Govt Employees Earned Leaves in Summer

AP TS Govt Employees Earned Leaves (EL’s) in Summer – details

వేసవిలో సంపాదిత సెలవులు – వివరాలు

సంపాదిత సెలవు (Earned Leave) : APLR – 8 & 17

  • ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఆర్జించే సెలవును సంపాదిత సెలవు (E.L.) అంటారు. (Govt Employees Earned Leaves in Summer)
  • ఉద్యోగి డ్యూటీ కాలమును బట్టి సంపాదిత సెలవు జమచేయబడుతుంది.
  • నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లోని పర్మనెంట్ ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతు సంపాదిత సెలవు లభిస్తుంది.
  • సంవత్సరానికి 30 రోజుల చొప్పున జమచేయబడుతుంది.
  • గరిష్టంగా 300 రోజులు మాత్రమే నిల్వ వుంచుకోవచ్చు (G.O.Ms.No.232, Fin.dt.16-9-05)
  • టెంపరరీ ఉద్యోగికి డ్యూటీ కాలంలో 22వ వంతు మాత్రమే సంపాదిత సెలవు జమచేయబడుతుంది.
  • గరిష్టంగా 30 రోజులు మాత్రమే నిల్వవుంచుకోవీలౌతుంది.

వెకేషన్ డిపార్ట్మెంట్ :

  • 15 రోజులకు మించిన విరామంకల ఉద్యోగులను ఎఫ్.ఆర్.(89) ప్రకారం వెకేషన్ డిపార్ట్ మెంట్ గా పరిగణిస్తారు.
  • ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది వెకేషన్ డిపార్ట్మెంట్ పరిగణింపబడుతారు.
  • ఉపాధ్యాయులకు (వెకేషన్ డిపార్ట్ మెంట్ వారికి) తేది.31-10-89 వరకు సంవత్సరానికి 3 రోజులు, తేది.01-11-89 నుండి తేది.15-9-94 వరకు సంవత్సరానికి 5 రోజులు , 15-9-94 (1-1-95) నుండి సంవత్సరానికి 6 రోజులు జమచేయబడుతున్నాయి.
  • ప్రస్తుతం EL ను ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న 3 రోజులు చొప్పున అడ్వాన్సుగా జమచేస్తారు.  Go.Ms.No. 317, Edn. Dt. 15-9-1994
  • సంపాదిత సెలవు లెక్కింపుకు సూత్రం:- డ్యూటీ కాలము × 1/11 – 27 = డి.పి.×0.0169.
  • తాత్కాలిక ఉపాధ్యాయులకు (రెగ్యులరైజేషన్ కాని వారికి) జనవరి1న, జూలై 1న 2 రోజుల చొప్పున జమచేస్తారు.
  • వేసవి సెలవులలో పనిచేసిన కాలానికి F.R.82(b) మరియు G.O.Ms.No.35, dt.16-1-1981 జి.ఓ. ఎంఎస్.నం. 151, తేది. 14.11.2000 మరియు జి.ఓ.ఎంఎస్.నం. 114, తేది. 28.04.2005ల ప్రకారం దామాషా సంపాదిత సెలవు ప్రిజర్వ్ చేయబడుతుంది.
  • వేసవిలో పనిచేసిన కాలానికి దామాషా సంపాదిత సెలవు లెక్కింపు సూత్రము:- [(డ్యూటీ కాలము × 1/11) – (27 × వాడుకొన్నవేసవి సెలవులు/మొత్తం వేసవి సెలవులు) ]-6
  • వాడుకున్న వేసవి సెలవులు 15 రోజులకంటే తక్కువ ఉంటే మొత్తం వేసవి సెలవులు వినియోగించుకోలేదన్నట్లుగా భావించి 24 రోజుల సంపాదిత సెలవు జమ చేయబడుతుంది.
  • సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు. (GO.153 Fin, dt.04.05.2010.)
  • సంపాదిత సెలవును అర్ధజీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకే సారి 180 రోజులకు మించి వాడుకోకూడదు.
  • తాత్కాలిక ఉద్యోగి ఒకే సారి 30 రోజులకు మించి వాడుకోకూడదు.

ప్రత్యేక సందర్భాలు

  • ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చి ఎన్ని రోజులు ఉపాధ్యాయులు వేసవి సెలవులు వాడుకోకుండా ఉన్నారో అన్ని రోజులకు సంపాదిత సెలవులు నిలువ చేయాలని ఉత్తర్వులు ఇస్తే, ఆ సందర్భాలలో ఏ సూత్రంతో పనిలేకుండా ఎన్ని రోజులు డ్యూటీ చేస్తే అన్ని రోజులకు క్రెడిట్ చేసుకోవాలి. (2004 ఎన్నికల సందర్భంగా జి.ఓ.నెం. 435, తేదీ: 27-12-04 ద్వారా ఎన్నికల శిక్షణ, పోలింగు ఎన్ని రోజులు విధుల్లో పాల్గొన్నారో అన్ని రోజులకు సంపాదిత సెలవులు క్రెడిట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు).

Recost of E.L.:

  • ఉద్యోగి సర్వీసు రెగ్యులరైజేషన్ వెనుకటి తేదీ నుండి జరిగినప్పుడు ఆ తేదీ నుండి సంపాదిత సెలవు తిరిగి లెక్కించి వ్యత్యాసాన్ని జమచేస్తారు.
  • ఈ సెలవును రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడిన తేదీ తర్వాత మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. (G.O.Ms.No.250, ఆర్థికశాఖ, తేది. 13-12-1967).

పనిచేసిన రోజులకి సంపాదిత సెలవులు టేబుల్

పనిచేసిన రోజులుసంపాదిత సెలవులుపనిచేసిన రోజులుసంపాదిత సెలవులు
1,212514
3,4226,2715
5,6328,2916
7430,3117
8,9532,3318
10,11634,3519
12,1373620
14,15837,3821
16939,4022
17,181041,4223
19,201143,44,4524
21,221246,47,48,4924
23,2413


Read also..

Service Register (SR) Maintenance Rules

CLICK HERE 

Sharing is caring!

error: Content is protected !!