WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP NMMS Examination December-2025 Results Released

AP NMMS Examination December-2025 Results Released

ANDHRA PRADESH::NATIONAL MEANS-CUM-MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION – DECEMBER-2025
COMMUNITY WISE LIST OF SELECTED CANDIDATES FOR AWARD OF SCHOLARSHIPS
నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు: ఎంపికైన అభ్యర్ధులు వెంటనే చేయవలసిన పనులు
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం 
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ.
పత్రికా ప్రకటన

తేది. 07-12-2025 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ఫలితములు విడుదల చేయబడినవి. ఈ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థుల యొక్క వెబ్ మెరిట్ కార్డ్ లు  ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో 12-08-206 నుండి అందుబాటులో ఉంచడమైనది. కావున ఎంపిక అయిన విద్యార్ధులు వెంటనే బ్యాంక్ అకౌంటు తెరిచి, విద్యార్థి ఆధార్ ను లింకు చేయించి, DBT ద్వారా డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకొనవలెను. ఎంపిక అయిన విద్యార్థులు వెబ్సైట్ నుండి వారి మెరిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరు మొదలగు వివరములు వారి ఆధార్ కార్డ్ పైన ఉన్న విధంగానే (ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా) ఉన్నవో లేదో తనిఖీ చేసుకుని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో నమోదు చేసుకుని అప్లికేషన్ ను సబ్మిట్ చేయవలెను. తదుపరి సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా అప్రూవ్ చేయించుకొనవలెను. ముద్రించిన మెరిట్ కార్డ్ లను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపడం జరుగుతుంది. వివరములు సరిపోలని విద్యార్థులు వెంటనే ఆధార్ mismatch వివరములు సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయవలెను. తప్పని సరిగా విద్యార్థి ఆధార్ విద్యార్ధి బ్యాంక్ ఖాతాకు సీడ్ చేయబడి, DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నగదు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు. (AP NMMS Examination December-2025 Results Released)

AP NMMS Examination December-2025 – Merit Card

DOWNLOAD

AP NMMS Examination December-2025 – Selected Candidate List

DOWNLOAD

AP NMMS Examination December-2025 – Results Link

DOWNLOAD

AP NMMS Examination December-2025 – Results Press Note

DOWNLOAD

How to get NMMS December 2025 Results in School login

  • Login to the official Website at bseap.org
  • On the left sidebar find NMMS
  • Click on it and Search for NMMS Results 2025
  • Enter School U-DISE Code/ Roll Number
  • Finally click on download tab

Official website CLICK HERE

Read also..

AP SSC / 10th Class Study materials & Question papers

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!