వాటి గుణాలను మరింత బాగా అర్థం చేసుకోవడం సులభమవుతుంది. (DSC 6th Class Science SORTING MATERIALS INTO GROUPS Practice Bits)
01) సాధారణంగా వస్తువులను వాటి వాటి ఆకారాలను బట్టి మనం గుర్తిస్తుంటాము. ఆకారాల పరంగా గమనించినపుడు క్రింది వానిలో భిన్నమైనది ఏది?
- రబ్బరు బంతి
- ఫుట్ బాల్
- గాజు గోళీ
- ఎరేజర్
02) జీవా అనే ఉపాధ్యాయుడు లోహపు తాళం చెవి, అల్యూమినియం తీగ, రాయి, మేకు, కొవ్వొత్తి మరియు సుద్దముక్క వంటి పదార్ధాలను తరగతి గదికి తీసుకుని వచ్చారు. బహుశా వీటిని ఉపయోగించి తాను
- ద్యుతిగుణమును ప్రదర్శించవచ్చు
- గట్టిదనమును ప్రదర్శించవచ్చు
- తాంతవతను ప్రదర్శించవచ్చు
- స్తరణీయతను ప్రదర్శించవచ్చు
03) మన చుట్టూ ఉన్న కొన్ని వస్తువులు ఒకటి కంటే ఎక్కువ పదార్దాలతో తయారై ఉంటాయి. ఈ రీతిన ఒకటి కంటే ఎక్కువ పదార్ధాలతో తయారైన వస్తువు కానిది గుర్తించి, దాన్ని సమాధానంగా ఎంచుకోండి
- మట్టి కుండ
- ఎద్దుల బండి
- చెక్క కుర్చీ
- మోటారు వాహనం
04) మిర్చిబజ్జీలను కాగితంలో చుట్టి తెచ్చినపుడు, కాగితం తడిగా, పారదర్శకంగా మారడానికి కారణం
- బజ్జీలను తయారుచేయడానికి ఉపయోగించిన నూనె
- బజ్జీలను తయారుచేయడానికి ఉపయోగించిన శనగపిండి
- బజ్జీలలో అధిక మోతాదులో ఉండే నీరు
- బజ్జీలలో అధిక మోతాదులో ఉండే కారం
05) క్రింది వానిలో చెక్కతో తయారైన వస్తువులలో భాగం కానిది
- వార్తాపత్రికలు, నోటు పుస్తకాలు
- కుర్చీ, బల్ల
- నాగలి, ఎద్దుల బండి
- ఎద్దుల బండి చక్రాలు
06) కొన్ని లోహాలు తమ ద్యుతిని కోల్పోయి కాంతి హీనంగా కనిపించడానికి కారణం
- ఆయా లోహాలు కాంతితో చర్చ జరపడం
- ఆయా లోహాలు గాలి, తేమతో చర్చ జరపడం
- ఆయా లోహాలు నైట్రోజన్ తో చర్చ జరపడం
- ఆయా లోహాలు అలోహాలతో చర్య జరపడం
07) అరచేతిపై టార్చిలైటు వెలుగుతో అరచేతిని ఏ రకమైన పదార్ధమో పహేలి గుర్తించాలనుకుంటున్నది. ఆమెకు మీరు సరియైన సమాధానం గుర్తించి సహకరించండి
- అరచేయి అపారదర్శకమైన పదార్దము
- అరచేయి పారదర్శకమైన పదార్ధము
- అరచేయి పాక్షిక పారదర్శకమైన పదార్ధము
- అరచేయి మానవ శరీరంలో భాగం కనుక నిర్ణయించలేము.
08) సాధారణంగా షాపులలో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడానికి కారణము
- అవి గాలితో చర్య జరిపి పాడైపోతాయి కనుక రక్షణ కోసం అలా ఉంచుతారు
- అవి ప్రదర్శించి, వ్యాపారాన్ని పెంచుకోవాలి కనుక వాటిని అలా ఉంచుతారు
- అవి పురుగులు, చీమలకు కూడా ఆహారంగా ఉంటాయి కనుక వాటిని అలా ఉంచుతారు
- వాటికి మొత్తబడే లక్షణం ఉంటుంది కనుక దాన్ని నివారించడం కోసం గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచుతారు
09) మిఠాయి దుకాణాలలో సాధారణంగా మిఠాయిలను గాజు అరలలో అమర్చి ఉంచడానికి కారణం
- గాజు పారదర్శకం కావడం
- గాజు ద్యుతి గుణమును ప్రదర్శించడం
- గాజు వాతావరణానికి స్పందించకపోవడం
- గాజు శుభ్రమైన పరిసరాలను ఏర్పరచడం
10) క్రింది వాటిలో సరికానిది.
- కొన్ని పదార్థాలు నీటిపై తేలును.
- కొన్ని పదార్థాలు నూనెపై తేలును.
- కొన్ని పదార్థాలు కిరోసిన్ పై తేలును
- సాధారణంగా పదార్థాలన్నీ ద్రవాల ఉపరితలంపై తేలును.
సమాధానాలు : 1-4: 2-2: 3-1: 4-1: 5-1: 6-2; 7-3: 8-2: 9-1: 10-4
Read also…