WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Chinnari Nestam May-2025 Telugu Children’s magazine

Chinnari Nestam May-2025 Telugu Children’s magazine

చిన్నారి నేస్తం మే-2025 సంచిక లోపలి పేజీల్లో…

మదర్స్ డే (కవర్ స్టొరీ), రవీంద్రనాథ్ ఠాగూర్, మామిడి (King of fruits), ప్రయాణ కథలు, విద్యుత్ లేని రోజు (వేసవి ఛాలెంజ్), అమ్మమ్మ గారి గ్రామం, తెలుగు పజిల్స్, కథలు, ఇంగ్లీష్ పజిల్స్, మాథ్స్ పజిల్స్, సైన్స్ పజిల్స్, మీకు ఇవి తెలుసా…, మనకు చెమట ఎందుకు పడుతుంది?, ప్రకృతిని ప్రేమించిన ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, సరదా ప్రయాణ వాస్తవాలు, నేను పెద్దయ్యాక, నేను ఏమి కావాలనుకుంటున్నాను?, యువ సాధకులు, హైడ్రేషన్ హీరోస్, బాల గేయం, కథ: ఐరన్ స్కేల్ (Chinnari Nestam May-2025 Telugu Children’s magazine)

సంపాదకుల మాట

ప్రియమైన చిన్నారులారా, ఈ మే మాసపు వేడిలో, మిమ్మల్ని ఓ చల్లని గాలి తాకినట్లు చిన్నారి నేస్తం ముచ్చటైన రచనలతో మమేకం చేయడానికి మీ ముందుకు వచ్చింది!

ఈ సంచిక మీలోని సృజనాత్మకతను, ఊహలను, జీవితాన్ని ప్రేమించే గుణాన్ని పెంపొందించాలని ఆశిస్తున్నాం. అమ్మ ప్రేమ పరిమళించే మదర్స్ డే కథలు, ఠాగూర్ గారి స్వప్నసౌధపు కవిత్వం, మామిడి తీపి రుచులు, ప్రకృతి మహిమలు… ఇవన్నీ మీ హృదయపు గీతికల్లో నవ్వుల సంచలనం కలిగిస్తాయి.

పిల్లలు, ప్రతీ రోజూ నేర్చుకునే ఒక కొత్త విషయం మీ భవిష్యత్తుకు బంగారు ఇటుకల వంటి బలమైన పునాది వేస్తుంది. ఈ మాసపత్రికలోని ప్రతి కథనం మీలో ఆ తపనను నింపాలని మా ఆశ.

చదువుకి పచ్చని వనమై,

చదువరికి మకరందమై,

మీరు మధురమైన జ్ఞానపుష్పాలను

సంపాదించాలన్నది మా ఆకాంక్ష!

మీరు కలలు కంటూ, స్వేచ్చగా ఎదగాలని… ప్రతి పేజీ మీ ఊహాజనిత లోకానికి కొత్త తలుపులు తెరవాలని ప్రేమతో…. మీ నేస్తం, వెలుగోటి నరేష్ ప్రధాన సంపాదకుడు చిన్నారి నేస్తం

విన్నపం: 

చిన్నారులారా…! మీ రచనలను 7382392390 వాట్స్ యాప్ నెంబర్ ద్వారా మాకు పంపవచ్చును. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపగలరు.

Chinnari Nestam May-2025 Children’s magazine pdf

DOWNLOAD

Read also…

MaaBadi April-2025 School Children’s Magazine

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!