WhatsApp Channel Join Now
Telegram Group Join Now

DSC 6th Class Science MOTION AND MEASUREMENT OF DISTANCES Bits

DSC 6th Class Science MOTION AND MEASUREMENT OF DISTANCES Bits

6వ తరగతి సామాన్య శాస్త్రం “చలనం మరియు దూరాల కొలతలు” ప్రాక్టీస్ బిట్స్

మన చుట్టూ ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ కదలికలో ఉంటాయి. కొన్ని వస్తువులు నెమ్మదిగా కదులుతాయి, మరికొన్ని వేగంగా కదులుతాయి. ఈ పాఠంలో, మనం కదలిక అంటే ఏమిటి, దాని రకాలు ఏమిటి, మరియు దూరాలను కొలవడం ఎలాగో నేర్చుకుంటాము. దూరాలను కొలవడానికి మనం వివిధ యూనిట్లను ఉపయోగిస్తాము, వాటిలో మీటర్, సెంటీమీటర్, మరియు కిలోమీటర్లు ఉన్నాయి. (DSC 6th Class Science MOTION AND MEASUREMENT OF DISTANCES Bits)

01) ప్రతి మీటరు వంద సమ విభాగాలుగా విభజించబడుతుంది. ప్రతి చిన్న విభాగాన్ని మిల్లీమీటరు అని పిలుస్తాము అంటూ కార్తికేయ తెలిపాడు – అయితే మీటరులోని వందవ వంతు విభాగాన్ని ఇలా పిలుస్తారు

  1. మిల్లీమీటరు
  2. సెంటీమీటరు
  3. కిలోమీటరు
  4. లాక్టోమీటరు

02) మెట్రిక్ వ్యవస్థతో సంబంధం కలిగిన సంవత్సరం మరియు దేశం

  1. 1790, ఫ్రాన్స్
  2. 1790, ఇంగ్లాండ్
  3. 1750, ఫ్రాన్స్
  4. 1750, ఇంగ్లాండ్

03) మొదట్లో పడవలను

  1. చెట్ల దుంగలతో తయారుచేసేవారు
  2. ప్లాస్టిక్ వస్తువులతో తయారుచేసేవారు
  3. నీటిలో తేలే రాళ్లతో తయారుచేసేవారు
  4. మరయంత్రాలతో నడిపేవారు

04) తరగతి గదిలోని విద్యార్ధుల యొక్క పాదం పొడవు, వెడల్పు గుర్తించమని ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రాజెక్టు పనిని నిర్వహించే సందర్భంలో అగుపడు కొలత

  1. సెంటీ మీటర్లు
  2. పౌండ్లు
  3. సెకండ్లు
  4. కిలోగ్రాములు

05) ఈ గది పొడవు ఎంత ఉంటుంది? – ఈ బల్ల వెడల్పు ఎంత? – ఢిల్లీ నుండి లక్నోకు ఎంత దూరం? – ఈ సందర్బాలలో సమాధానం కోసం కొలవాల్సింది

  1. సమయం
  2. ద్రవ్యరాశి
  3. పొడవు
  4. ఘనపరిమాణం

06) పూర్వకాలంలో ప్రజలకు ఎటువంటి ప్రయాణ సాధనాలు లేకపోవడం మూలంగా

  1. వారు ప్రయాణాలను వాయిదా వేసుకునేవారు
  2. వారు ప్రయాణాలు చేయడం మానేసేవారు
  3. వారు కాలి నడకన ప్రయాణాలు చేసేవారు
  4. వారు వాహనాలను కనిపెట్టడానికి ప్రయత్నించారు

07) ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయి నుంచి వేలి కొనల వరకూ గల పొడవును ఒక మూరగా భావించేవారు. అయితే ఇది

  1. ఈజిప్టు ప్రాంతానికి మాత్రమే పరిమితం అయినది
  2. ఈజిప్టు, పొరుగు దేశాలకు మాత్రమే పరిమితం అయినది
  3. ఐరోపా ఖండం అంతటా అనుసరించబడినది
  4. ప్రపంచంలో చాలా ఇతర ప్రాంతాలలో కూడా అనుసరించబడినది

08) పెన్సిల్ వంటి చిన్న పొడవులను కొలవడానికి మనకు ఇది సరిపోతుంది

  1. 15 సెం.మీ. స్కేలు
  2. 30 సెం.మీ. స్కేలు
  3. 1 మీ. స్కేలు
  4. దర్జీ టేపు

09) చలన స్థితిని దృష్టిలో ఉంచుకుని క్రింది వానిలో భిన్నమైన జతను గుర్తించి, సమాధానంగా ఎంచుకోండి

  1. స్కూల్ బ్యాగ్, టేబుల్
  2. బంతి, దోమ
  3. ఇల్లు, కర్మాగారం
  4. గోడ గడియారం

10) క్రింది వానిలో ఏది నిశ్చలంగా ఉన్న వస్తువుల కోవకు చెందుతుంది?

  1. కదిలే రైలు
  2. నీటిలోని చేప
  3. గడియారం ముల్లు
  4. కుట్టు మిషన్

సమాధానాలు : 1-2: 2-1: 3-1: 4-1: 5-3: 6-3; 7-4: 8-1: 9-2: 10-4

Read also…

DSC 6th Class Science SEPARATION OF SUBSTANCES practice bits

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!