DSC 6th Class Science Body Movements practice bits

DSC 6th Class Science Body Movements practice bits

6వ తరగతి సామాన్య శాస్త్రం “శరీర కదలికలు” ప్రాక్టీస్ బిట్స్

6వ తరగతి “శరీర కదలికలు” అనే పాఠం ద్వారా విద్యార్ధులు మన శరీరంలోని వివిధ అవయవాల కదలికలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, కండరాలు, కీళ్ళు ఎలా పనిచేస్తాయో, వాటి ప్రాముఖ్యత ఏమిటో విద్యార్ధులు తెలుసుకుంటారు. మన శరీరంలోని వివిధ రకాల కదలికలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ వివరణలను కూడా అర్థం చేసుకుంటారు. ఈ పాఠం శరీర నిర్మాణం మరియు కదలికలపై అవగాహనను పెంచుతుంది. (DSC 6th Class Science Body Movements practice bits)

01) ఈ రకమైన కీలులో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది

  1. బొంగరపు కీళ్లు
  2. మడతబందు కీళ్లు
  3. కదలని కీళ్లు
  4. వంగే కీళ్లు

02) ఒక మందపాటి నిర్మాణం, కర్పరం నుండి బయటకు వస్తుంది. ఇది బలమైన కండరాలతో తయారుచేయబడుతుంది – ఈ వర్ణన ఏ జీవికి సంబంధించినది

  1. తాబేలు
  2. బొద్దింక
  3. పక్షి
  4. నత్త

03) సాధారణంగా మెడను తలతో కలిపే కీలు ఈ రకమైనది

  1. బొంగరపు కీళ్లు
  2. మడతబందు కీళ్లు
  3. కదలని కీళ్లు
  4. వంగే కీళ్లు

04) గైట్ ఆఫ్ యానిమల్స్ – గ్రంధం వీరిది

  1. రూసో
  2. ప్లాటో
  3. అరిస్టాటిల్
  4. డార్విన్

05) మానవ శరీరంలో ఛాతికి ఇరువైపులా

  1. తొమ్మిది పక్కటెముకలు కలవు
  2. పది పక్కటెముకలు కలవు
  3. పన్నెండు పక్కటెముకలు కలవు
  4. పద్నాలుగు పక్కటెముకలు కలవు

06) ఈ జీవి శరీరం అనేక వలయాలతో నిర్మించబడుతుంది

  1. వానపాము
  2. బొద్దింక
  3. నత్త
  4. చేప

07) క్రింది వాక్యాలను పరిశీలించండి

ఎ) తల యొక్క భాగం పూర్తిగా తిరిగే లక్షణాన్ని కలిగి ఉంటుంది.

బి) మోచేయి యొక్క భాగం పూర్తిగా తిరిగే లక్షణాన్ని కలిగి ఉంటుంది.

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ సరియైనది, బి సరికానిది
  2. ఎ సరియైనది, బి సరియైనది
  3. ఎ సరికానిది, బి సరికానిది
  4. ఎ సరికానిది, బి సరియైనది

08) పుట్టినపుడు అస్థిపంజరం సుమారుగా 305 ఎముకలతో నిర్మితం అవుతుంది అయితే ఎముకల సంఖ్య 206 కు తగ్గడానికి కారణం

  1. బాల్య దశలో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం
  2. శైశవ దశలో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం
  3. యుక్తవయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం
  4. వయోజనదశలో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం

09) మొక్కల చలనం గురించి బోజో అభిప్రాయం

ఎ) మొక్కలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాయి.

బి) మొక్కలు తమ శరీర భాగాలలో కదలికలను చూపిస్తాయి

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ సరియైనది, బి సరికానిది
  2. ఎ సరియైనది, బి సరియైనది
  3. ఎ సరికానిది, బి సరికానిది
  4. ఎ సరికానిది, బి సరియైనది

10) మానవ శరీరపు అస్థిపంజరంలో

ఎ) జన్మించినపుడు 306 ఎముకలు ఉంటాయి.

బి) యుక్తవయస్సుకు చేరుకునే నాటికి 205 ఎముకలు ఉంటాయి.

సరియైన సమాధానం గుర్తించండి

  1. ఎ సరియైనది, బి సరికానిది
  2. ఎ సరియైనది, బి సరియైనది
  3. ఎ సరికానిది, బి సరికానిది
  4. ఎ సరికానిది, బి సరియైనది

సమాధానాలు : 1-1: 2-4: 3-1: 4-3: 5-3: 6-1; 7-1: 8-3: 9-4: 10-3

Read also…

DSC 6th Class General science Getting to know plants Practice bits

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!