APOSS Open Schools SSC Public Exams March-2025 Halltickets download
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి, గుంటూరు.
ఎస్.ఎస్.సి (APOSS) పబ్లిక్ పరీక్షలు, మార్చి 2025.
పత్రికా ప్రకటన, తేది: 08-03-2025
ది.17.03.2025 తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించు, ఎస్.ఎస్.సి (APOSS) పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025, సంబంధించిన, అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ (AI CENTERS) నుండి పొందవచ్చును. (APOSS Open Schools SSC Public Exams March-2025 Halltickets)
వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్:
పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన హాల్ టికెట్లు ది.09.03.2025 ఆదివారం నుండి వాట్సాప్ – మన మిత్ర ద్వారా విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును.
వాట్సాప్ మన మిత్ర లో ఇలా డౌన్లోడ్ చేసుకొనే విధానము:
- అభ్యర్ధులు వారి WhatsApp ద్వారా 9552300009 కి “Hi” అనే సందేశాన్ని పంపాలి. “Choose Service” లేదా “సేవను ఎంచుకోండి” పై క్లిక్ చేయాలి.
- తర్వాత “Education Services” లేదా “విద్యా సేవలు”ని ఎంచుకోండి. ” A.P. Open School SSC Public Examinations, March-2025 Hall Tickets” ఎంచుకోండి.
- తర్వాత విద్యార్థి “Admission Number” మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, మీ హాల్ టికెట్ను స్వీకరించడానికి “Confirm” పై క్లిక్ చేయండి.
- డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్ నందలి వివరాలు సరి చూసుకోవాలి.
మరియు, హాల్ టికెట్లను, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి అధికారిక వెబ్సైట్ https://www.apopenschool.ap.gov.in నందు కూడా పొందుపరచబడినవి అధ్యాపకులు నేరుగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోనవచ్చును.
AP Open schools 10th Class Hall Tickets direct download link
Press Note on APOSS Open Schools SSC Public Exams March-2025 Hall Tickets
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025
టైమ్ టేబుల్
సమయము : ఉదయం 09.30 గం. నుండి మధ్యాహ్నం 12.30 గం. వరకు (APOSS SSC Inter Public Examinations March-2025 Time table)
| రోజు సంఖ్య | వారం & తేది | పదవ తరగతి |
| రోజు-1 | సోమవారం 17-03-2025 | 201-హిందీ |
| రోజు-2 | బుధవారం 19-03-2025 | 202 -ఇంగ్షీషు
|
| రోజు-3 | శుక్రవారం 21-03-2025 | 205-తెలుగు , 206-ఉర్దూ , 208-కన్నడ , 233-ఒరియా, 237-తమిళం |
| రోజు-4 | సోమవారం 24 -03-2025 | 211-గణితము, 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వం |
| రోజు-5 | బుధవారం 26-03-2025 | 212-శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం, 216-గృహవిజ్ఞాన శాస్త్రము |
| రోజు-6 | శనివారం 28-03-2025 | 213-సాంఘీక శాస్త్రం, 214- ఆర్ధిక శాస్త్రం
|
Note: This timetable is subject to the outcome of W.P. No.1509/2025 in the Hon’ble High court of Andhra Pradesh.
APOSS SSC/ 10th Class Public Examinations March-2025 Time table pdf DOWNLOAD
Thank you for reading... Share this...
