DSC 6TH CLASS SCIENCE COMPONETS OF FOOD BITS
DSC / TET ఆహారంలోని అంశాలు – ప్రాక్టీస్ బిట్స్
6వ తరగతి సైన్స్‌లోని “ఆహారంలోని అంశాలు” పాఠం విద్యార్థులకు ఆరోగ్యం, పెరుగుదల మరియు శక్తి కోసం అవసరమైన ముఖ్యమైన పోషకాలను పరిచయం చేస్తుంది. ఇందులో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అనే ఐదు ప్రధాన భాగాలను వివరిస్తుంది. ప్రతి పోషకం యొక్క పనితీరు, వాటి మూలాలు మరియు సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబడింది. అలాగే, మంచినీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ భాగాలు అన్ని కలిసి శరీరాన్ని ఆరోగ్యంగా మరియు సక్రమంగా ఉంచడానికి ఎలా పనిచేస్తాయో విద్యార్థులు ఈ పాఠం ద్వారా తెలుసుకుంటారు. (DSC 6TH CLASS SCIENCE COMPONETS OF FOOD BITS)
01) మన చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహకరించే విటమిన్ ఏది?
- విటమిన్ ఎ
- విటమిన్ సి
- విటమిన్ కె
- విటమిన్ డి
02) కొవ్వులు లభించే వనరులలో క్రింది వానిలో భిన్నమైనది (లభించే వనరు దృష్ట్యా) ఏది?
- వేరుశెనగ
- బాదం పప్పు
- నువ్వులు
- వెన్న, నెయ్యి
03) లభించే విటమిన్ల దృష్ట్యా క్రింది వానిలో ఏది భిన్నమైనది?
- పచ్చిమిర్చి
- నిమ్మ
- మామిడి
- టొమాటో
04) క్రింది వానిలో ఏది మన ఆహారంలో ఉండే పోషకాల వర్గానికి చెందదు?
- కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు
- మాంసకృత్తులు, కొవ్వు పదార్ధాలు
- ఎండినపండ్లు, కూరగాయలు
- పీచు పదార్దాలు, నీరు
05) మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడటంతో పాటు వ్యర్ధాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది అంటూ జానకి ఈ రకమైన పోషకాలను గురించి తెలియచేస్తున్నది
- పీచు పదార్ధాలు
- మాంసకృత్తులు
- కొవ్వు పదార్దాలు
- నీరు
06) శ్రీధర్ డాక్టర్ వద్దకు వెళ్లినపుడు తనకు మెడ వద్ద కొద్దిగా వాపు ఉన్నట్లుగా అనిపిస్తోందని తెలిపాడు – బహుశా అతను ఈ విటమిన్ లేదా ఖనిజ లవణ లోపంతో బాధపడుతూ ఉండి ఉండవచ్చు
- విటమిన్ ఎ
- విటమిన్ బి1
- కాల్షియం
- అయోడిన్
07) కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఇందులో లభిస్తాయి ?
- పప్పు దినుసులు
- తృణ ధాన్యాలు
- సముద్ర చేపలు
- మాంసం
08) FSSAI లోగో లో ఉన్న పదాలలో ఇది ఒకటి కాదు
- Jeevan
- Swasth
- Sampoorna
- Swach
09) ఉడికించే సమయంలో వేడి చేసే సమయంలో ఈ విటమిన్ నశిస్తుందని, కనుక కొన్ని పదార్ధాలను వండకుండానే తింటే మంచిదని గ్రీష్మ తరగతిలో ప్రకటించింది. బహుశా ఆమె ఈ విటమిన్ ను దృష్టిలో ఉంచుకుని ప్రకటన చేసి ఉండవచ్చు
- విటమిన్ ఎ
- విటమిన్ సి
- విటమిన్ కె
- విటమిన్ బి
10) 6వ తరగతిలోని ఆహారంలోని అంశాలు పాఠం విన్న తర్వాత, విద్యార్థి తన ఆహారంలో మార్పులను చేసుకున్నాడు. కావున విద్యార్థిలో నెరవేరిన ప్రమాణం?
- విషయవగాహన
- పరికల్పనలు చేయడం
- ప్రశంస
- నిజజీవిత వినియోగం
సమాధానాలు : 1-1: 2-4: 3-3: 4-3: 5-4: 6-4; 7-2: 8-4: 9-2: 10-4
Read also..