APSRTC Apprenticeship Apply Now
Andhra Pradesh State Road Transport Corporation Apprenticeship Vacancies
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పత్రికా ప్రకటన
ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిన్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరచిన ట్రేడ్ల నందు I.T.I ఉత్తీర్ణులైన వారు 04.10.2025వ తేది లోగా ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకొన వలసినదిగా తెలియజేయడమైనది. 04.10.2025వ తేదీ తదుపరి తేదిలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకొనబడవు.
అభ్యర్ధులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.
1) ఖాళీల సంఖ్య: నూతనముగా ఏర్పడినటువంటి చిత్తూరు, తిరుపతి, SPSR నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో వున్న I.T.I ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
ట్రేడ్స్ మరియు జిల్లాల వారి ఖాళీల వివరములు:-
| ట్రేడ్స్/ జిల్లా | డీజల్ మెకానిక్ | మోటార్ మెకానిక్ | ఎలక్ట్రిషియన్ | వెల్డర్ | పేయింటర్ | మెషనిస్ట్ | పిట్టర్ | డ్రాఫ్ట్ మెన్ సివిల్ | మొత్తము |
| చిత్తూరు | 33 | 2 | 8 | 1 | 1 | 0 | 3 | 0 | 48 |
| తిరుపతి | 60 | 4 | 15 | 2 | 1 | 0 | 5 | 1 | 88 |
| నెల్లూరు | 62 | 3 | 14 | 2 | 1 | 1 | 7 | 1 | 91 |
| ప్రకాశం | 37 | 2 | 9 | 1 | 1 | 0 | 3 | 1 | 54 |
2) నమోదు చేయు విధానము– I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు ‘login” అయ్యి వారు అప్రెంటిన్షిప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది.
| S.No. | District | Name of the Establishment |
| 1. | Chittoor | APSRTC CHITTOOR DISTRICT |
| 2. | Tirupathi | APSRTC TIRUPATHI DISTRICT |
| 3. | SPSR Nellore | APSRTC SPSR NELLORE DISTRICT |
| 4. | Prakasam | APSRTC PRAKASAM DISTRICT |
3) రుసుము – ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి., కాకుటూరు, నెల్లూరు నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ: 100/- రుసుము మరియు GST రూ 18/- చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేది దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.
4) సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు- ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 06.10.2025 తేదీలోగా చేరునట్లు పంపవలసినది గా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి చేసిన “RESUME” తో పాటుగా పంపవలెను. “RESUME” కాపీ ని ఇందువెంట జతచేయడమైనది.
A) పంపవలసిన Certificates నకళ్ళు:-
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యెక్క ప్రొఫైల్
- www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Apprenticeship Registraton Number (ARN).
- అభ్యర్థి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు గా రుజువు
- S.S.C Marks list.
- I.T.I. Marks (Consolidated Marks Memo)
- NCVT Certificate
- కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలికకుల ధృవీకరణ పత్రము)
- వికలాంగులైనచో ధృవీకరణ పత్రము
- మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము
- NCC మరియు Sports ఉన్నచో సంబందిత దృవీకరణ పత్రము లు మరియు
- ఆధార్ కార్డు,
B) Certificates నకళ్ళు పంపవలసిన చిరునామా:-
Principal,
Zonal Staff Training College,
Kakutur, Venkachalam Mandal
SPSR Nellore District. PIN: 524320
C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి “RESUME” నమూనా జతచేయడమైనది. అభ్యర్ధులు Resume నకలును print తీసుకొని, అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు ‘Resume” జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.
D)ఇంటర్వ్యూ కు హాజరైనపుడు అభ్యర్ధులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.
ముఖ్య గమనిక
- ఆన్ లైన్ నందు 17.09.2025 వ తేది నుండి 04.10.2025 వ తేది లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తు లు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.
- ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు ను తప్పనిసరిగా నమెదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.
- పోర్టల్ నందు అప్రెంటిన్షిప్ కొరకు అప్లై చేయునపుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ ITI కాలేజి నందు సంప్రదించవచ్చును.
- ఏదైనా సందేహము వున్న ఎడల Phone No. 9154291408 కు ఆఫీసు సమయములో మాత్రమే అనగా ఉ: 10.30 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
- ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చు.
- APSRTC website www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు. RESUME ప్రతిని APSRTC website www.apsrtc.ap.gov.in నుండి డౌన్లోడు చేసుకొనవచ్చును.
