DSC 6th Class Science AIR AROUND US Practice Bits

DSC 6th Class Science AIR AROUND US Practice Bits

6వ తరగతి సామాన్య శాస్త్రం “మనచుట్టూ ఉన్న గాలి” ప్రాక్టీస్ బిట్స్

6వ తరగతి సైన్స్ “మనచుట్టూ ఉన్న గాలి” అనే పాఠం ద్వారా విద్యార్ధులు గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం అని, గాలిని మనం చూడలేము  కానీ మనం దాని ప్రభావాన్ని అనుభవించగలము అని తెలుసుకుంటారు. ఈ పాఠంలో, విద్యార్ధులు గాలి యొక్క ఉనికిని, దాని లక్షణాలను, మరియు మన జీవితాలలో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాము. (DSC 6th Class Science AIR AROUND US Practice Bits)

01) మూసి ఉన్న గదిలో ఏదైనా పదార్ధం మండుతుంటే మనకు ఊపిరి ఆడనట్లు అనిపించడానికి కారణం అయ్యే వాయువు

  1. ఆక్సిజన్ లేమి
  2. నైట్రోజన్ లేమి
  3. కార్బన్ డై ఆక్సైడ్
  4. సల్ఫర్ మోనాక్సైడ్

02) 18వ శతాబ్ధం వరకూ ప్రజలు

  1. గాలి కేవలం ఒక పదార్ధం అని భావించేవారు
  2. గాలి అనేక వాయువుల మిశ్రమం అని భావించేవారు
  3. వేగంగా కదిలే గాలికి శక్తి ఉన్నదని భావించేవారు
  4. పవనాలు, వర్షాలకు కారణం అని భావించేవారు

03) ధూళి కణాలను పరిశీలించాలనుకున్నపుడు అవసరం అయ్యేది

  1. సూర్యకాంతి
  2. గాజు బీకరు
  3. థెర్మోస్కోప్
  4. మాగ్నిఫయింగ్ లెన్స్

04) రెండు కొవ్వొత్తులు, ఒక గాజు గ్లాసును ఉపయోగించి ప్రదర్శించగలది

  1. గాలిలో నైట్రోజన్ ఉంటుంది
  2. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది
  3. గాలిలో నీటి ఆవిరి ఉంటుంది
  4. గాలిలో ఆక్సిజన్ ఉంటుంది

05) పారదర్శకంగా ఉండే కిటికీల అద్దాలను క్రమం తప్పకుండా తుడవక పోతే మబ్బుగా కనిపించడానికి కారణం గాలిలోని

  1. నీటి ఆవిరి
  2. ఆక్సిజన్ వాయువు
  3. నైట్రోజన్ వాయువు
  4. దుమ్ము ధూళి

06) ఆకుపచ్చని మొక్కలు తమ ఆహారం తయారీలో ఉపయోగించుకునే వాయువు, తిరిగి వాతావరణంలోకి విడుదల చేసే వాయువు వరుసగా

  1. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్
  2. ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్
  3. కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
  4. కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్

07) గాలిలో ఈ రెండు వాయువులు కలిసి 99% వరకూ ఉంటాయి

  1. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్
  2. ఆక్సిజన్, నైట్రోజన్
  3. నైట్రోజన్, సల్ఫర్ డై ఆక్సైడ్
  4. నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్

08) గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ వాయువు

  1. 3% వరకూ ఉంటుంది
  2. 2% వరకూ ఉంటుంది
  3. 1% వరకూ ఉంటుంది
  4. 1% కంటే చాలా తక్కువగా ఉంటుంది

09) మట్టిపై నీటిని పోసినపుడు నీరు స్థానభ్రంశం చెందించిన గాలి బుడగల రూపంలో కనిపిస్తుంది.

  1. ఈ గాలిని జలచరాలు స్వీకరిస్తాయి
  2. ఈ గాలిని భూమిపై నివసించే జీవులు స్వీకరిస్తాయి
  3. ఈ గాలిని బొరియలలో నివసించే జీవులు స్వీకరిస్తాయి
  4. ఈ గాలిని ఎగిరే పక్షులు, జీవులు స్వీకరిస్తాయి

10) గాలిమరలను ఉపయోగించి

     ఎ) బోరు బావి నుంచి నీటిని తోడటారు

     బి) పిండి మర పనిచేయించడానికి ఉపయోగిస్తారు

     సి) విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు

     డి) నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు

సరియైన సమాధానం గుర్తించండి,

  1. ఎ, బి, సి సరియైనవి, డి సరికానిది
  2. ఎ, బి, డి సరియైనవి, సి సరికానిది
  3. ఎ, సి, డి సరియైనవి, బి సరికానిది
  4. బి, సి, డి సరియైనవి, ఎ సరికానిది

సమాధానాలు : 1-3: 2-1: 3-1: 4-4: 5-4: 6-3; 7-2: 8-4: 9-3: 10-1

Read also…

DSC 6th Class Science THE LIVING ORGANISMS practice bits

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!