WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Telugu Teacher Handbooks/ Lesson Plan Books

AP Telugu Teacher Handbooks/ Lesson Plan Books

గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ, భారతదేశ విద్యావ్యవస్థలో సంభవిస్తున్న మార్పులు, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా రూపొందించుకున్న జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020), జాతీయ విద్యా చట్రం 2023 (NCF 2023) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళికా చట్రం (SCF-AP) ఆధారంగా రూపొందించిన ఈ ఉపాధ్యాయ కరదీపికను మీ ముందుకు తీసుకురావడం ఆనందదాయకం. (AP Telugu Teacher Handbooks/ Lesson Plan Books)

ఈ కరదీపిక తరగతి గది బోధనను మరింత సమర్థవంతంగా, విద్యార్థి కేంద్రితంగా, అనుభవాత్మకంగా మార్చే దిశగా ఉపాధ్యాయులకు ఓ మార్గదర్శినిగా నిలవనుంది. ఉపాధ్యాయుల సంసిద్ధత, సృజనాత్మకత, విద్యార్థుల అవసరాల పట్ల చైతన్యం, విద్యార్థుల భవిష్యత్తును నిర్మించగల శక్తివంతమైన ఆయుధాలు. అందుకే, ఈ కరదీపికలో పాఠ్యాంశాల వివరణ, బోధనా విధానాలు, 7 మదింపు విధానాలు, ప్రత్యేక అవసరాల గల పిల్లలకు మద్దతు, పాఠ్య ప్రణాళిక మద్దతు తదితర అంశాలను సమగ్రంగా పొందుపరిచాము. NEP 2020 లో ప్రతిపాదించిన హేతుబద్ధమైన ఆలోచన, ఆరోగ్య శ్రేయస్సు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, ఆర్ధిక మరియు సామాజిక విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది. అందుకే ఈ కరదీపికలో పాటలు, కథలు, అనుకరణలు, ఆటలు, TLMలు, డిజిటల్ వనరులు వంటివి తరగతి గది బోధనలో జోడించేందుకు ప్రత్యేక సూచనలు చేయబడ్డాయి.

ఉపాధ్యాయులు ప్రతి పాఠాన్ని విద్యార్థుల దైనందిన జీవితం, స్థానిక వనరులు, వారి భవిష్యత్తు అవసరాలతో అనుసంధానం చేసి, విద్యార్ధి కేంద్రీకృత మరియు కృత్యాధార ఆధారిత అభ్యాసన పద్ధతులతో బోధించాలి. అలాగే DIKSHA, SCERT, NCERT డిజిటల్ వనరులను వినియోగించుకోవాలి. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపులు వంటివి సముచితంగా నిర్వహించి, విద్యార్థుల అభివృద్ధిని తరచూ గమనించాలి. ఈ కరదీపిక ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిగా అధ్యయనం చేసి, వార్షిక సిలబస్, అభ్యాస ఫలితాలను పూర్తిగా అవగాహన చేసుకుని, తగిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ సిద్ధం చేసుకోవాలి. ప్రతి తరగతిలో విద్యార్థులు పూర్వ జ్ఞానాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా సృజనాత్మకంగా, విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో బోధించాలి.

తల్లిదండ్రులు, సమాజం, శిక్షణాధికారులతో సమన్వయం, పాఠశాల అభివృద్ధిలో చురుకైన పాత్ర, నూతన బోధనా వ్యూహాల వినియోగం, ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సవరణాత్మక బోధన కార్యక్రమాలు వంటి అంశాలను కూడా ఉపాధ్యాయులు కొనసాగించాలి. -సమగ్రంగా, విద్యార్థుల్లో హేతుబద్ద ఆలోచన, స్వయంప్రతిపత్తి, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ ఉపాధ్యాయ కరదీపిక ఉపకరించనుంది. ప్రతి ఉపాధ్యాయుడు దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సృజనాత్మకతతో బోధన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

-రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (SCERT), ఆంధ్రప్రదేశ్

AP Telugu Teacher Handbooks/ Lesson Plan Books

TITLELINK
10th Class Telugu Teacher HandbookDOWNLOAD
9th Class Telugu Teacher HandbookDOWNLOAD
8th Class Telugu Teacher HandbookDOWNLOAD
7th Class Telugu Teacher HandbookDOWNLOAD
6th Class Telugu Teacher HandbookDOWNLOAD

Read also..

English Teacher Hand books/ Lesson Plans Books

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!