DSC 6th Class Science SEPARATION OF SUBSTANCES Practice Bits
6వ తరగతి సామాన్య శాస్త్రం “పదార్ధాలను వేరు చేయుట” ప్రాక్టీస్ బిట్స్
మన చుట్టూ ఉన్న వస్తువులు వివిధ పదార్థాలతో తయారవుతాయి. ఈ పదార్థాలను వేరు చేయడం అనేది శాస్త్రీయ ప్రక్రియ. ఈ పాఠంలో, మనం వివిధ పదార్థాలను వేరు చేసే విధానాలను నేర్చుకుంటాము. దీనిలో రాలిపోవడం, తేలడం, ఫిల్టరేషన్, మరియు ఎవాపరేషన్ వంటి ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలను అర్థం చేసుకోవడం వల్ల మనం రోజువారి జీవితంలో వాటిని ఉపయోగించుకోవచ్చు. (DSC 6th Class Science SEPARATION OF SUBSTANCES Practice Bits)
01) తూర్పారబట్టడం అనే విధానంలో ఈ రకమైన శక్తి సహకరిస్తుంది
- గాలి యొక్క శక్తి
- నీటి యొక్క శక్తి
- తన్యతా బలము
- అభిలంబ బలము
02) గృహ నిర్మాణ సమయంలో ఇసుక నుండి చిన్న చిన్న గులకరాళ్లను వేరుచేయడానికి అనుసరించే పద్ధతి
- అవక్షేపణం
- వడపోత
- జల్లెడ పట్టడం
- భాష్పీభవనం
03) గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటివి వేరు చేయడానికి అనువైన పద్ధతి
- తూర్పారబోయడం
- వడకట్టడం
- చేతితో ఏరివేయుట
- జల్లెడ పట్టుట
04) ఇసుక నుండి ఉప్పును వేరు చేయడానికి ఏరివేత అనే పద్దతి సరియైనది అని భవాని తెలియచేసింది – దీనిపై మీ వ్యాఖ్యానం
- ఆ పద్ధతికి బదులుగా జల్లించుట పద్ధతి మేలైనది
- ఏరివేత పద్ధతి ద్వారా ఇసుకను ఉప్పు నుండి వేరు చేయవచ్చు
- సిబ్బి గంటె ఉపయోగించి ఈ మిశ్రమాన్ని వేరు చేయవచ్చు
- పైన తెలిపిన ఏ పద్ధతిలోనూ వేరు చేయలేము.
05) ఉప్పు, ఇసుక, నీటిని వేరు చేయడానికి అనుసరించే పద్ధతులలో ఇది భాగం కాదు
- తేర్చుట
- వడపోత
- జల్లించుట
- బాష్పీభవనం
06) గాలిదిశ అనేది ఈ రకమైన వేరు చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది?
- ఎగరబోయడం
- నూర్పిడి చేయడం
- జల్లెడ పట్టడం
- అవక్షేపణం చేయడం
07) జిన్నింగ్ అనే ప్రక్రియతో సంబంధాన్ని కలిగియున్న పరిశ్రమను క్రింది వానిలో గుర్తించండి
- కాగితపు పరిశ్రమ
- పాల పరిశ్రమ
- వస్త్ర పరిశ్రమ
- ధాన్యం పరిశ్రమ
08) ఒక పదార్ధాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుంది. అయితే కరిగించాల్సినంత పదార్ధాన్ని కరిగించగలిగితే ఆ ద్రావణమును
- అసంతృప్త ద్రావణం అంటారు
- సంతృప్త ద్రావణం అంటారు
- నిద్రావస్థ ద్రావణం అంటారు
- అతి సంతృప్త ద్రావణం అంటారు
09) బురద నీటిని ఇచ్చినపుడు ఒక రాత్రంతా సమయం ఇచ్చినట్లయితే ఈ నీటి నుంచి నేను బురదను వేరు చేయగలనని ప్రకటించింది భారతి. బహుశా తాను ఎంచుకోవాలనుకున్న ప్రక్రియ
- వడపోత
- భాష్పీభవనం
- తేర్చడం
- కాచి, చల్లార్చడం
10) నీరు కలిపినపుడు మిశ్రమంలోని బరువైన అంశం, తేలికైన అంశం వేరుపడటం ఈ ప్రక్రియలో మనం గమనిస్తాము
- సాంద్రీకరణం
- అవక్షేపణం
- వడపోత
- బాష్పీభవనం
సమాధానాలు : 1-1: 2-3: 3-3: 4-4: 5-3: 6-1; 7-3: 8-2: 9-3: 10-2
Read also…