AP Sports Mega DSC-2025 Notification
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – క్రీడా ప్రాధికార సంస్థ
మెగా క్రీడా డీఎస్సీ – 2025
3% క్రీడా కోటా నోటిఫికేషన్
పత్రిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా పాలసీ 2024-2029 ద్వారా క్రీడలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా 3% హారిజంటల్ రిజర్వేషన్ అమలుచేయలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు 421 ఉద్యోగాలను క్రీడా కోటా కింద, క్రీడా రంగంలో ప్రతిభ కనపరిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు కేటాయించడం జరిగింది.
కావున, స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ అభ్యర్ధులు, 2025, మే 2 వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోటా కింద దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులకు పరీక్షలు లేకుండా క్రీడా రంగంలో వారి యొక్క ప్రతిభను బట్టి వారికి మెరిట్ (ప్రాధాన్యత) ఇవ్వబడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, రాష్ట్ర, జోన్ మరియు జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, షెడ్యూలు, నోటిఫికేషన్ మరియు హెల్ప్ డెస్క్ వివరాలు 02.05.2025 ఉదయం 10.00 గంటల నుండి క్రీడా శాఖ వెబ్ సైట్ https://sportsdsc.apcfss.in & https://sports.ap.gov.in లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
SCHEDULE FOR AP SPORTS MEGA DSC -2025
S.No. | SUBJECT/ EVENT | TIME LINE |
1. | Date of Issuing of Notification Sports Mega DSC-2025 | 02.05.2025 |
2. | Payment of Fees through Payment Gateway for Sports Mega DSC-2025& Online submission of application through (https://sports.ap.gov.in) & (https://sportsdsc.apcfss.in) for Sports Mega DSC -2025 | 02.05.2025 to 31.05.2025 |
3. | Scrutiny of Documents and publication of tentative preliminary Merit List of sports achievements by screening committee | Within 30 days from the last day of submission of online application. |
4. | Receiving of objections on tentative preliminary Merit List | Objections to the tentative preliminary merit list to be submitted by the candidate within 7 days of its release. |
5. | Disposal of Objections | Within 10 days from the last date of receiving the objections |
6. | Communication of Merit List to State level Committee | Within 10 days after disposal of objections. |
7. | Communication of Final Merit List to DSC | After approval of the State Level Committee |