Chinnari Nestam March-2026 Children’s e-Magazine
“చిన్నారి నేస్తం” మార్చి 2026 సంచిక లోపలి పేజీల్లో…
సంపాదకుల మాట
ప్రియమైన చిన్నారి నేస్తములకు,
వసంత ఋతువు సరికొత్త ఆరంభాలకు నాంది పలుకుతున్న ఈ మార్చి నెలలో, మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.
ఒక మార్చి నెల ముగింపు కాదు ఆత్మపరిశీలన. ఈ విద్యాసంవత్సరంలో మీరు నిజంగా ఎంత నేర్చుకున్నారు? మార్కులు ఎంత వచ్చాయన్నది కాదు. మీరు ఎంత మారారు అన్నదే ముఖ్యమైనది.
పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం, గణితం, భాషా నైపుణ్యాలు, క్విజ్లు, కథలు, చిత్రకథలు వంటి విభాగాల ద్వారా మీలో పరిశోధనాత్మక దృష్టిని పెంపొందించాలనే మా ప్రయత్నం. “తెలుసుకోవాలి” అనే ఆసక్తి మీలో ఉన్నంతకాలం మీ అభివృద్ధి ఆగదు. చిన్నారులారా,
ప్రశ్నించండి.చదవండి. ఆలోచించండి. సృష్టించండి. మీ ప్రతిభను వెలికితీయడం మా లక్ష్యం; దాన్ని వికసింపజేయడం మీ బాధ్యత.
మీ రచనలు, చిత్రాలు, ఆలోచనలు మాకు పంపుతూ ఉండండి. మీలోనే భవిష్యత్తు నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితలు, సేవాభావులు ఉన్నారు. ఆలోచించే చిన్నారి – రేపటి నాయకుడు.
– చిన్నారి నేస్తం సంపాదకులు
“చిన్నారి నేస్తం” మార్చి 2026 సంచిక (తెలుగు)
Read also…
“చిన్నారి నేస్తం” ఫిబ్రవరి 2026 సంచిక
“చిన్నారి నేస్తం” జనవరి 2026 సంచిక
Thank you for reading... Share this...
